top of page

పల్లె పిలిచింది - 43

Updated: Sep 15

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #సీసం, #చంపకమాల

ree

Palle Pilichindi - 43 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 12/09/2025

పల్లె పిలిచింది - 43 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


54.

62.

సీసం.


మణివికాసుని తోడ మంజరి ప్రేమతో 

కబురులు తెల్పంగ గలగలనుచు 

నగవులు చిందించి నాతిమనసెరిగి 

నడుచుచుండెను బ్రీతిఁ నవయువకుడు 

జగదీశ చిత్రల సరసంపు చేష్టలు 

సరదాలపాటల సంబరములు 

పెద్దలు గమనించ ప్రేమభావన మించ 

కల్యాణములఁ జేయు ఘడియవచ్చె./


తేటగీతి.


మురిసి పిన్నల పెండ్లికి పూనుకొనుచు 

నూరి జనమెల్ల వడివడి నుత్సవముగ

విధులు సల్పుచు నుండగా వేడ్కమీర 

దీవెనల్‌ కురిపించిరి దివిజవరులు.//


భావము.


మణివికాసుడు, మంజరి ఒకరికొకరు ఇష్టపడుతున్నారు.జగదీశుడు,చిత్రలు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.ఈ విషయం పెద్దవాళ్ళు గమనించి, వారికి వివాహం చేయాలని అనుకున్నారు.ఊరి వాళ్ళందరూ చక్కగా పెళ్లి పనులు చేస్తూ ఉంటే, పైన దేవతలు దీవెనలు కురిపించారు.//


63.

తేటగీతి.


చెలియ చిత్రకు సరిజోడు చెలిమికాడు 

వరుస జగదీశుడు తగిన వరుడు ఘనుడు 

పార్వతిని బోలు సాధ్వియౌ వధువు దొరికె 

చూడ చక్కని జంటకు శుభము శుభము.//


భావము.

చిత్రకు సరిజోడు జగదీశుడు. వాళ్లిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వోలె ఉన్నారు.వారిద్దరికి శుభము శుభము.


64.

తేటగీతి.


మణివికాసునికి తగునీ మంజరి యని 

పెద్దలెల్లరు భావించ విమల మతులు 

పెండ్లి పనులను జేయంగ వివిధగతుల 

సంబరంబులు మిన్నంటె సంతసముగ.//


భావము.

మణివికాసునకు ఈ మంజరి తగిన జోడు అని పెద్దలంతా సంబరంగా పెండ్లి పనులు చేస్తున్నారు.//


65.

వచనము.


అట్లు  మణివికాసునితో మంజరికి, జగదీశునితో చిత్రకు వైభవముగా వివాహములు జరిగెను.నూతన వధూవరులు అమెరికా ఖండమునకు పయనమయిరి.

తదుపరి కొంత కాలము జరిగిన పిమ్మట శరదృతువు  వచ్చెను.//


66.

చంపకమాల.


చెఱువున దామరల్ విరిసి చిల్కెపరాగసుగంధ మాధురుల్ 

మురియుచు వ్రాలె భృంగములు పుష్పలతాంగుల మాధ్వి గ్రోలగన్ 

జరచర ప్రాగ్దిశన్ ద్యుమణి సాగెను మబ్బు సరాతి దీయుచున్ 

శరదృతు వీభువిన్ బరగ సాంత్వన. బొందెను జీవులన్నియున్.//


భావము.


శరదృతువు వచ్చింది. చెరువులో తామరలు విరిశాయి. మంచి సువాసనలతో పుప్పొడిని వెదజల్లు తున్నాయి. ఆ పుప్పొడి కోసం తుమ్మెదలు ఆనందంగా పూవుల మీద వాలుతున్నాయి. అప్పుడే తూర్పు దిక్కున చరచరా సూర్యుడు మబ్బుతెర తీసుకొని వస్తున్నాడు. శరదృతువు ఈ భూమి మీదకు రాంగానే జీవులన్నీ సేదతీరాయి.//


67.

ఉత్పలమాల.


శ్యామపు వర్ణమున్ బడసె సాలపు పర్ణము లెల్ల ధాత్రిలో 

సోముని పూర్ణ చంద్రికలు సొంపుగ తళ్కులు జిల్క ముచ్చటన్ 

జాములు దొర్ల హాలికులు సస్యపు రాసులు పెంపు చేసిరా 

యామినిలో శరత్తు కడు హ్లాదమొసంగె మనోజ్ఞరూపిగన్.//


భావము.

పసుపు పచ్చని రంగులోకి చెట్ల ఆకులన్నీ మారాయి. చంద్రుని వెన్నెలలు తళుకులు చిందుతున్నాయి. రైతులు ఏంతో కష్టపడి పంటలను పండించారు. ఆ శరదృతువు రాత్రిళ్ళు మాత్రం చాలా ఆహ్లాదంగా ఉన్నాయి.//


68.

తరలము.


విరహవేదన లుప్పతిల్లగ ప్రేమికుల్ బహు మూఢులై 

మరుని శల్యపు గాయముల్ తమ మానసంబును జీల్చగా 

కరిగిపోయెడి కాలమున్ గని కౌముదిన్ దెగ వేడుచున్ 

దిరుగు చుండిరి తాళ జాలక దీనులై దిగులొందుచున్.//


భావము.


ఆ వెన్నెల రాత్రులు అందరికీ చాలా ఆహ్లాదంగా ఉంటే,దూరదూరంగా ఉన్న ప్రేమికులు మాత్రం చాలా విరహవేదనను అనుభవిస్తూ దిగులుతో తిరుగుతున్నారు.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page