top of page

పల్లె పిలిచింది - 44

Updated: Sep 23

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #కందము, #ఉత్పలమాల

ree

Palle Pilichindi - 44 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/09/2025

పల్లె పిలిచింది - 44 - తెలుగు కావ్యము తృతీయాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


70.

వచనము.


రాజుపాలెములో నవరాత్రి యుత్సవములు జరుగుట.//


71.

తేటగీతి.


శరదృతువరు దెంచగ నూరి జనులు కలిసి 

యుద్యమించుచు నవరాత్రి యుత్సవములఁ

జేయసాగిరి ముదముతో చిందులేసి 

పల్లె గృహముల్ శోభతో పరవశించె.//


భావము.


శరదృతువులో నవరాత్రి ఉత్సవములు జరుగుతున్నాయి.పల్లెలో ఉన్న ప్రతి ఇల్లు వెలుగుతో నిండిపోయింది.


72.

తేటగీతి.


ఎల్లలన్నేలు చుండెడి దీశురాణి 

పిల్ల పాపలన్ బ్రోచును బ్రీతితోడ 

తల్లి పార్వతి రూపమున్ దలచినంత 

తరతరంబులు వర్థిల్లి తనరుచుండు.//


భావము.


ఈ భూమిని కాపాడుతూ పిల్ల పాపలను పోషించు తల్లి పార్వతి రూపాన్ని తలిచినంతనే తరతరాలు వర్ధిల్లుతాయి.


73.

తేటగీతి.


జగతి కాధారమౌ దేవి శాంతి నిలయ

వేన వేలుగ తరుణులు వివిధగతుల 

పూజలన్ సల్పి వేడుచు పుణ్య నిధిని 

పసుపుకుంకుమల్ పొందుచు వరలుచుంద్రు.//


భావము.

ఆ తల్లి ఈ జగతికి ఆధారమైనది. ఆమె శాంతిమతి. ఎన్నో వేలమంది మహిళలు ఈ నవరాత్రి సమయంలో దేవికి పూజలను చేసి, ఆమెను వేడుకొనుచు, పసుపు కుంకుమలతో సౌభాగ్యవతులై విలసీళ్లుతున్నారు.//


74.

తేటగీతి.


జయము జయమంచు తల్లిని సన్నుతించి 

భక్త సముదాయముల్ కొల్వ వాంఛ తీర్చి 

మందహాసమున్ జిల్కుచు మనికి నిల్పు 

పార్వతీ దేవి కిత్తురు వందనములు //


భావము.

ఆ తల్లికి జయము కలగాలని భక్తులెల్లరు కొల్వగా,చిరునవ్వుతో వాళ్ళ కోరికలు తీర్చు పార్వతీదేవికి వాళ్ళు నమస్కారములు చేస్తుంటారు.//


75.

ఉత్పలమాల.


బూరలు కాహళా ధ్వనులు మ్రోగెను దిక్కులు పిక్కటిల్లగా 

తీరిచి దిద్దిరా జనులు దేవళమంతయు సుందరంబుగన్ 

దోరపు బుద్ధితో కొలిచి తోషము నొందుచు భక్తులెల్ల సం

సారము కెల్ల జీవమిడు శాంభవి దీవెన కోరిరత్తఱిన్.//


భావము.


పెద్ద పెద్ద వాయిద్యాలు మ్రోగిస్తూ,ఆ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్ది, భక్తిగా జనులంతా మ్రొక్కుకుంటూ ఈ ప్రపంచానికి శక్తినిడు

 శాంభవిని దీవెనలిమ్మని కోరుకున్నారు.//


76.

వచనము.


ఆ సమయంబున లోకక్షేమమును గోరి మల్లనార్యుడు శ్రీపార్వతీదేవిని ప్రార్థించెను.

మల్లనార్యుడు దేవిని ప్రార్థించగ నా దేవి కరుణారసధారలను కురిపించెను.ఆ పిమ్మట రాజుపాలెములోని పరిస్థితులలో మార్పువచ్చెను.//


77.

కందము.


పండెను పంటలు పల్లెల

దండిగ కురియంగ నచట ధాన్యపు రాసుల్ 

పండుగ కళతో గృహములు 

నిండగ కనుపించె నపుడు నిత్యము శుభముల్ //


భావము.


ఆ పల్లెలో పంటలు చక్కగా పండుతున్నాయి.దండిగా ధాన్యపురాసులు గాదెల నిండుగా ఉన్నాయి. దాంతో ప్రజలంతా సంతోషంగా ఉండగా పండుగ కళతో ఆ పల్లె ఎంతో అందంగా ఉంది.//


#పల్లె పిలిచింది #కావ్యములోని తృతీయాశ్వాసము సమాప్తము




ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page