top of page
Original.png

కోపాన్ని నియంత్రించు!!

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

Kopanni Niyanthrinchu - New Telugu Poems Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 06/01/2026

కోపాన్ని నియంత్రించు - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


కోపాన్ని నియంత్రించు!!

----------------------------

చెరుపు చేయు కోపము

పాడగును ఆరోగ్యము

అదుపు చేస్తే మేలు

దొరుకుతుంది శాంతము


కోపంతో నష్టము

బంధాలకు విఘాతము

ఆదిలో త్రుంచితే

క్షేమమే అపారము


అన్నీ వ్యాధులకది

అవుతుంది కారణము

కల్లోలమగును మది

జాగ్రత్త అవసరము


చేయాలి నియంత్రణ

అది బ్రతుకులో రక్షణ

అధికమైన కోపము

అనర్ధాలకు మూలము

ree








వాస్తవ సత్యాలు

-----------------------------

ఒక వ్యక్తి గొప్పతనము

వారిలోని మంచితనము

బహిర్గతమైతేనే

పదిమందికి ఉపయోగము


గుండెల్లో ఆనందము

చూపించే ఆదర్శము

సార్ధకమైతేనే

ఉంటుంది ప్రయోజనము


నిక్షిప్తంగా ఉంటే

ఉపయోగం పాక్షికము

రవి కిరణమై రావాలి

అప్పుడే మేలు అనంతము


ప్రతిభ వెలికి తీస్తేనే

తేటతెల్లమగుతుంది

ముందడుగు వేస్తేనే

బహుమానం ఉంటుంది

ree













మౌనం గొప్పది

----------------------------------------

కొన్నిసార్లు మౌనమే

అర్ధాంగీకారమే

సమస్యల పరిష్కారము

అది కడు శక్తివంతము


ధ్యానంలో మౌనము

అందించును జ్ఞానము

మహా వృక్షం కూడా

ఎదుగును మౌనంగా


అవసరమే మౌనము

అందులోనే శాంతము

ఉంటుంది ఖచ్చితము

ఎంతైనా వాస్తవము


శాస్త్రవేత్తల మౌనము

చేకూర్చును లాభము

గొప్పగా గొప్ప పనులకు

చుట్టును శ్రీకారము

ree
















హుందాగా బ్రతకాలి

-----------------------------------------

కోల్పోతే వ్యక్తిత్వము

జీవితమే నిర్వీర్యము

అటుఇటు కాని చివరికి

అవుతుంది జీవచ్చవము


ఉండాలి హుందాగా

బ్రతకాలి గౌరవంగా

ఘన కార్యాలు చేసేసి

నిలవాలి ఉన్నతంగా


స్థిరత్వం మాటల్లో

మేటి పనులు చేతల్లో

ఉంటేనే గొప్పతనము

జీవితానికి అర్ధము


నీకంటూ ప్రత్యేకత

గౌరవించే అర్హత

కల్గియుండాలి తప్పక

నెరవేర్చాలి బాధ్యత

ree

















కీలకం"అవసరం"

-------------------------------------------

బంధాన్నీ కలుపుతుంది

లేదంటే తెంచుతుంది

అవసరమైతే అవసరము

ఎంతకైనా తెగిస్తుంది


బహు బలమైనది అవసరము

అదే గనుక లేకపోతే

ఉండదోయ్!ఆరాటము

బ్రతుకులోన పోరాటము


దేనినైనా చేయించును

వామనునిలా తొక్కును

జీవితాన అవసరము

అవుతుందోయ్! కీలకము


రకరకాల అవసరాలు

వాటికై అగచాట్లు

జీవితమంతా ఇంతే!

దీని పోకడ వింతే!

ree
















Vasthavala Jallulu - New Telugu Poems Written By Gadwala Somanna 

Published In manatelugukathalu.com On 04/01/2026

వాస్తవాల జల్లులు - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


వాస్తవాల జల్లులు

----------------------------

బ్రతుకులో ప్రశాంతంగా

కొండంత సంతోషంగా

ఉన్నోడు కోటీశ్వరుడు

సుఖ నిద్ర పొందేవాడు


ధైర్యాన్ని చూపివాడు

గొప్ప పనులు చేసేవాడు

ఘన చరిత్ర లిఖిస్తాడు

గుండెల్లో నివసిస్తాడు


మానవత్వమున్నోడు

మనిషిగా బ్రతికేవాడు

మహనీయుడే అవుతాడు

గౌరవం అందుకుంటాడు


భ్రమరంలాంటి మనసును

అదుపులో పెట్టేవాడు

విజేతగా నిలుస్తాడు

అన్నీ సాధిస్తాడు

ree








అక్షర సత్యాల ముత్యాలు

-----------------------------

మితిమీరిన గర్వము

చేయునోయి! పతనము

కల్గియుంటే మేలు

ఆభరణం వినయము


పెద్దవారి మాటలు

అభివృద్ధికి బాటలు

ఆలకిస్తే గనుక

అవి రక్షణ కోటలు


కన్నవారి ప్రేమలు

జీవితాన వెలుగులు

వారు చేయు సేవలు

త్యాగానికి గురుతులు


గురుదేవుల బోధలు

పోగొట్టును బాధలు

బ్రతుకులను సరిదిద్ది

కల్గించును సమృద్ధి

ree


















మంచితనమే మిగిలేది

----------------------------------------

జ్ఞానమెంత ఉన్నా

వినయ, విధేయుతలు

లేకున్న గుండు సున్న

అక్షరాల నిజమన్న


అహంకార ధోరణి

అత్యంత ప్రమాదము

ఆదిలో వదిలితే

ఎంతైనా క్షేమము


విర్ర వీగిన వారు

మట్టిలో కలిశారు

లోకమే శాశ్వతమని

తలచి గర్వించారు


వారి జాడ ఏదీ!

గాలించిన దొరకదు

చివరికి మంచితనం

మాత్రమే మిగిలేది

ree


















అమ్మకు అమ్మే సాటి

-----------------------------------------

అమ్మ ఉంటే మోదము

వెలుగుమయము సదనము

ఉన్న చోటే స్వర్గము

అనురాగాల దుర్గము


తల్లి మది మందిరము

అదెంతో సుందరము

ఆమె నోటి మాటలే

తేనె కన్నా మధురము


అమ్మ ఒడి వెచ్చదనము

పువ్వుల్లా మెత్తదనము

వెన్నెల్లా చల్లదనము

మల్లెల్లా తెల్లదనము


అమ్మకు అమ్మే సాటి

సృష్టిలోనే మేటి

అనిశమ్ము గౌరవించు

అమితంగా ప్రేమించు

ree













ఉండాలి ఉన్నతంగా

-------------------------------------------

మహానుభావులుగా

ఉన్నత వ్యక్తులుగా

ఇల ఉండాలంటే

మూలం కృషియేగా


వెలిగే దీపంలా

పారే సెలయేరులా

ఉండాలి ఉర్విలో

విరిసే గులాబీలా


ఎవరెస్టు శిఖరంలా

ఆలయ గోపురంలా

ఉండాలి గొప్పగా

నలుగురికి స్ఫూర్తిగా


బ్రతికినంతకాలము

ఆదర్శమవ్వాలి

లేకపోతే వ్యర్థము

ఉండదోయి అర్ధము

ree

గద్వాల సోమన్న







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page