లక్ష్యంతో అడుగు ముందుకు వెయ్యి
- Bhallamudi Nagaraju

- 11 hours ago
- 3 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Lakshyamtho Adugu Munduku Veyyi - New Telugu Poem Written By Bhallamudi Nagaraju Published in manatelugukathalu.com on 23/01/2026
లక్ష్యంతో అడుగు ముందుకు వెయ్యి - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
అంతరంగం లో మెదిలే
ఊహల రెక్కలకు ఊపిరులద్దు
ఆలోచనలకు పదును పెట్టు
అవాంతరాలను అధిగమించు
కన్నీటితో కరిగి పోతున్న
ఆశల స్వప్నాలను నిలువరించు
కష్టాలు తిష్ట వేసినా
సమస్యలు చుట్టు ముట్టినా
సడల నీకు నీ ధైర్యాన్ని
తీసుకోకు చెడు నిర్ణయాన్ని
చీకటిలో చిరుదీపమే కాదు
కొండంత ధైర్యం ఉండాలి
అదే నీకు అండగా నిలవాలి
విజయానికి మార్గసూచి కావాలి
కృంగి పోతే తప్పదు పరాజయం
మాటలు పట్టించు కుందికి. ..
కాదు సమయం
లక్ష్యం తో అడుగు ముందుకు వెయ్యి
విజయం నీకు దాసోహం.
మనసు ఉంటే మార్గం ఉంటుంది
ఇది నినాదం కాదు
జీవిత సత్యం అని తెలుసుకో
=======================================

Anuraga Devatha - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published in manatelugukathalu.com on 08/01/2026
అనురాగ దేవత - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
అలతి అలతి పదాలతో
జోలపాట పాడిన గుర్తులేదు
నన్నెత్తుకొని.. గోరుముద్దలు తినిపించిన జ్ఞప్తి లేదు
చేయి పట్టి అక్షరాలు దిద్దించిన జ్ఞాపకమసలే లేదు
ఆటల్లో గాయాలైతే
విచిత్రంగా తన కన్నుల్లో కన్నీరు
కట్టుకున్న చీరచింపి
గాయం పై కట్టిన వైద్యురాలు మా అమ్మ
నాకు పరీక్షలు వస్తున్నాయంటే
తను పూజలు..ఉపవాసాలు
విజయం సాధిస్తే తాను పరవశం
నాకు తినిపించేది పాయసం
బరువు బాధ్యతలు మోస్తూ
ఎవరేమన్నా మౌనంగా భరిస్తూ
మా తప్పులను క్షమిస్తూ
సన్మార్గం లో నడిపించే దేవత అమ్మ
మా కోసం తన కలల్ని
త్యాగం చేసిన త్యాగశీలి అమ్మ
మా భవిత కోసం
తపస్సు చేసే మౌనముని అమ్మ
రెక్కలు వచ్చి ఎగిరి పోతే
ఒక్క సారి కంటపడవా!అంటూ
ఆర్తిగా ఏడ్చేది అమ్మ
అరుగుమీద కూర్చొని ఎదురు చూసేది అమ్మ
వెళితే ఆనందించే ఆనందో బ్రహ్మ
లేకున్నా లక్షల అక్షింతలతో
దీవించే అపర బ్రహ్మ
అనురాగ దేవత మా అమ్మ
రమ్మన్నప్పుడు వెళ్ళలేదు
వెళ్లాలని ఉన్నా ఇప్పుడు లేదు
నువ్వు లేకున్నా
నీ ప్రేమ నా మదిలో పదిలం
నువ్వే నా దైవం
===============================================

Mouna Dhathri - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 05/01/2026
మౌన ధాత్రి - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
ఆమెకు వంటిల్లే ప్రయోగశాల
ఇల్లే ప్రపంచం
ఆరోగ్య ఫలాలు అందించే అన్నపూర్ణ
ఆమె అలుపెరుగని శ్రామికురాలు
అందరికన్నా ముందు లేచి
అన్నీ సమాకూర్చే అష్టావధాని
ఆమె ఓర్పులో భూదేవి
ఎవరేమన్నా మౌనధాత్రి
జీవిత రంగస్థలం లో
ఆమె పోషించని పాత్ర లేదు
ఆమె త్యాగాలకు కొలమానం లేదు
కరిగి పోతున్నా వెలుగులు నింపే జ్యోతి
చదువులు చెప్పే సరస్వతి
ఇంటిని నడిపే లక్ష్మీ
తప్పులు చేస్తే
దండించే దుర్గ
ఇల్లాలే ఇంటికి దైవం
ఆమె ఉన్న ఇల్లే స్వర్గం
ఆమే సర్వస్వం
ఆమె లేనిదే మనం లేము
అందుకే ప్రణమిల్లుదాం
***
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
భళ్లమూడి నాగరాజు ఒడిశా రాష్ట్రం రాయగడ కు చెందిన కవి ,రచయిత . వీరు విజయనగరం జిల్లా బొబ్బిలి లో 1962 లో జన్మించి విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేశారు.బొబ్బిలి రాజా ఆర్ ఎస్ ఆర్ కే రంగారవు కళాశాలలో చదువుతున్న సమయం లోనే కళాశాల వార్షిక సంచిక కోసం తొలి “యువతా మేలుకో”కవిత రాయగా,వార్షిక సంచికలో ప్రచురితం అయింది . ఉద్యోగ రీత్యా 1987 నుంచి రాయగడ లో ఉంటున్న వీరు స్పందన సాహితీ సాంస్కృతిక సంస్థ, రాయగడ రచయితల సంఘం వంటి సంస్థల్లో కీలక సభ్యులు గా ఉన్నారు. ఇప్పటివరకూ 37 కథలు వివిధ వార, మాసపత్రికల్లో ప్రచురితం అయ్యాయి. బామ్మ మనసు, సుబ్బారావు పెళ్లి, విజిటింగ్ కార్డు కథలు మంచి గుర్తింపు తెచ్చాయి.పలు కవితలు, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు పొందారు. 118 కవితలు దిన, వార , మాస,వెబ్ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. వీరిని గురజాడ ఫౌండేషన్ (అమెరికా)రాయగడ శాఖ వారు “సాహితీరత్న” అవార్డు తో సత్కరించారు. కవి, రచయిత గానే కాక వీరు నటుడుగా గుర్తింపు పొందారు. 2017 లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియం లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నటించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే ప్రశంసాపత్రం అందుకున్నారు.
భళ్లమూడి నాగరాజు,
కవి ,రచయిత ,
రాయగడ




Comments