పల్లె పిలిచింది - 50
- T. V. L. Gayathri

- Oct 15
- 3 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #తరలము

Palle Pilichindi - 50 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 15/10/2025
పల్లె పిలిచింది - 50 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
29.
తేటగీతి.
ధనము వెచ్చించి గోవులన్ గొనిన యువత
పాలు వెన్నల నమ్ముచు పట్టణముకు
భావి నిలువంగ బలిమితో పడుచు శ్రమను
కాలగతితోడ సాగిరి కలిమి పెంచ.//
తాత్పర్యము.
విదేశము నుండి వచ్చిన యువకులు వెంటనే గోవులను కొని, పాల ఉత్పత్తులను అమ్మి ధనాన్ని సంపాదించ సాగారు. భావి జీవితం నిలబడటానికి శ్రమ పడుతున్నారు.//
30.
తరలము.
దివము రాత్రియు చూడకుండిరి దీనతన్ విడనాడుచున్
నవపథంబున సాగుచుండిరి నమ్ముచున్ దమ బుద్ధినే
జవము నిల్పెడి భావనల్ మదిఁ శాంతినీయగ నా సఖుల్
యువతరంబుల మార్గదర్శకులుద్యమించిరి మేలుగా.//
తాత్పర్యము.
రాత్రి పగలు కష్టపడి తెలివితో పని చేస్తూ, లాభాలను పొందుతూ యువతరానికి మార్గ దర్శకులుగా నిలిచారు.//
31.
తేటగీతి.
నూనె గానుగల్ త్రిప్పుచు మేనువంచి
స్వచ్ఛమైనట్టి సరుకులన్ సంతలందు
నమ్ముకొనుచుండిరా సఖుల్ నమ్మకముగ
శక్తి కలిగిన వారికి జయము కలుగు.//
తాత్పర్యము.
స్వచ్ఛమైన గానుగ నూనెలను తయారు చేసి, లాభాలు గడిస్తూ మిత్రులు సుఖంగా గడుపుతున్నారు.//
32.
తేటగీతి.
మంజరియు,జిత్రయు కలిసి మదిని దోచు
వస్త్రములఁ నేత నేయుచు పట్టణమున
విపణి వీథిలో నమ్ముచు విత్తుఁ బడసి
కాలమున్ ముదమొందుచు గడిపిరపుడు.//
తాత్పర్యము.
మంజరి, చిత్ర కలిసి నేత చీరలు నేసి పట్టణాల్లో అమ్ముతూ డబ్బును సంపాదించి హాయిగా ఉన్నారు.//
33.
తేటగీతి.
గర్భిణీ స్త్రీల కీనాడు కల్గె సుఖము
వైద్యురాలైన హైమతాన్ ప్రతిభఁ జూపి
సేవఁ జేయుచు పల్లెలో చిరయశంబు
పొందుచుండగా జనులెల్ల మురిసి రంత.//
తాత్పర్యము.
వైద్యురాలైన హైమ పల్లెలో ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు చాలా నిశ్చింతగా ఉంది. ఆమె ప్రతిభ చూసి ఆ పల్లెలో ప్రజలంతా ఎంతో మురిసి పోతూ ఉన్నారు.//
34.
తేటగీతి.
పాఠశాలను నడుపుచు పల్లెయందు
వాణి విద్యలఁ బోధించి వరలు చుండ
పిల్ల లెల్లరు చదివిరి వివిధగతుల
గ్రామ సీమలో విజ్ఞాన కాంతు లెసగ.//
తాత్పర్యము.
వాణి పల్లెలో పాఠశాలను నడుపుతూ ఉండటం వలన పల్లెలో పిల్లలంతా చక్కగా చదువు కొంటున్నారు//
35.
తేటగీతి.
స్ఫూర్తిమంతులై సజ్జనుల్ కీర్తి బడసి
కాల మీవిధి గడుపుచు కలిసి మెలిసి
మల్లనార్యుని పుత్రులు మాన్యులగుచు
నడిచి రభివృద్ధి పథములో విడిచి బెంగ. //
తాత్పర్యము.
ఈ విధంగా మల్లనార్యుని కుమారులు కష్టపడి, సజ్జనులుగా మంచి కీర్తితో కాలాన్ని గడుపుతున్నారు.//
36.
వచనము.
ఇట్లు రెండు వర్షములు గడిచెను. మురికి తొలగించగా నదియును,చెరువులు స్వచ్ఛమైన జలములతో కళకళలాడ సాగెను.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments