పల్లె పిలిచింది - 48
- T. V. L. Gayathri

- Oct 8
- 3 min read
Updated: Oct 11
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

Palle Pilichindi - 48 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 08/10/2025
పల్లె పిలిచింది - 48 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
17.
తేటగీతి.
"మరలి రండిటు పల్లెకు మంచి జరుగు!
గంజి నీరైన ద్రావుచు గడుపు కొనుచు
మాతృభూమిలో బ్రతుకుడీ మానితముగ
పరుల సీమలో పొందెడి భాగ్యమేమి? //
తాత్పర్యము.
"మీరు స్వదేశానికి వచ్చేయండి!ఇక్కడ అందరితో కలిసి మన సీమలో గంజి నీళ్లు తాగినా హాయిగా ఉంటుంది.పరాయి దేశంలో పొందే భాగ్యం ఏముంటుంది?//
18.
తేటగీతి.
పొలము దున్నుచు బలముతో వలసినంత
స్వేచ్ఛగా తిరుగాడుచు చింత మరచి
సొంత గృహమున వాసము సుఖము కాద!
మాతృభూమిలో నిల్చుటే మనకు తగును.//
తాత్పర్యము.
మన దేశంలో పొలం దున్నుకొని బ్రతికినా చాలు స్వేచ్ఛ ఉంటుంది. మన ఇంట్లో మనం ఉంటే మనకు సుఖంగా ఉంటుంది. మాతృభూమిలో ఉండటం మేలు మనకు.//
19.
తేటగీతి.
పచ్చడి మెతుకులే యమృతమౌ భయము వదలి
తల్లి దండ్రుల సేవలో తనరు చుండి
పిల్లపాపలన్ బెంచుచు ప్రీతిమీర
జీవనంబును గడుపుటే శ్రేయమిపుడు.//
తాత్పర్యము.
ఇక్కడ పచ్చడి మెతుకులు తిన్నా అమృతం లాగా ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ప్రేమగా మన పిల్లల్ని పెంచుకోవటమే మనకు చాలా క్షేమము.//
20.
తేటగీతి.
ప్రేమతో మిమ్ములన్ జూడ పెద్దలెల్ల
నిముసమొక్క యుగంబుగ నెట్టుచుండ్రి
సత్వరము పయనించి మీ జంకు వీడి
పల్లెకడకు రారండమ్మ!ప్రాపు దొరకు!//
తాత్పర్యము.
మీరు ఇక్కడికి రండి!మిమ్మల్ని చూడాలని పెద్దవాళ్ళు క్షణక్షణం గడుపుతున్నారు. వెంటనే బయలుదేరి రండి!//
21.
తేటగీతి.
విద్యలెన్నియో నేర్చిరి విమలగతిని
ధీరవంతులౌ మీరలు నీరసముగ
కాలమివ్విధి దిగులుగా గడుపవలదు
పరుల దేశంబు వీడిన ఫలము కలుగు".//
తాత్పర్యము.
మీరు చాలా చదువుకొన్న వాళ్ళు. ఇలా నీరసపడవద్దు. ధైర్యంగా ఆ పరాయి దేశాన్ని విడిచి రండి!//
22.
వచనము.
ఇట్లు హైమ సఖులకు నుత్తరంబును వ్రాసెను. శ్రీనివాసుడు, వీరేశుడు మరియు పెద్దలందరు చరవాణి ద్వారా జగదీశ, చిత్ర, మణివికాస మరియు మంజరిలతో మాట్లాడి, వెనువెంటనే రాజుపాలెమునకు రమ్మని యాజ్ఞాపించగా ననతి కాలములో విదేశమునుండి పల్లె వాసులు స్వదేశమునకు మరలి వచ్చిరి. పెద్దలు, పిన్నలు కలిసి మల్లనార్యుని గృహమున సమావేశమయ్యిరి.
మణివికాసుడు భవిష్యత్తు గురించి భయముతో నిట్లు పలుకసాగెను.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:




Comments