పల్లె పిలిచింది - 54
- T. V. L. Gayathri

- Nov 4
- 4 min read
Updated: Nov 8
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #సీసము

Palle Pilichindi - 54 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 04/11/2025
పల్లె పిలిచింది - 54 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
56.
వచనము.
ఇట్లు కాలము సాగుచుండగ ధరణిపై హేమంతఋతువరుదెంచెను.//
57.
సీసము.
హేమంతఋతుశోభలీ భువిఁ వెలుగంగ
మార్గాళి మాసంబు మరలివచ్చె
విష్ణుసేవలఁ జేయు వెలదులు భక్తిగ
గోదమ్మనత్తఱిఁ గొల్చిరంత
ప్రాతస్సమయమున బాశురంబులఁ బాడి
స్నానార్థమై వడి సాగుచుండ్రి
కన్నెపిల్లలనోము కనువిందు చేయగా
పరవశంబుగ జిన్న పల్లెమురిసె.//
తేటగీతి.
ధాన్యరాసులు పొంగగ ధర్మగతిని
పౌష్యలక్ష్మికి ముదముగ స్వాగతమిడి
పశువులనలంకరించుచు వైభగావముగ
దానముల్ చేసి రా జనుల్ దాంతు లగుచు
తాత్పర్యము.
హేమంత ఋతువులో భూమి వెలిగిపోతోంది. మార్గశిర మాసం వచ్చింది. విష్ణు మూర్తికి సేవలను చేయు మహిళలు భక్తిగా గోదాదేవిని కూడా పూజిస్తున్నారు. ప్రొద్దున్నే పాశురాలను పాడుకొంటూ కన్నె పిల్లలు స్నానాలు చేయటానికి వెళుతున్నారు. ఆ నోము చూస్తూ ఆ చిన్న పల్లె మురిసిపోయింది. పౌష్యలక్ష్మిని స్వాగతించి, జనులు ఆనందంతో పశువులను అలంకరిస్తూ దానధర్మాలు చేస్తున్నారు.//
58.
సీసము.
మిహికబిందువులెల్ల మేదినీ తలముపై
తెలివగు ముత్యాల వలెనుతోచె
బంతి చామంతుల ప్రసవముల్ వికసించ
తొలిప్రొద్దు పుడమిని తొంగిచూచె
చల్లనిగాలులసంగీతరవములు
విని జగము కనులు విప్పిచూచె
తేటిగుంపుల హేల తిలకించి కుసుమాలు
తన్మయత్వంబుతోతలలనూచె//
తేటగీతి.
చెరువుల విరిసి తామరల్ చిల్క మధువు
పరిమళంబులు దిశలందు ప్రబ్బుకొనెను
పులుగు తతి యెగయంగనా మొయిలు దారిఁ
బరవశించిన భానుండు పక్కుమనియె//
తాత్పర్యము.
మంచుబిందువులు భూమి మీద రాలగా తెల్లని ముత్యాల వలె కనిపిస్తున్నాయి.తెల్లవారగానే బంతి, చామంతుల పూవులు వికసిస్తున్నాయి. చల్లని గాలుల సంగీతం విని జగమంతా కనులు తెరిచింది. తుమ్మెదల గుంపుల విలాసం చూసి పూవులు తన్మయత్వంతో తలల నూపుతున్నాయి. చెరువుల్లో ఉండే తామరపూవుల సుగంధ పరిమళం దిక్కుల నిండా వ్యాపించింది.పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే సూర్యుడు పరవశంతో ఫక్కుమని నవ్వుతున్నాడు.//
59.
సీసము.
ఉత్తరాయణములో నుదయించిన భగుడు
దివ్యమౌ శోభతో తిరుగుచుండె
ముగ్గుల యందాలు ముచ్చట గొల్పగ
గాంచుచుండిన రవి కదలడాయె
గొబ్బిళ్లపై నిల్చి గుమ్మడి పూవులు
గోపతిన్ వేడ్కగ గొక్కరించె
కిరణాలు వెదజల్లి కెరలుచు దినమణి
తర్జనిన్ జూపించి తరలిపోయె./
తేటగీతి.
పర్వదినములేతెంచగ ప్రాకటముగ
జరుపు చుండిరా జనులెల్ల సమతఁ గోరి
పిన్నపెద్దలు కలిసిరా వీథులందు
నాటపాటలతో పల్లె లందగించె.//
తాత్పర్యము.
ఉత్తరాయణంలో ఉదయించిన సూర్యుడు దివ్యమౌ వెలుగుతో తిరుగుతున్నాడు.ముంగిళ్ల ముందు ముచ్చటగా వేసి ఉన్న ముగ్గులను చూచి సూర్యుడు కదలకుండా ఆగిపోయాడట!ఆ ముగ్గుల మధ్యలో పెట్టిన గొబ్బిళ్ల పై ఉండే గుమ్మడి పూవులు సూర్యుడిని సరదాగా వెక్కిరిస్తున్నాయట. తన కిరణాలు వెదజల్లి సూర్యుడు బెదించటానికి చూపుడు వేలును చూపి వెళ్లి పోయాడట!అలా పండుగను జరుపుకుంటూ ఆ పల్లె ప్రజలు వీథులలో కలిసి ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు.//
60.
సీసము.
హరిదాసుమేళంబులా పల్లె ముంగిట
తిరుగుచు నుండగ దెల్లవారె
డూడూ బసవలతో నాడుకొనుచు కుఱ్ఱ
వాండ్రట గంతులు వైచిరపుడు
పిండివంటలఁ జేయ పడతులు ప్రీతిగ
విందుకై నిల్చిరి పిల్లలాహ!
పల్లెలో కొష్ఠముల్ పరిశుభ్రముగ జేసి
పసుపు కుంకుమఁ బెట్టి పసుల తతికి /
తేటగీతి.
పూజలన్ సల్పిరి జనులు పుణ్య మనుచు
పాలుపొంగిన గడ్డలో పసిడి పండి
గాదెలన్నియు నిండగ కలిమి కురిసె
నన్నదాతలకెదురేది యవనియందు?//
తాత్పర్యము.
తెల్లవారగానే హరిదాసుల మేళాలతో తిరుగుతుంటారు. డూడూ బసవన్నలతో ఆడుకొంటూ చిన్న పిల్లలు గంతులు వేస్తున్నారు. మహిళలు పిండి వంటలను చేసి ప్రేమగా పిల్లలకు తినిపించాలని పిలుస్తున్నారు. ఆహాహా!జనులు పశువుల కొష్ఠములను శుభ్రం చేసి, పశువులకు పూజలను చేశారు. పసిడి పంటలతో అన్నదాతలు హాయిగా ఉండగా వారికి ఎదురేది?//
61.
సీసము.
ఆడుబిడ్డలు రాగ నానందమున మున్గి
కోర్కెలు తీర్చుచు కూర్మిమీర
భువిని గొల్చుచు జనుల్ బొంగళ్లు పెట్టగన్
భోగిపండుగ తెచ్చె భోగమిపుడు
సంకురాతిరి వేళ సంబరంబులుసేసి
యాదిత్యునికి ప్రజ లర్ఘ్యమిడిరి
కనుమలో కోష్ఠాలు కళకళలాడగ
బశువులఁ సేవించి వరలుచుండ /
తేటగీతి.
కూడిరి మహిళల్ బొమ్మల కొలువులందు
చిన్న బిడ్డలన్ దీవించి శ్రేయమనుచు
భోగిపండ్లను తలలపై పోయుచుండి
వాయనంబులన్ బంచిరా వనితలెల్ల.//
తాత్పర్యము.
ఇళ్లకు ఆడబిడ్డలు రాంగానే వాళ్ళు అడిగిన వన్నీ ఇచ్చి ప్రజలు పొంగళ్ళు పెట్టారు. ప్రజలు భోగి పండుగ భోగమును తెస్తుందని, సంక్రాంతి వేళ సంబరాలు చేస్తూ, కనుమ నాడు పశువులను పూజించారు.ఆ పండుగ వేళ మహిళలు అందరూ కూడి బొమ్మల కొలువులు పెట్టి, చిన్న బిడ్డలకు భోగి పండ్లు పోసి, వాయనాలను ఇచ్చి పుచ్చు కొన్నారు.//
62.
సీసము.
గాలిపటంబులా గగనమున్ జుంబింప
మబ్బుకన్నెలపుడు మాయమయిరి
కోడిపందాలతో కుర్రకారు చెలగ
నస్థిరంబుగ సిరి యాడుచుండె
సంక్రాంతి పర్వంబు సమతకు చిహ్నంబు
వాడవాడల నిండె ప్రాభవంబు
చైతన్యదీప్తుల జాగృతిన్ గనుకొని
ధర్మపరులు జనుల్ ధన్యులైరి./
తేటగీతి.
నీతినియమాలు వర్థిల్ల నేటితరము
భవ్యమైనట్టి ప్రగతితో పరుగులిడగ
ధీమణుల్ వరలెడి జాతి దిశలఁ గెలుచు
భారతీయుల కెదురేది వసుధయందు?//
తాత్పర్యము.
గాలిపటాలను ఎగరేయగా మబ్బులు కనిపించటం లేదు. కోడి పందాలతో కుఱ్ఱవాళ్ళు ఆడుతూ ఉంటే ధనం చేతులు మారుతూ ఉంది. సంక్రాంతి పండుగ అంటేనే సమైక్యతకు చిహ్నం. జాతి జాగృతమయింది. ధర్మపరులు జనులు. నేటి తరము కూడా నీతి నియమాలతో వర్థిల్లగా దేశము ప్రగతితో పరుగు పెడుతోంది. మన దేశానికి ఎదురేది?/( లేదని భావము )

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:




Comments