పల్లె పిలిచింది - 52
- T. V. L. Gayathri 
- 6 days ago
- 3 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి, #తరలము

Palle Pilichindi - 52 - New Telugu Poetry Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/10/2025
పల్లె పిలిచింది - 52 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము
రచన: T. V. L. గాయత్రి
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్లె పిలిచింది పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
42.
తరలము.
గనుల త్రవ్వక మాగిపోవగ గ్రామ సీమకు నా గిరుల్
వెనుక రక్షగ నుండి సంపద పెంపుగా కురి పింపగన్
దనరు చుండిన కోయ గుంపులు తల్లి భూమికి మ్రొక్కగన్
వన విహారము సల్పు చుండిరి పౌరులెల్లరు హాయిగన్.//
తాత్పర్యము.
ప్రజలు గనులను త్రవ్వటం మానివేశారు.ఆ చుట్టు ప్రక్కల గ్రామసీమలకు పర్వతం రక్షణగా నుండి సంపదల నిస్తోంది. ఆ పర్వతం మీద ఆధారపడిన కోయ వాళ్ళు భూమి తల్లికి మ్రొక్కుకుంటూ ఉన్నారు. ప్రజలు హాయిగా వనవిహారానికి వస్తూ ఉన్నారు ( టూరిజం)//
43.
తేటగీతి.
వనము లెల్లడ పెంచగన్ వరదముప్పు
తగ్గి పోవగ జనులకు తర్షమిడుచు
స్వచ్ఛతన్ బొంది ఝరులట సాగుచుండ
శాంతి కల్గెనా సీమలో సమధికముగ.//
తాత్పర్యము.
అన్ని చోట్లా వృక్షాలు పెంచటంతో వరద ముప్పు తప్పింది. నదులు స్వచ్చంగా పారుతున్నాయి. అంతటా శాంతి వర్థిల్లింది.//
44.
తేటగీతి.
కామధేనువుల వలెను కామితములు
తీర్చి గోవులా పల్లెలో తిరుగుచుండ
గొల్లపల్లెచందంబుగ పల్లె నిల్వ
పిన్న పెద్దలు మున్గిరి వేడ్కలందు.//
తాత్పర్యము.
కామధేనువుల వలె ఆ గ్రామంలో గోవులు తిరుగుతూ పాడి సంపద నిస్తున్నాయి. ఆ పల్లె ఇప్పుడు ద్వాపరయుగంలోని వ్రేపల్లెను తలపిస్తోంది. ఆ ఊరి ప్రజలందరు వేడుకల్లో మునిగారు.//
45.
తేటగీతి.
పూర్వ వృత్తులన్ పౌరులు పొల్పుమీర
సల్పు చుండిరి శక్తితో శ్రమను నమ్మి
వైభవంబును పొందిన పల్లెను గన
రామరాజ్యంబుగన్ దోచె గ్రామమిపుడు.//
తాత్పర్యము.
ఆ గ్రామస్తులు పూర్వ వృత్తులను చేపట్టి శ్రమను నమ్మి జీవనం సాగిస్తున్నారు. వైభవంబుగా విలసిల్లుచున్న ఆ గ్రామాన్ని చూస్తుంటే రామరాజ్యం మళ్ళీ వచ్చిందేమో అనిపిస్తోంది.//
46.
తేటగీతి.
వలస వెడలిన జనులెల్ల విలువ నెఱిగి
పల్లె సీమను జేరంగ ప్రజలు మురిసి
బంధుమిత్రులన్ కూడుచు బడసి ముదము
దానధర్మముల్ జేసిరి ధర్మయుతులు.//
తాత్పర్యము.
వలస వెళ్లిన ప్రజలు తిరిగి పల్లెకు వస్తున్నారు.బంధు మిత్రులందరు కలుసుకొని సంతోషంతో దానధర్మాలు చేస్తూ నియతిగా ఉన్నారు.//
(సశేషం)

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments