top of page
Original_edited.jpg

పల్లె పిలిచింది - 55

  • Writer: T. V. L. Gayathri
    T. V. L. Gayathri
  • Nov 8
  • 4 min read

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పల్లెపిలిచింది, #PallePilichindi, #తేటగీతి

ree

Palle Pilichindi - 55 - New Telugu Poetry Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 08/11/2025

పల్లె పిలిచింది - 55 - తెలుగు కావ్యము చతుర్థాశ్వాసము

రచన: T. V. L. గాయత్రి

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పల్లె పిలిచింది పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పల్లె పిలిచింది పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



ఫలశ్రుతి.


63.

వచనము.


ఇట్లు రాజుపాలెపు పౌరులు తమ కృషి, పట్టుదలలతో గ్రామమును అభివృద్ధి చేసికొని దేశములోనే తమ గ్రామమును ఆదర్శగ్రామముగా నిలిపిరి.//


64.

తేటగీతి.


వలసదారులు మరలిన పల్లె కొఱకు 

చేతి వృత్తుల నభివృద్ధి చేయుచుండ 

గ్రామవాసులు కానరు కరువు నెపుడు 

పల్లె సీమలే జాతికి పసిడి గనులు!//


తాత్పర్యము.


వలస వెళ్లిన ప్రజలు వెనక్కు వచ్చేశారు. చేతి వృత్తులను అభివృద్ధి చేసినపుడు గ్రామాల్లో కరువు ఉండనే ఉండదు. జాతికి పల్లె సీమలే బంగారు గనులు.//


65.

తేటగీతి.


కష్టనష్టముల్ సోకని కాలమందు

సస్యసంపదల్ పెంపొంద సమధికముగ

సిరులు కురియంగ బంగారు సీమలందు

పచ్చ పచ్చగ పల్లెలు పరిఢవిల్లు.//


తాత్పర్యము.


కష్టనష్టాలు లేని సీమలో పంటలు సమృద్దిగా పండుతూ ఉంటే ఆ పల్లెలు పచ్చగా ఉంటాయి.//


66.

తేటగీతి.


క్షీరధారలు కురిపించు పైరములట

పసులు గ్రాసమున్ దినుచుండి వనములందు 

గంతులేయుచు నుండగ కలిమి పొంగి 

భారతావని పొందు సౌభాగ్యమపుడు.//


పైరములు= గోవులు.


తాత్పర్యము.

 

పాలిచ్చే ఆవులు పచ్చగడ్డిని తింటూ ఆ అరణ్యాలలో గంతులు వేస్తూ ఉంటే మన దేశం సౌభాగ్యంతో విలసిల్లుతుంది.//


67.

తేటగీతి.


జలములన్నియు స్వచ్ఛమై జాలువార

నీటి తోడ నా చెరువులు నిండిపోవ 

భువికి నిత్యము రైతులు బువ్వపెట్టి

తనరు చుండెడి కాలమే ఘనతరంబు.//


తాత్పర్యము.


నదుల్లో జలాలు స్వచ్ఛంగా పారుతూ ఉంటే, చెరువులన్నీ నిండి ఉంటే ఈ భూమికి రైతులు ఇంత బువ్వ పెడుతుంటే ఆ కాలమే చాలా గొప్పది.//


68.

తేటగీతి.


అన్నదాతల హృదియందు నాశ మొలచి

వెన్నెముకలౌచు జాతికి పెన్నిధులిడ

భరత దేశపు పల్లెలు పసిడి సిరులు

జల్లు చుండగా జాతికి జయము కలుగు.//


తాత్పర్యము.


రైతులే దేశానికి వెన్నెముకలౌతారు.ఆశతో జీవిస్తూ రైతులు దేశానికి సంపద లిస్తూ ఉంటే జాతికి జయము కలుగుతుంది.//


69.

తేటగీతి.


ప్రకృతిఁ రక్షింప ధారుణి వర్థిలునను 

సత్యమున్నెఱుంగ వలయు జనులు సతము 

భువిని పూజించి మనుజులు పుణ్యనిధుల 

పొంది శాంతిగ జీవింప పొలయు సుఖము.//


తాత్పర్యము.


ప్రకృతిని రక్షిస్తే ఈ భూమి వర్థిల్లుతుందనే సత్యాన్ని జనులు తెలిసికోవాలి. ఎల్లప్పుడూ భూమిని పూజించి జనులెల్లరు శాంతిగా జీవిస్తే సుఖాన్ని పొందుతారు.//


70.

తేటగీతి.


రాజుపాలెపు పౌరులు రమ్యరీతి

భోగభాగ్యముల్విరివిగ బొందుచుండి 

కీర్తివంతులై నిల్చుచు స్ఫూర్తి నింపి 

జాతి కెల్ల నాదర్శమై సాగుచుండ్రి.//


తాత్పర్యము.


ఈ విధంగా రాజుపాలెపు పౌరులు చక్కగా భోగ భాగ్యలను పొంది కీర్తివంతులై జాతి కాదర్శమై సాగుతూ ఉన్నారు.//


71.

తేటగీతి.


ఇట్టి కావ్యమున్ బఠియింప నెఱుకకల్గు 

మానవుల మదిఁదొలగును మసటు కొంత 

ప్రకృతిపై ప్రేమ లెసగంగ భావితరము 

ప్రగతి పథమున నిత్యము పరుగులిడును.//


తాత్పర్యము.


ఇట్టి కావ్యాన్ని చదివితే జ్ఞానము కలుగుతుంది. మానవుల మనస్సులో ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రకృతిపై ప్రేమ పుడుతుంది. భావితరము ప్రగతి బాటలో పరుగు పెడుతుంది.//


72.

వచనము.


ఇట్లు తోకచిచ్చు విజయలక్ష్మి గాయత్రి అను నేను పల్లెపిలిచింది అను పద్యకావ్యమును వ్రాసి, భూదేవి కంకితమొనర్చి, మంగళములు పలికి మ్రొక్కితిని.//


73.

మత్తకోకిల.


మంగళంబులు జీవకోటికి మంగళంబులు ధాత్రికిన్ 

మంగళంబులు మానవాళికి మంగళంబులు జాతికిన్ 

మంగళంబులు మాతృభాషకు మంగళంబులు నొజ్జకున్ 

మంగళంబిడి పద్యవిద్యకు మానితంబుగ మ్రొక్కితిన్.//


(సమాప్తం.)

ఈ కావ్యాన్ని ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఇంత చక్కటి కావ్యాన్ని పాఠకులకు అందించిన రచయిత్రి టి. వి. యెల్. గాయత్రి గారికి ప్రత్యేక అభినందనలు.




ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page