top of page

ఫాదర్స్ డే

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #FathersDay, #నాన్న, #ఆటవెలది

ree

Fathers Day - New Telugu Poem Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 15/06/2025

ఫాదర్స్ డే - తెలుగు కవిత

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


ఆట వెలది:

నడక నేర్పి మంచి నడతను తెలుపును,

కన్ను లందు నిలిపి కాచు నతడు

నీదు ప్రగతి కొరకు నిత్యశ్రామికుడగు 

నాన్న కాక యెవరు మిన్న మనకు?

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

జగతి నందు మనకు జన్మని చ్చియతడు

కంటి రెప్ప వోలె కాచు నెపుడు

తన్ను తాను మరచి తనవారి వృద్ధికై

కష్ట ములను కూడ నిష్ట పడును.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

బ్రతుకు విలువ తెలిపి భద్రత మనకిచ్చి

తాను పడెడి శ్రమను తలవ  కుండ

విలువ లన్ని తెలిపి విజయమొందుటనేర్పు

నాన్న చాలు మనకు మిన్ను గెలువ.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

తల్లి విలువ తెలిపి  తనగొప్ప తెలుపడు

మరచి పోవు నిద్ర మనల కొరకు

కొడుకు  వృద్ధి  తనకు కోరికనుచు తెల్పు

అల్ప జీవి నాన్న యవని యందు.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀




ree

-వెంపరాల దుర్గాప్రసాద్




Comments


bottom of page