ఘన సందేశము
- Gadwala Somanna
- Nov 18, 2024
- 1 min read
Updated: Nov 25, 2024
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#GhanaSandesam, #ఘనసందేశము

Ghana Sandesam - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 18/11/2024
ఘన సందేశము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
తీపి గొంతు కోయిల
ప్రతిభను చూపమంది
పున్నమి నాటి వెన్నెల
చల్లగ ఉండమంది
గగనంలో తారక
చురుగ్గా మెలగమంది
మనసులోని కోరిక
ఆగక సాగమంది
సాగరాన కెరటము
బద్దకం వద్దంది
జీవితాన సుగుణము
కృతజ్ఞత మేలంది
శ్రేష్టమైన స్నేహము
మంచిని చేయమంది
విలువైన పుస్తకము
పఠనం ముఖ్యమంది
-గద్వాల సోమన్న
Comments