top of page

గ్రెగర్ జాన్ మెండల్ - జన్యు శాస్త్ర పిత


'Gregor john Mendel - Father Of Genetics ' Telugu Article By N. Sai Prasanthi


రచన: N. సాయి ప్రశాంతి



మనందరికీ తెలుసు, పిల్ల జీవుల లక్షణాలు తమ తమ పూర్వీకులని పోలి ఉంటాయని.

తల్లి దండ్రుల పోలికలతో జీవులు జన్మిస్తాయి, జన్యు శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత, అణు జీవ శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత, ఈ విషయాలు సులభంగానే తెలుసుకోగలము.

కానీ ఇవేవీ లేని 1860ల కాలంలో ఒక శాస్త్రవేత్త కానటువంటి వ్యక్తి, ఏ ఆధునిక పరికరాల సహాయం లేకుండానే తన తోటలోనే స్వయంగా పరిశోధన చేసి, అనువంశికత ఏ విధంగా సంక్రమిస్తుందో తెలియజేసాడు, ఆ వ్యక్తే ఆస్ట్రియాకు చెందిన గ్రిగర్ జాన్ మెండల్.

వృత్తి పరంగా ఒక చర్చి లో సన్యాసి అయినా జీవ శాస్త్రం అందులోనూ వృక్ష శాస్త్రం అంటే చాలా ఇష్టపడే వాడు.

అయితే స్వయంగా తోట బఠాణీల మీద ప్రయోగాలు తన తోటలోనే చేసాడు.

పొడుగు మొక్కలను పొట్టి మొక్కలతో ఫలదీకరణ జరిపి ఫలితాలను పుస్తకంలో రాసుకున్నాడు.


స్వయంగా పుప్పొడిని తన చేతులతో అద్దాడు.

ఈ ప్రయోగ ఫలితాలను సాధించడానికి ఎంతో శ్రమించి కొన్ని తరాలపాటు ప్రయోగాలు కొనసాగించాడు.


ఆ ఫలితాల ప్రకారం,కొన్ని లక్షణాలు బహిర్గతంగా ఉంటే, మరికొన్ని అంతర్గతంగా ఉండిపోతాయి.

ప్రయోగానికి ఎంచుకున్న మొక్కలు మరియు, పద్ధతులు పక్కాగా ఎంచుకోవడం వల్ల విజయం సాధించాడు.


మెండల్ చేసిన పరిశోధనలవల్ల అనువంశికత ఏ విధంగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుందో తెలియవచ్చింది.


అందువల్లే మనం మెండల్ ని జన్యుశాస్త్ర పిత అని వ్యవహరిస్తున్నాం.

మెండల్ యొక్క 200వ జయంతి సంవత్సరం సందర్భంగా ఆయనని గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

(మెండల్ 200వ జయంతి సంవత్సరం సందర్భముగా)

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

చిన్ని కోరికలు

పరిణామాన్ని మనం చూడగలమా??

సంస్కృత భాష మరియు విజ్ఞాన శాస్త్రము

సంకల్ప శక్తి

సందేశ తరంగిణి

ముగ్గురు స్నేహితులు

శాంతి సత్యం



రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.


90 views0 comments
bottom of page