సంస్కృత భాష మరియు విజ్ఞాన శాస్త్రము

'Sanskrit Language And Science ' Telugu Article By N. Sai Prasanthi
రచన: N. సాయి ప్రశాంతి
భారతీయ సంస్కృతి ఎక్కువగా సంస్కృత భాషతో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలే కాకుండా లౌకిక వ్యావహారిక విషయాలు భాషతో ముడిపడి ఉంటాయి. పూర్వకాలంలో సంస్కృత భాష అధికార భాషగా వ్యవహరించబడింది మరియు సంస్కృతాన్ని దేవభాష అనేవారు.
మరియు వేద పురాణ వాఙ్మయం అంతా సంస్కృతంలో ఉంది
అయితే వేదాలు మనం భావించే విధంగా పుస్తకాలు కావు
వివిధ కాలాలలో ఉండే బుుషులు దర్శించిన వివిధ విషయాల సంగ్రహమే వేదాలు.
అందులో ఆధ్యాత్మిక విషయాలే కాక సామాజిక లౌకిక వైజ్ఞానిక విషయాలు కూడా ఉన్నాయి.
వేదాలు, సంస్కృత సాహిత్యం అనంతమైనవి కాబట్టి కొన్ని ఉదాహరణలు మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం
ప్రకృతి మరియు విశ్వం శబ్ద స్పర్శ రూప రస గంధములతో మరియు త్రిగుణములతో ఏర్పడినది.
వైదిక విజ్ఞానం ప్రకారం సత్వ రజో గుణం మరియు తమో గుణం అనే మూడు గుణాలతో ప్రకృతి ఏర్పడింది
పంచ భూతాలైన ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు అగ్నిలలో వివిధ స్థాయిలలో గుణాలు ఏర్పడ్డాయి
ఆకాశం -శబ్ద స్వరూపం
వాయువు - శబ్దము మరియు స్పర్శ
అగ్ని - శబ్దము, స్పర్శ, రూపము
నీరు - శబ్దము, స్పర్శ, రూపము, రసము
భూమి - శబ్దము, స్పర్శ, రూపము, రసము మరియు గంధము
మరియు పరబ్రహ్మం అనగా దివ్య శక్తి మరియు మహత్ మరియు ఈశ్వరుడు అనగా ప్రథమ సృష్టి శక్తి
ప్రాణం మరియు ఆకాశం అనగా పదార్థం మరియు శక్తి గా వేద వాఙ్మయంలో వివరించబడింది.
పురుష సూక్తములో
సృష్టి పరిణామం గురించి వివరిస్తూ ఈ విధంగా చెప్పబడింది
మొదటగా పోషక పదార్థం ఏర్పడింది అది జీవుల పెరుగుదలకి సహాయపడుతుంది.
పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన్
ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే
పశు అనగా పశువులు
వాయవ్యము అనగా పక్షులు
ఆరణ్యము అనగా వన్య జంతువులు
గ్రామ్యము అనగా పెంపుడు జంతువులు
పురుష సూక్తంలో అడవులలో నివసించే వాటిని
జంతువులు అని, గ్రామాలలో మనుషులు పెంచుకునే వాటిని పశువులు అని వివరించబడింది.
ఒకే వరుస దంతము గల అశ్వములు మరియు
ఉభయాదత:
రెండు వరుస దంతములు గల మేకలు గొర్రెలు ఆవులు గేదెలు మొదలైనవి వరుసగా ఆవిర్భవించాయి.
సృష్ట్యా పురాణి వివిధాన్య శక్త్యవృక్ష ాన్
సరీసృపాన్ పశూన్ ఖగదంశ మత్స్యమ్
తస్తై అతుష్ట హృదయ: పురుషం విదాయ
బ్రహ్మావలోకాధిషణం ముదం మాపదేవ
ఈ శ్లోకం విష్ణు పురాణం లోనిది
ఇందులో రకరకాల జీవజాతులు ఏర్పడ్డాయి అని వివరించారు
చెట్లు, పశువులు సరీసృపాలు పక్షులు మరియు చేపలు అని వివరించారు.
సంస్కృత భాషలో ఉపయోగించే పదాలలో కూడా ఎంతో శాస్త్ర విజ్ఞానం ఉంది
వసుంధర అనేది భూమికి మరో పేరు
వసుంధర అనగా బంగారం మరియు లోహాలను తనలో ధరించినది అని అర్థం.
భూమిలోనే కదా లోహాలు దొరికేది.
: కుజ: అంగారకుడు
కుజ శబ్దానికి అర్థం
భూమి నుండి పుట్టిన వాడు
శని గ్రహానికి మంద: అనే పేరు ఉంది
అంటే నెమ్మదిగా సంచరించే వాడు అని.
సూర్య కుటుంబంలో గ్రహాలలో నెమ్మదిగా చరించే గ్రహం శని గ్రహం.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:
నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.