top of page

పరిణామాన్ని మనం చూడగలమా??


'Parinamanni manam chudagalama ' Telugu Article By N. Sai Prasanthi


రచన: N. సాయి ప్రశాంతి


జీవపరిణామం అనేది ఒక జీవుల ఉత్పత్తి నుండి నేటి వరకు జరుగుతూనే ఉన్న నిరంతర ప్రక్రియ. ఇందులో జీవుల లక్షణాలు ప్రకృతి యొక్క మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ప్రతీ జీవి తదనుగుణంగా పరిణామం చెందుతూ ఉంటుంది

మరియు అది ఒక ప్రత్యేకమైన దారిలో సాగుతుంది.

ఎందరో శాస్త్రజ్ఞులు జీవ పరిణామ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కానీ డార్విన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్రకృతివరణం సిద్దాంతము చాలా మంది ఆమోదం పొందినది.

దాని ప్రకారం పరిణామం అనేది ప్రకృతి వరణం వల్ల జరుగుతుంది.

డార్విన్ సిద్ధాంతం ప్రకారం

జాతుల మధ్య పోరాటం

బలమైనదే మిగలడం

మొదలైన కారకాల వల్ల పరిణామం జరుగుతుంది.

డార్విన్ బీగల్ ఓడలో ప్రయాణించి ఈ సిద్ధాంతానికి బుుజువులు సంపాదించాడు.

ఆయన పర్యావరణానికి అనుగుణంగా జీవుల లక్షణాలు మారడము గమనించాడు.

గలాపగస్ దీవులలో ఫించ్ పక్షులు పరిణామం అనేది జన్యువుల మార్పు మరియు నూతన జాతులు ఉత్పత్తి చెందడం ద్వారా జరుగుతుంది.

మనకి ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది.

మనం ఈ పరిణామం అనే ప్రక్రియని చూడగలమా?

శాస్త్రవేత్తల ప్రకారం పరిణామం అత్యంత నెమ్మదిగా జరిగే ప్రక్రియ.

మరియు పరిణామం మనం ప్రయోగాత్మకంగా తెలుసుకోగలమా..

అవును. మనం పరిణామాన్ని చూడగలం. మరియు ప్రయోగాత్మకంగా తెలుసుకోగలం.

మనం మన పాఠశాల విద్యనుండి పరిణామం చూడలేం అని నేర్చుకున్నాం.

కానీ ఈ మధ్య జరిగిన ప్రయోగాలు పరిణామం తక్కువ సమయంలో జరగగలదు అని నిరూపించాయి.


మూడు విశ్వవిద్యాలయాలకు- స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా మరియు అహ్మదాబాద్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక పెద్ద స్థాయి పరిశోధనను 2014నుండి

చేపట్టారు.

అందులో వారు డ్రోసోఫిలా అనే ఈగపై పరిశోధన జరిపారు.

వారు జన్యుపరమైన మరియు భౌతిక రూపాల్లో జరిగిన పరిణామాన్ని గణించారు.

పది డ్రోసోఫిలా జనాభాలను పరిశోధనకి ఉపయోగించారు.


వాటిని ఎండ, చలి, ఆహారకొరత, వాన, మరియు శత్రు జీవుల వేటకి గురి చేసారు.

6 జనాభాలలో మార్పులు గమనించారు.

వాటి జన్యు క్రమాన్ని విశ్లేషించారు.

మరియు జన్యుక్రమంలో మార్పులు గమనించారు .

మరియు అనేక మంది శాస్త్రజ్ఞులు కీటకాలమీద పరిశోధన జరిపి పరిణామాన్ని మనం చూడగలం అని నిరూపించారు.

జీవుల లక్షణాలు పర్యావరణ పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెంది పరిణామం సంభవిస్తుంది అని మనం ఈ శాస్త్రీయ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.


Comments


bottom of page