top of page

హాయ్ నాన్న'Hai Nanna' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 29/06/2024

'హాయ్ నాన్న' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఎక్కడున్నావు నాన్న! నువ్వు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్లి.. ఐదు రోజులు అవుతోంది. ఇంకా ఇంటికి రాలేదు.. నా బర్త్ డే వస్తోంది గుర్తుందా.. ?" అని బేబీ మెసేజ్ చేసింది.. 


"నా ఫోన్ లో ఏం చేస్తున్నావు బేబీ.. ?" అడిగింది అమ్మ వాణి.


"నాన్నకి మెసేజ్ పెడుతున్నాను అమ్మా.. "


"ఇప్పుడు ఎందుకు బేబీ.. ?"


"నా బర్త్ డే వస్తోంది కదా.. అందుకే.. "


"ఎందుకే నీకు ఇంత పిచ్చి బర్త్ డే అంటే.. ? నీ బర్త్ డే కి నెల ముందర నుంచే.. ఎప్పుడు బర్త్ డే వస్తుందా అని కలవరిస్తావు. చిన్నప్పుడు అయితే ఓకే.. ఇప్పుడు పెద్ద అయ్యావు.. అయినా ఇంకా ఆ అల్లరి పోలేదు.. "


"నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. మీతో నా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవాలనుకోవడం తప్పా అమ్మా.. ?


"నా బర్త్ డే షాపింగ్ కి ఎప్పుడు వెళ్దాము.. ?" అడిగింది బేబీ.

 

"నాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాము లే.. రాసి ఇచ్చావు కదా పెద్ద లిస్టు.. "


"సరే అమ్మా.. ! నాన్నకు నా బర్త్ డే గురించి గుర్తు చెయ్యి.. "


"అయినా మీ నాన్న నీ గురించి అస్సలు మర్చిపోరు.. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం.. "


"ఎంత ఇష్టమో చెప్పు అమ్మా.. "


"అది తెలియాలంటే, అమ్మ నాన్న కథ నీకు తెలియాలి బేబీ.. "


"అయితే చెప్పు వింటాను.. నాకు మీరు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు"


*****


మీ నాన్న నన్ను చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత మీ నాన్న నన్ను కోరిన కోరిక ఏమిటో తెలుసా.. ? నా లాంటి అందమైన అమ్మాయి కూతురిగా కావాలని అడిగారు. 


అబ్బాయి కావాలని అడిగే వారిని చూసాను. కానీ, అమ్మాయి కావాలని అడగడంతో.. ఆడపిల్లలంటే, ఎంత ఇష్టమో అర్ధమైంది. మీ నాన్నకి చెల్లెలు లేదు.. అందుకేనేమో అనుకున్నాను. 


ఆ శుభ సమయం రానే వచ్చింది. నన్ను డాక్టర్ స్కానింగ్ తీస్తున్న టైం లో, స్క్రీన్ వైపే చూస్తూ.. గూగుల్ లో సెర్చ్ చేస్తూ.. కడుపులో ఉన్నది అమ్మాయో కాదో నని తెగ చూడడం మొదలు పెట్టారు మీ నాన్న. కడుపులో ఉన్నది ఎవరో చెప్పడానికి డాక్టర్ నిరాకరించినా.. ఏవో లెక్కలు వేసుకుని ఆనందపడ్డారు మీ నాన్న. 


ప్రతి నెల టైం కి నాకు చెకప్స్, మందులు.. అన్నీ మీ నాన్నే దగ్గరుండి చూసుకునేవారు. ఇదంతా నా మీద ప్రేమ.. తర్వాత నా కడుపులో ఉన్న నీ మీద ప్రేమ. నెలలు నిండాక, నా కడుపు దగ్గర చెవి పెట్టి వచ్చే శబ్దాలకు మురిసిపోయేవారు.. 


"ఏమిటండీ.. ! అంతలాగ మురిసిపోతున్నారు.. " అని నేను అడిగాను.


"హాయ్ నాన్న.. ! అని నా కూతురు అంటోంది.. " అనేవారు మీ నాన్న. 


నువ్వు పుట్టిన తర్వాత, మీ నాన్నకు ప్రతిరోజూ పండగే. నువ్వు పుట్టిన తర్వాత, బిజినెస్ లో మీ నాన్నకి నష్టాలు వచ్చి.. అందరూ నీ జాతకం బాగోలేదని అన్నా, మీ నాన్న ఎవరి మాటలు పట్టించుకోలేదు. నష్టాలు వచ్చింది.. బాగా లాభాలు రావడం కోసమే అని అందరికి గట్టిగా సమాధానం చెప్పారు. 


నీకు వ్యాక్సిన్ వేయించడానికి నన్నే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళమనేవారు. నీ చిన్ని చేతికి సూది గుచ్చుకోవడం, నీ ఏడుపు మీ నాన్న భరించలేరని అనేవారు. అలాగే నీకు చెవులు కుట్టించడానికీ ఒప్పుకోలేదు. నీ అందమైన చెవులకి అందమైన రింగ్స్ చూపించి.. మీ నాన్నను ఒప్పించాను. 


నువ్వు ఎప్పుడు ఏమిటి అడుగుతావో అని.. నీ కోసం ఎప్పుడూ ఇంట్లో అన్నీ ఉంచేవారు... బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు. నువ్వు స్కూల్ లో జాయిన్ అయిన తర్వాత, ఎప్పుడూ మనింట్లో ఒక బుక్ షాప్ మెయింటైన్ చేసేవారు మీ నాన్న. ఒక రూమ్ అంతా నీకు కావాల్సిన వస్తువుల కోసం కేటాయించారు. ఎప్పుడూ నీ గురించే అతని ఆలోచనంతా.. ! నీ మీద ఒక మాట కుడా పడనిచ్చేవారు కాదు. నువ్వు ఒకటి అడిగితే రెండు కొని తెచ్చేవారు. నువ్వు తప్పు చేసినా.. ఆ తప్పు తన మీద వేసుకుని, నా చేత తిట్లు తినేవారు మీ నాన్న.. 


ఒకరోజు నేను.. 


"ఏమండీ.. ! అమ్మాయికి ముక్కు కుట్టించాలండి.. "


"ఇంత చిన్న పిల్లకి ముక్కు కుట్టిస్తారా.. 'నో'.. నేను ఒప్పుకోను" అన్నారు మీ నాన్న.

 

"నో అంటే ఎలా చెప్పండి.. ? నేను ఇంత చిన్నగా ఉన్నప్పుడే నాకు ముక్కు కుట్టించారు తెలుసా...? ఇప్పుడు నా ముక్కుపుడకంటే మీకు చాలా ఇష్టం కదా.. మరి మీ అమ్మాయికి వద్దా చెప్పండి.. "


"అవుననుకో.. కానీ నేను మాత్రం రాను.. నాకు భయం.. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళు. నా కూతురు ఏడిస్తే, నేను అసలు చూడలేను.. " అన్నారు నాన్న.

 

"సరిపోయింది తండ్రి ప్రేమ.. అలాగే లెండి.. ! మంచి రోజు చూసి.. నేనే తీసుకుని వెళ్తాను.. " అని అన్నాను.


అలా.. నీకు ముక్కు కుట్టించడానికి తప్పక ఒప్పుకున్నారు మీ నాన్న. నీకు ముక్కు కుట్టించాక.. 


"ఇప్పుడు చూడండి... మీ అమ్మాయి ఎంత అందంగా ఉందో.. " అని నేను మీ నాన్నతో అంటే.. 

"నిజమే వాణి.. నా కూతురు రూప చాలా అందంగా ఉంది.. " అని చాలా మురుసిపోయారు మీ నాన్న. 


నువ్వు వోణి వేసుకున్న రోజు గుర్తుందా.. ? అప్పుడు మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూసి నేను అడిగాను "ఎందుకు అంత ఆనందం అని.. "


"ఒక అందమైన కూతురికి తండ్రిని అయ్యాను" అని చాలా మురుసిపోయారు. 


*****


"మీ నాన్న ఎంత బిజీ గా ఉన్నా, ఆఫీస్ వర్క్ మీద బయటకు ఎక్కువ వెళ్ళాల్సి వచ్చినా సరే.. నిన్ను ఇంతగా ప్రేమించే మీ నాన్న, నీ పుట్టినరోజుకు రాకుండా ఎలా ఉంటారు చెప్పు.. ? పెద్ద సర్ప్రైస్ ఇస్తారేమో చూడు బేబీ.. "


రాత్రి పది కి బెల్ మోగింది.. వెళ్లి తలుపు తీసిన వాణి.. చాలా రోజుల తర్వాత భర్త రావడం చూసి చాలా సంతోషించింది. నాన్న రాక గమనించిన బేబీ "హాయ్ నాన్న.. ! నా కోసం ఏం తెచ్చారు" అని అడిగింది. 


"రేపు నీ బర్త్ డే కి నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను లే.. కొంచం వెయిట్ చెయ్యి. ఈ లోపు నీ కోసం చాలా షాపింగ్ చేసాను. మీ అమ్మ పెద్ద లిస్టు పంపింది.. నువ్వు రాసినవి అన్నీ ఉన్నాయో లేవో చూసుకో బేబీ. నువ్వు అడిగిన వాటికన్నా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవులే.. " అని చిన్నగా నవ్వాడు తండ్రి. 


"థాంక్స్ నాన్న.. "


మర్నాడు బర్త్ డే పార్టీ కోసం ఇంట్లో భారీ ఏర్పాటు చేసాడు తండ్రి. రూప ఎప్పటినుంచో నాన్నని అడగాలనుకుని, అడగలేకపోయిన కంప్యూటర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. 


"ఇప్పుడు అర్ధమైంది నాన్న.. ! నాన్న తన కూతురి కోసం ఎంత ఆలోచిస్తాడో.. కూతురు ఎప్పుడూ బాధపడకుండా హ్యాపీ గా ఉండాలని ఎంత ఆలోచిస్తాడో. చిన్నప్పుడు నువ్వు నా కోసం ఎంత చేసావో అమ్మ చెప్పింది.. నా కోసం అన్నీ చేసిన నువ్వే నా హీరో. కంప్యూటర్ ని గిఫ్ట్ గా ఇచ్చినందుకు థాంక్స్ నాన్నా.. ! నువ్వు చాలా గ్రేట్!! ఎప్పుడూ నువ్వు హ్యాపీ గా ఉంటూ, మమల్ని హ్యాపీ గా ఉంచాలి నాన్న" అని ప్రేమతో తండ్రిని పట్టుకుంది రూప. 


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


70 views0 comments

Comentarios


bottom of page