top of page

హితోక్తి




'Hithokthi' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 17/12/2023

'హితోక్తి' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


తనయుల తల్లియు తండ్రియు

మనమున ఆస్తిగ దలుచుచు మదముతొ ఉండన్

తనయులు తలిదండ్రాస్తిని

తనకని తనకని తగవులు తగవన జూడన్


ఆలును కష్టము పెట్టక

జాలితొ ఉండను బసాలు చమ్మని దలుచున్

ఆలుతొ దక్షణ తనకును

చాలగ దెమ్మన ఉలుకుతొ చామయు ఏడ్చున్


పిల్లల పెంచుట యందున

చల్లిని చూపుతొ చదువుయు చక్కగ సాగన్

ఉల్లము రంజిలు చూడను

పిల్లలు పెరుగుదు రనగను పీచము లేకన్.


ముట్టకు మద్యము అనగను

తట్టకు సానిది తలుపును తగులము తోడన్

కొట్టకు చెట్టును కూలగ

నెట్టకు వెనుకకు ఎవరిని నేరము అవగన్


అమ్మగ జూడకు ఆలుది

సొమ్మన ఎపుడును మనసున సోకుల కొరకున్

పొమ్మని పొగయును బెట్టకు 

నెమ్మితొ చుట్టము అడుగిడ నేరము అనగన్


కులమని మతమని కుత్చిత 

పలుకులు  పలుకకు ఎపుడును పరువుయు బోవున్ 

కలిసియు మెలిసియు ఒకటే 

కులమని దలుచుచు మెలుగుటె కుదురును చూడన్ 


కరువన గానిన గూడను 

పరులను సొమ్మని అడుగకు పగలును రేయిన్

పరువన బోవును దలువగ

శిరమును వంచక బతుకుటె శివమగు జూడన్ 


ఇతరుల యాపద గనినను 

మతినిడి సాయము దలువుము మానక నీవున్

గతమును జ్ఞప్తికి  తేకను 

ఉతికిన వస్త్రము వలెనన ఉండుట మేలున్.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


53 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 18, 2023

Sir, Excellent... I like poetry. Not once but I read many times...because it has its own BEAUTY.

Like
bottom of page