top of page

సంపుటి మురిసింది - ఎపిసోడ్ 2
'Samputi Murisindi Episode 2' - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 18/12/2023

'సంపుటి మురిసింది ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


తన వెంట పడుతున్న శ్రీహరితో 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది సంపుటి అనే అమ్మాయి.


అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక.


తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.


ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 2  చదవండి..


"ఎలా అడుగుతున్నావు. అయ్యో.. సంపుటి.. నాన్న కూచీ అయే. తొలుత తను.. ఆయనకే చెప్పింది. ఆయన నాకు చెప్పేకే.. నాకు విషయం తెలియ వచ్చింది." చెప్పింది సంచిక నొచ్చుకుంటూ.


అటు చిన్నగా నవ్వేడు శ్రీకర్.

"అవునవును. ప్రమథ పక్తు కూతురు పక్షపాతి." అన్నాడు.


"మరే." అనేసింది సంచిక.


ఆ వెంబడే..

"ప్రమథ దన్నే.. సంపుటి పెంకితనంకి ప్రథమ హేతువు." అంది.

"సర్లే. ప్రమథను ఎందుకు ఆడిపోసుకోవడం. మరి నీకు లేదా.. కూతురంటే ఆపేక్ష. ఆఁ." తేలిగ్గా తేల్చేసాడు శ్రీకర్.

సంచిక నవ్వుకోగలిగింది.


అలా కుదరవుతూ.. "వాగ్దేవి.. రాఘవ ఎలా ఉన్నారు." అడిగింది.


"సూపర్బ్." అనేసాడు శ్రీకర్.


వాగ్దేవి.. శ్రీకర్ భార్య.

రాఘవ.. వాగ్దేవి, శ్రీకర్ ల కొడుకు. 


"నాకు వర్క్ ఉంది." చెప్పేసింది సంచిక.


"నాకున్నూ. మరి ఉండనా" అన్నాడు శ్రీకర్.


"బై." అంటూనే.. సంచిక ఆ కాల్ కట్ చేసేసింది.


 ***

వాగ్దేవి తల్లి.. కామాక్షి చనిపోతూ..

"అడిగితే అత్యాసే. ఐనా కోరక తప్పడం లేదు.." చెప్పుతూ.. బెక్కుతుంది.


ఆవిడనే ఆత్రంగా చూస్తున్నారు.. అక్కడే ఉన్న వాగ్దేవి.. సంచిక, శ్రీకర్ లు.


వాళ్లంతా వాగ్దేవి ఇంటిలో ఉన్నారు.

"మీకు తెలుసు. నేను తప్పా.. వాగ్దేవికి ఎవరూ లేరు. కానీ మీ ఇద్దరూ తనకు దన్ను కాగలిగారు. సంతోషం." మళ్లీ చెప్పడం ఆపింది కామాక్షి.


ఆవిడ మాట్లాడ లేక పోతుందని గుర్తించిన వారిలో.. వాగ్దేవి.. 

"ఏమిటమ్మా నీ మాటలు. ఏం చెప్పాలనుకుంటున్నావు." అంది. తను చాలా ఆందోళనలో ఉంది.


కామాక్షిలో క్షణక్షణం ఆయాసం అధికమగుతుంది.

"ఐనా.. నేను ప్రత్యేకంగా కోరనవసరం లేదు. నాకు తెలుసు. వాగ్దేవిని మీరు ఆదుకుంటారు. కానీ.. నాదో కోరిక.. ఇది నా చివర కోరిక.." మాట్లాడడానికి అవస్థ పడుతుంది. 


శ్రీకర్ కలగ చేసుకున్నాడు. "చెప్పండి.. ఏమిటా కోరిక." అడిగాడు.


"అదే.. బాబూ.. నా కూతురును నువ్వు పెళ్లి చేసుకోవా." అడిగేసింది కామాక్షి.


ఆ ముగ్గురు గతుక్కుమన్నారు. 

ఆ ముగ్గురు.. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.

అప్పటికే కామాక్షి తన కుడి అర చేతిని చాచి.. శ్రీకర్ వైపు పెట్టేసి ఉంది.

"మాటివ్వవా." అంటుంది.


సంచిక ఏదో చెప్పేలోపే..

శ్రీకర్.. కామాక్షి చాచిన ఆ చేతిని.. తన రెండు అర చేతుల్లోకి తీసుకొని..

"అమ్మా.. మీరు నిశ్చింత కండి." అనేసాడు.


కామాక్షి మెల్లిగా నవ్వుతుంది. ఆ వెంబడే.. చనిపోయింది.

ఇది జరిగిన యేడాదిలోగానే..

శ్రీకర్.. వాగ్దేవిని పెళ్లి చేసుకున్నాడు.


సంచిక సమ్మతయ్యింది.

ఆ తర్వాతి యేడాదిన..

సంచిక.. తన కో-ఎంప్లాయ్ ప్రమథను పెళ్లాడింది.


ఈ రెండు జంటలు.. కోరే.. ఒక్కొక్క సంతానంనే కన్నారు.

సంపుటి పుట్టిన యేడాదినే రాఘవ కూడా పుట్టాడు.

ఈ పిల్లలు ఇద్దరూ కలిసే సెవెన్త్ స్టాండర్డ్ వరకు చదివారు.

ఆ పిమ్మట.. ప్రమోషన్ మూలంగా శ్రీకర్ విశాఖపట్నం వెళ్లాడు. 

సంచిక చొరవతో వాగ్దేవి.. భర్త పని చేస్తున్న చోటును చేరిపోయింది.


అప్పటి లగాయితు సంపుటి హైదరాబాద్ లోను.. రాఘవ విశాఖపట్నం లోను.. తమ తమ స్టడీస్ ను కొనసాగిస్తున్నారు.

అలానే ఇద్దరూ కూడపలుక్కునే ఇంటర్మీడియట్ లో ఒకే గ్రూప్ తీసుకున్నారు. తడవ తడవగా ఆన్లైన్ సదుపాయంతో ముచ్చట్లును ముచ్చటించుకుంటున్నారు.


ఇదంతా రమారమీ పదిహేనేళ్ళ క్రితం నుండి.. ఇప్పటి వరకు.. కొనసాగుతూ పోతున్న సంగతులు.


***

"మనది చదివే వయస్సు." చెప్పాడు రాఘవ.


కావ్య ఏమీ అనడం లేదు. రాఘవనే చూస్తుంది.

ఆ ఇద్దరూ కాలేజీ మైన్గేట్ బయట.. రోడ్డు ఓరగా నిల్చుని ఉన్నారు.


"నీ లవ్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తున్నందుకు హర్ట్ అవ్వకు." చెప్పుతున్నాడు రాఘవ.


కావ్య వింటుంది.. అతడినే చూస్తూ.

"మనం మొదట బాగా చదువుకుందాం. పేరెంట్స్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ల ఆశలను పాడు చేయడం మంచిది కాదు. అదే కాదు.. మన ఫ్యూచర్ ను బాగా తీర్చుదిద్దుకుందాం. దానికి.. మనకు ఇదే మంచి తరుణం. దీనిని కూడా మనం పాడు చేయడం మంచిది కాదు." ఆగాడు రాఘవ.


కావ్య చూపు మార్చ లేదు.. అతడినే చూస్తుంది. అతడు చెప్పుతుంది ఆలకిస్తుంది.


"ముందు మనం చదువును ప్రేమిద్దాం. ఆ తర్వాతే.. మనం ఒకరిని ఒకరం ప్రేమించుకోవడం చేద్దాం. సరేనా." 

చెప్పేసాడు రాఘవ.


కావ్య అప్పటికి మాట్లాడ లేదు.


"నా మాట వినుకో. నన్ను డిస్టర్బ్ చేయకు.. నువ్వూ డిస్టర్బ్ కాకు. ప్లీజ్." చెప్పాడు రాఘవ.


ఆ వెంబడే..

"మనం క్లాస్మేట్స్ంగా మూవ్ అవుదాం. పద.. క్లాస్ కు టైమైపోతుంది." అంటూనే కదిలాడు రాఘవ.


కావ్య.. భారంగా కదిలింది.. అతడి వెనుకనే.


***

లాప్టాప్ ల ద్వారా.. ఆ ఇద్దరూ వీడియో చాటింగ్ లో ఉన్నారు.

"నా కంటే నువ్వే బాగా హేండిల్ చేయగలిగావు. ముమ్మాటికి ఆ కావ్య హర్ట్ కాదు.. కాలేదు." మెచ్చుకుంటుంది సంపుటి.

"అఫ్కోర్స్. నీ టేకలింగ్ నీది. ఏమైనా మన మోటివ్స్ ఒకటేగా. ఎదుట వారిని హర్ట్ చేయకుండా మనం సర్వైవల్ అవ్వాలి. అవుతున్నాం." అన్నాడు రాఘవ.


సంపుటి తేలికవుతుంది.

ఆ పిమ్మట.. ఆ ఇద్దరి ముచ్చట్ల తీరు.. స్టడీస్ వైపు మల్లుతూ.. కొనసాగుతుంది.


***

రెండేళ్ల తర్వాత..

సంపుటి, రాఘవ.. బియస్సీ డిగ్రీకై కాలేజీల్లో చేరారు.. తమ తమ ఊళ్లల్లో.

ఇద్దరూ అనుకున్నారు.. ఎట్టి సెట్ ల జోలికి పోకుండా.. బియస్సీ డిగ్రీ పొందాలని.


ఆ ఇద్దరికీ ఇంటర్మీడియట్ లో.. కావ్య, శ్రీహరిల నుండి మరెట్టి ఆటంకాలు ఎదురు కాలేదు. 


తమ తమ స్టడీస్ పై పట్టుగా పోకస్ చేస్తూ.. ఆ ఇద్దరూ ఇంటర్మీడియట్ లో.. తమ తమ కాలేజీల్లో ఉత్తమ స్థాయిన నిలిచారు. 


ఆ ఇద్దరూ బియస్సీలో కోరి చేరడానికి కారణం.. ఆ ఇద్దరికీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద మక్కువ ఎక్కువ. ఆ సబ్జెక్ట్ ను మరింతగా తమ అక్కున చేర్చుకోవాలని తాము తపిస్తున్నారు.


కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో మంచి గ్రిప్ సాధించి.. దానిని సాధ్యమైనంత మేరకు సామాన్య విద్యార్థికి.. సులభ తరహాన నేర్పాలని.. ఆ ఇద్దరూ తలుస్తున్నారు. అందుకై వాళ్లిద్దరూ టీచింగ్ వైపు మొగ్గి ఉన్నారు.

తమతో పాటు చదివిన వారు.. ఎక్కడ.. ఎందులో చేరారో కూడా సంపుటి, రాఘవలు పట్టించుకోలేదు. ఆ తోవనే శ్రీహరి, కావ్యలు కూడా కొట్టుకుపోయారు.


***

మూడేళ్ల తర్వాత..

పేరెంట్స్ ప్రోత్సాహంతో.. సంపుటి, రాఘవ.. కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై.. పిజి డిగ్రీకై.. ఒక రిపుటేషన్ పొందిన యూనివర్సిటీ లో.. దూరాబారం ఐనా.. చేరారు. అక్కడి హాస్టల్ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు.


క్లాస్ లప్పుడు.. తరగతులకు తప్పక హాజరవ్వుతూ.. మిగతా అప్పుడు.. లైబ్రరీ నుండి పొందిన బుక్స్ తో.. పట్టుగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ గ్రిప్ కై శ్రమిస్తున్నారు.


డిగ్రీ చదువు అప్పుడు.. ఇప్పుడు చదువు అప్పుడు.. తోటి వారు తమను గేలి చేసినా.. చేస్తున్న.. ఏమన్నా.. ఏమంటున్న.. తమ తోవన తాము పోతున్నారు.. సంపుటి, రాఘవ.


అలాగే.. అవకాశం మేరకు వివిధ విధాలున.. చదువులో ప్రశంసనీయులు అవుతున్నారు.


***

రెండున్నరేళ్ల తర్వాత..

హైదరాబాద్ నుండి సంపుటి.. తన పేరెంట్స్ ను తోడ్చుకొని.. 

విశాఖపట్నం వెళ్లింది.. రాఘవ ఆహ్వానము మేరకు.


ఆ ఇరు కుటుంబ సభ్యులు.. శ్రీకర్ ఇంట హాలులో సమావేశమై ఉన్నారు.

"రాఘవ చెప్పాడు. సంపుటితో అల్రడీ మాట్లాడేడట. తను పెద్దలు ఇష్టం అనేసిందట." చెప్పుతున్నాడు శ్రీకర్.

అడ్డై.. 

"సంపుటి ఆ కబురులు మాకూ చెప్పి ఉంది. ఆ కారణం చేతనే మనం కలిసి మాట్లాడదామని వచ్చాం." అన్నాడు ప్రమథ.


అప్పుడే సంచిక.. "ఫోన్ లో మాట్లాడుకో వచ్చు అన్న.. ముఖాముఖీగా కలిసి మాట్లాడితే బాగుంటుందని సంపుటి కోరింది." చెప్పింది.


ఆ వెంబడే..

"ఆ కారణం చేతనే.. నేనే చొరవై.. మిమ్మల్ని ఇక్కడికి తీసుకు రమ్మనమని ఆహ్వానించాను." చెప్పాడు రాఘవ.


"యయ. థట్.. మనం ఇలా కలిసి చాన్నాళ్లు ఐందిగా. అందుకే నాలుగు రోజులు పనులన్నీ పక్కన పెట్టేసి బయలుదేరి వచ్చేసాం." కల్పించుకుంది సంచిక.

"సంతోషం." అంది వాగ్దేవి.


అంతా హాయి అయ్యారు.

"పిజి డిగ్రీలు పొందే వరకు మా ఇష్టం అన్న మేము.. మీ పెద్దలకు ఉరవ ఇవ్వడం ఇక మా ధర్మము." చెప్పింది సంపుటి.

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసంమేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.84 views0 comments

Comments


bottom of page