top of page

ఐడియా




'Idea' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 12/12/2023

'ఐడియా' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


అజయ్ మరియు విజయ్ మంచి మిత్రులు. ఇద్దరికీ దాదాపు ఒకటే వయసు, ఒకటే బరువు ఉంటారు. ఇద్దరు పెళ్ళి కుడా ఒకేసారి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. ఇంట్లో, వారి తల్లిదండ్రులు చూసిన అమ్మాయిలనే మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు.


సంవత్సరం గడిచింది. ఇద్దరు మిత్రులు హ్యాపీ గానే ఉన్నారు. ఒక రోజు ఇద్దరు ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తున్నప్పుడు వారి బరువు చూసుకున్నారు. అజయ్ కన్నా విజయ్ ఐదు కిలోలు పెరిగాడు. విజయ్ కు చాలా బాధ వేసింది. బరువు పెరిగితే, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిత్యం వింటూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎంతో కాపాడుకుంటూ వస్తున్నా..ఇప్పుడు తన బరువు బ్యాలెన్స్ తప్పిందన్న బాధ ముఖంలో తెలిసిపోయింది. అది గమనించి, అజయ్ విషయం అడిగి తెలుసుకున్నాడు.


"మీ ఆవిడకు నీ మీద ప్రేమ ఎక్కువ రా విజయ్..పై గా మీ ఆవిడ వంట బాగా చేస్తుందని చెప్పావు!"


"నిజమే అనుకో..మా ఆవిడ ప్రేమ తో ఏది చేసి పెట్టినా..తినకుండా ఉండలేను..అదే కారణమేమో అజయ్"


"అలాగైతే, మీ ఆవిడ కీ నీ మీద ప్రేమ చాలా ఎక్కువే కదా అజయ్ ..కానీ నువ్వు ఫిట్ గానే ఉన్నావే!"


"అవును..వంట కుడా సూపర్ గా చేస్తుంది. ఆస్వాదిస్తూ..తింటే, ఎంత తింటూన్నానో నాకే తెలియదు.."


"నాకు తెలిసి, మన ఇద్దరము బయట ఫుడ్ తినము..అయినా నాలో బాగా తేడా వచ్చేసింది. తిండి తగ్గించాలని ఉంది..కానీ అవట్లేదు మరి..అలాగని మా ఆవిడని వంట బాగా చెయొద్దని చెప్పలేను కదా! అజయ్"


"దానికి నేను ఒక చిట్కా ఫాలో అవుతున్నాను విజయ్.."


"అదేదో..నాకూ చెప్పరా అజయ్!"


"నేను ఎక్కువ తింటున్నాను అని నాకు అనిపించిన వెంటనే, మా ఆవిడ కి వినిపించేలాగ తనకు సంబంధించి ఏదో ఒకటి నెగిటివ్ గా చెబుతాను అంతే!..వెంటనే వడ్డించడం తగ్గించేస్తుంది.."


"నీ ఐడియా చాలా బాగుంది రా అజయ్! ఫాలో అయిపోతాను..చూడు నీకన్నా బరువు తగ్గుతాను.."


"సరే గానీ...సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకో..."


****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


32 views0 comments
bottom of page