top of page

కల్పతరువు - పార్ట్ 2




'Kalpatharuvu - Part 2' - New Telugu Web Series Written By Surekha Puli

Published On 12/12/2023

'కల్పతరువు - పార్ట్ 2' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది. 

ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. 


చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


ఆమెను వదిలిపెట్టడానికి ఆమె అన్నయ్య లాయర్ సత్యప్రకాష్ తోడుగా వెళ్తాడు. 


ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. 


పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. 

ప్రజ్ఞ ఆలోచనలో పడుతుంది. 



ఇక కల్పతరువు ధారావాహిక రెండవ భాగం చదవండి.. 


ఉదయం రాజధాని ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో అలసి ఆగిపోయింది. నరాలు బిగుసుకుంటున్న చలి! పొగమంచుతో వాతావరణం మందంగా వుంది. టీ తీసుకున్నారు. లోకల్ ట్రైన్లో న్యూఢిల్లీ వరకు వచ్చారు. భారత దేశ రాజధాని క్రిక్కిరిసిన హడావిడి.. ఏమిటోగా వుంది. 


చండీగఢ్ శతాబ్ధి చైర్ కార్లో కూర్చున్నాక కాస్త మనసు కుదురుగా అనిపించింది, సత్యప్రకాష్కు. నిర్ధారించిన సమయానికే రైలు కదిలింది. శతాబ్ధిలో ప్రయాణం చాలా సౌకర్యముగా వున్నది. 


ప్రజలు తొంభై శాతం బలమైన అంగ సౌష్టంతో మంచి రంగు కలిగి వున్నారు. రైతులకు మద్దతు ఇచ్చే సారవంతమయిన నేల, నీటి సమృద్ది. స్వచ్చమయిన వాతావరణం. తను కోరుకున్న ప్రకృతి అందాలు మళ్ళీ కనబడుతున్నాయి, కానీ భర్త తోడుగా లేనందుకు నిరాశగా, బాధగా వుంది. మూడు గంటల ప్రయాణం తరువాత దిగాల్సిన స్టేషన్ వచ్చింది. 

 

లాయర్ సత్యప్రకాష్ కొలీగ్ లాయర్ సర్దార్ శరణ్ జీత్ రిసీవ్ చేసుకున్నాడు. అతని కార్లో వాళ్ళ ఇంటికి వెళ్లారు. 


శరణ్ జీత్ గారి ఇంట్లో పంజాబీ భోజనం చేశారు. తరువాత తెలిసింది, సత్యలీలను పేయింగ్ గెస్ట్ గా, అన్న చేసిన ఏర్పాట్లు. చెల్లెలు ఒప్పుకోలేదు. 


“అన్నా, నేను ఒక్కదాన్నే రూమ్ తీసుకొని, నా వంట నేనే వండుకొని ఆఫీసుకు వెళతాను. నా జీవితాన్ని పూర్తిగా ఏదో వ్యాపకాలతో బిజీ చేసుకోవాలనుకుంటే, నువ్వేంటి మీ ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వుండమంటున్నావు?”


“నీకు తెలియదమ్మా! ఇది మన వూరు కాదు, మన భాష కాదు నీ సేఫ్టీ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను”. 


“అన్ని తెలిసే వచ్చాను కదా, నేనొక్కదాన్నే వేరేగా ఉండాలి. నీ తృప్తి కోసం శరణ్ జీత్ గారిని అప్పుడప్పుడు పరామర్శించమను. అంతేగానీ పేయింగ్ గెస్ట్ గా ఐ డోంట్ లైక్” ముక్కుసూటిగా అయిష్టాన్ని బయటపెట్టింది. 


ఎప్పుడూ అన్నయ్య చెబితే చెల్లెలు వినేది, కానీ విశ్వం మరణించిన తరువాత చెల్లెలు మాటకే ప్రాధాన్యత హెచ్చింది. 


పెద్ద బంగాళా కుడి వైపు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ రూమ్ సెట్ అంటే వన్ బిహెచ్ కే వుడ్ వర్క్ చేసి నీట్ గా వున్న కబోర్డ్స్. మరో వైపు పోర్షన్ వుడ్ వర్క్ లేకుండా కబోర్డ్స్, చిన్న ఫ్యామిలీ వున్నారు. క్రింద పోర్షన్లో ఓనర్స్. కుడి వైపున వున్న ఖాళీ పోర్షన్ రెంట్కు తీసుకున్నారు. సత్యలీలకు గ్యాస్తో పాటు ఇంట్లోకి కావాల్సిన సామానులు అన్ని కొని తెచ్చాడు సత్యప్రకాష్. 


వదిన జగదాంబ కోసం మెత్తటి, వెచ్చటి పష్మిన్ శాలువ గిఫ్ట్ పంపింది. 


బ్యాచ్స్ గా వచ్చే వివిధ కోర్సుల ద్వారా కంప్యూటర్ శిక్షణ ఇవ్వటముతో ప్రతిరోజూ ఆఫీసు బిజీ లైఫ్ అలవాటై పోయింది. ఎవరి కోసం ఆగని కాలంతో పాటు మనుషులు వేగం పెంచుతున్నారు, కాలంతో పోటీ!


ప్రక్క పోర్షన్లో వున్న అచలాదేవికి, సత్యలీలకు బట్టలు ఆరేసుకునే స్థలం ఒకటే. 


కాశ్మీర్ కన్యలలో వుండే నాజూకైన అందంతో ముద్దుగా వుంది అచల. పాప, బాబు చిన్న ఫ్యామిలీ. చూడ ముచ్చటగా వున్నారు. అచల ఎలక్ట్రిక్ కుట్టు మిషిన్ సాయంతో రెండు గంటల్లో షల్వార్ కమీజ్ కుట్టేస్తుంది, నాలుగు గంటల్లో పెద్దసైజ్ స్వెటర్ అల్లుతుంది. ఎప్పుడూ సంతోషంగా చురుగ్గా వుండే అచల పనిలో ఎంతో నాణ్యత, ప్రవర్తనలో నమ్రతతో కనబడుతుంది. 


హర్యాన్వి కలిసిని హిందీలో అచలాదేవి సత్యలీల స్వవిషయాలు అడిగి తెలుసుకుంది. క్లుప్తంగా జవాబు చెప్పింది. 


“పిల్లలు లేరు కదా, మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు, పైగా చదువు, వుద్యోగం కూడా వున్నాయి. ” అచలాదేవి ప్రశ్న. 


ఉర్దూ కలిసిన హిందీలో జవాబు చెప్పింది సత్యలీల “మా వారు నాకు ఆత్మబంధువు, శారీరకంగా ఆయన లేరు కానీ మానసికంగా మావారు నా వెంటే వున్నారు, సదా వుంటారు. ఇక పిల్లలు.. నాకు పిల్లల లోటు లేదు, అనాథ పిల్లలు మన దేశంలో ఎందరో వున్నారు. ఎవరో ఒకర్ని పెంచుకుంటే సరి."


అంతటితో తృప్తి చెందక అచల మళ్ళీ ప్రశ్నించింది. “మరి మీ పునర్వివాహం గురించి మీ అత్తగారు వాళ్ళ తరపు బంధువులు ఏమీ అనలేదా?” 


“నేను బాల్య వితంతును కాదు, నాలో పరిపక్వం ఏర్పడిన తర్వాత నా యిష్టం మేరకు నా పెళ్లి జరిగింది. నాకంటూ ఒక వ్యక్తిత్వము వుంది. మా అత్తగారు కొడుకు పోయిన దుఃఖంలో వున్నారు”.


“మరి మీ వారి ఆస్తి గాని, ఉద్యోగం గాని మీకు రాలేదా?” 


“నాకు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ నచ్చవు. ఉద్యోగం నేను ట్రై చేయలేదు. మా వారి వాటా ఆస్తిని, మా అత్తగారు నా పేరిట రిజిస్టర్ చేసేశారు. చేతికి వచ్చిన కొడుకు, ఎంతో ధైర్యం యిచ్చే మనిషి లేకపోయే సరికి వాళ్ళ ఇంట్లో అంతా మరింత ప్రేమ, జాలి చూపిస్తున్నారే తప్ప ఎవ్వరికీ వేరే ఆలోచనలు లేవు.” చెబుతూ సీరియస్ అయింది సత్యలీల. 


అచల ఒక్కసారిగా భోరుమని ఏడ్చింది. 


“ఏమిటి? ఎందుకిలా ఏడుస్తున్నావు? 


సారీ, నా గతం చెప్పి నేనే బాధ వ్యక్తం చేయలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు?” సత్యలీల గాబరా పడ్డది. 


వెంటనే జవాబు చెప్పలేదు. కొద్ది సేపు వెక్కివెక్కి ఏడుస్తు, కన్నీళ్ళ ధార నిలిచిన తర్వాత అచల చన్నీళ్లతో ముఖం కడుక్కొని తన గూర్చి చెప్పడం మొదలు పెట్టింది. 


“వద్దు, ఏమి చెప్పొద్దు, ముందు ఈ వేడి కాఫీ తాగు, నీ మనసు పూర్తిగా నెమ్మది అయినప్పుడు వింటాను. " కాస్సేపటికి పాప “మాజీ” అంటూ రావడంతో విషయం సశేషంగా మిగిలింది. 

 

>>>>>>>>>>


ఎప్పుడూ వుల్లాసంగా, చలాకీగా వుండే కూతురు ముభావంగా, మౌనంగా వుంది. మామిడి కాయలు లెక్కబెడుతున్న ప్రమీలకు అనుమానం వచ్చి, నిలదీసింది, బుజ్జగించింది. ప్రేమగా దగ్గరకు తీసుకొని ప్రాధేయపడ్డది. జంకుతూ, నానుస్తూ అసలు విషయం తల్లితో చెప్పింది. 


పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలను చర్చిస్తే రాబోయే జీవితంలో మోసపోయే అవకాశాలు తక్కువ అని అమ్మ ఎన్నో మార్లు చెప్పిన శాసనాన్ని అమలు పర్చింది. 


“నా మాటకు విలువ ఇచ్చి నాతో సంప్రదిస్తున్న నా కూతురు మంచి అమ్మాయి. ఆ పుస్తకంలో చూసిన దృశ్యాలు పెళ్లి తరువాత సంఘటనలు. అప్పుడు అది సహజం కానీ పెళ్లికి ముందు, ఎంత కాబోయే జంట అయినా అట్లాంటి చర్యలు తప్పు. బావే కదా, ప్రియుడే కదా అని కాబోయే జీవన తోడు మాటలు నిజ జీవతంలో చాలా చేదుగా, అశ్లీలంగా వుంటుంది. వద్దు, రేపు నువ్వు వెళ్లొద్దు. అసలు పెళ్లి జరిగే వరకు బావని కలవకు. కాదని నిన్ను నస పెడితే, మా సమక్షంలోనే కలవాలని, సున్నితంగా పృథ్వితో చెప్పేసేయి, నీ వల్ల కాకపోతే నేను గానీ, నాన్నగానీ చెబుతామూలే. ”


“నువ్వు వద్దమ్మా, బావ వేరేలాగా అనుకుంటాడు, నేనే చెప్తాను. కానీ అమ్మా, ఈ విషయాన్ని మన మధ్యలోనే వుంచు. ”


“అట్లాగే, ప్రజ్ఞా! నువ్వు కూడా మూడు ముళ్లు పడే వరకు ఏవిధమైన బలహీనతలకు లొంగరాదు. ” 


తల్లీ కూతుళ్ళిద్దరూ వాగ్దానాలు యిచ్చిపుచ్చుకున్నారు. కూతురు వాగ్దానాన్ని నిలబెట్టినది, కానీ తల్లి ఆగలేక తండ్రితో చెప్పి పెళ్లికి తొందర చేయమంది. 


మన సంఘంలోని సామాజిక వ్యవస్థ యుక్త వయస్సులో స్త్రీ పురుషునికి వివాహం పేరిట ఒక పవిత్రమైన బంధాన్ని ఆవిష్కరించి, వారి కోర్కెలకు న్యాయం చేసి మనిషిని మంచి బాటలో నడిపిస్తుంది. ఇదే కుటుంబ వ్యవస్థకు నాంది. దినచర్యలో భాగంగా ఒకరికొకరు చేయుతగా, పరస్పర అంకిత భావనతో జీవిస్తారు. 


ఎప్పుడూ హాస్యంగా అనుకుని, సరదా పడే సంబంధం, ఆచరణాత్మక రూపం మలుపు తిరిగే సమయానికి పృథ్విథర్ విముఖత వెల్లడైంది. 


“నాన్నా, మీ మాట ప్రకారం నేను బాగా చదివి సైంటిస్టు కావాలి. అంతవరకు నాకు పెళ్లి వద్దు. అలాగని ప్రజ్ఞ పెళ్లి నా కోసం ఆపొద్దు. 


మెట్రిక్ చదివిన అమ్మాయికి, గ్రాడ్యూయేట్ అబ్బాయికి ముడి పెడితే నేను జీవితమంతా నారో మైండెడ్ పిల్లతో బ్రతకలేను. నాతో సరితూగే ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్ అమ్మాయి కావాలి. ”


“మేనరికమయినా వీళ్ళు మనం అడిగిన లాంఛనలన్నీ ఇస్తూన్నారు. అన్నీ బాగానే వున్నాయి కదరా, కొత్తగా ఈ పిచ్చి మాటలెంటి?" నాన్న ప్రశ్న. 


అమ్మ “ఎవరినైనా ప్రేమించావా?”


మరొకసారి నిక్కచ్చిగా పృథ్విథర్ తన అసమ్మతిని నొక్కి వక్కాణించాడు. 


వెంకట్రావు స్వంత చెల్లెలు ప్రమీల. మేనగోడలినే ఇంటి కోడలిగా తీర్మానించుకున్నారు. పెళ్ళికి కావలసిన కొన్ని నగలు కూడా ముందుగానే ఏర్పాటు చేశారు. 


ఏ ముఖం అడ్డు పెట్టుకొని సంబంధం వద్దని చెప్పాలి. రాకపోకలు మానేశారు. 


సౌభాగ్య వెంకట్రావులకు కొంత కాలం పట్టింది. ప్రమీలా నారాయణ వచ్చినా యడ మొహం పెడ మొహం!


సౌభాగ్యను ప్రమీల నిలదీసింది. 


“వదినా, పృథ్వి చదువుకు యింకా సమయం పడుతుంది. మీరు వేరే సంబంధం చూసుకోండి. "


“అసలు విషయం చెప్పండి వదినా, పృథ్వి చదువు పూర్తి అయిన తరువాతనే పెళ్లి. 


కానీ వేరే సంబంధం మాట వినటానికి చాలా ఇబ్బందిగా వున్నది. ”


డ్రాయింగ్ రూంలో కూర్చున్న నారాయణ కూడా వెంకట్రావు మాటలకు అవాక్కయి ఆడవాళ్ళు వున్న హల్లోకి వచ్చాడు. 


నలుగురి మద్య ఎంతో సేపు తర్జన బర్జన జరిగినా, ఒకటే నిర్ణయం “మీ ప్రజ్ఞ, మా పృథ్విల పెళ్లి కుదరదు. ”


“బలమైన ఒక్క కారణం చెప్పండి” ప్రాధేహిస్తున్నాడు అమ్మాయి తండ్రి. 


“పల్లెటూరి పిల్ల, చదువు.. మెట్రిక్ మాత్రమే. పృథ్వీకు పట్టణంలోని చదువుకున్న అమ్మాయి కావాలట. ”


“దానిదేముంది ప్రజ్ఞను కూడా మీరు కోరినట్లే చదివిద్దాము. ”


“అసలు ప్రజ్ఞ వద్దు అన్నాడు. ”


“కట్న కానుకలు పెంచాలా?"


“అదేం లేదు, మాకు ఈ సంబంధం వద్దు. ”


ఇంత ఖరాఖండిగా తేల్చిన తరువాత ప్రమీలా దంపతులు అక్కడ నిలువలేక పోయారు. 


“అత్తా మామా ఏమన్నారు నాన్నా?” ఆతృత పట్టలేక అడిగింది ప్రజ్ఞ. 


“పృథ్విని మరిచి పోతే మంచింది. మన్ని వేరే సంబంధం చూసుకోమన్నారు. ” బాధను గొంతులో అదిమి పెట్టి అన్నాడు తండ్రి. 


“బంగారం విలువ వాళ్ళకేం తెలుసు.. కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా.. ” తల్లి తన కోపాన్ని శాంత స్వరంలో వెలువర్చింది. 


అమ్మానాన్నలు ఏదో అంటున్నారు, కానీ ప్రజ్ఞ మనసులో మౌన పోరాటం సుళ్ళు తిరుతూనే వుంది. 


ఇరు కుటుంబాల్లో ప్రతీ సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి పేరంటం పిలుచుకొని సంతోషంగా జరిగే శుభ కార్యం వెలవెల బోయింది. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


64 views2 comments

2 Comments


nice story

@anilgurram-pi1yn • 7 hours ago

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 13, 2023
Replying to

Thank you

Like
bottom of page