top of page

సంపుటి మురిసింది - ఎపిసోడ్ 1


కొత్త ధారావాహిక ప్రారంభం


'Samputi Murisindi Episode 1' - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 13/12/2023

'సంపుటి మురిసింది ఎపిసోడ్ 1తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"పద.. పెళ్లి చేసుకుందాం." చెప్పింది సంపుటి. 


నిబ్బరం తప్పాడు శ్రీహరి. సంపుటినే చూస్తూ ఉండి పోయాడు.


సంపుటి మెత్తగా నవ్వుతుంది.. తనూ అతడ్నే చూస్తుంది. తను ఇంటర్మీడియట్ ఫస్టియర్ సైన్స్ స్టూడెంట్.

"ఏంటి.. అలా చూస్తున్నావు." ప్రశ్నించింది.


శ్రీహరి ప్రయత్నంతో తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. తను సంపుటి కో-స్టూడెంట్. 


"నువ్వు.. నా వెంట పడుతుంది దీనికేగా." సర్రున అంది సంపుటి.


శ్రీహరి సతమతంలోనే ఉన్నాడు. ఐనా ఆమె మాటలు వింటున్నాడు.


"ఏం.. మాట్లాడు. నువ్వు తంటాలు పడుతుంది.. నా లవ్ కేగా. లవ్ తర్వాత పెళ్లేగా. ఆ పెళ్లేదో ముందు కానిద్దాం. తర్వాత ఎంచక్కా ప్రేమించుకుందాం." రెట్టిస్తుంది సంపుటి.


శ్రీహరి మెల్లిగా తలెత్తి.. చుట్టూ చూసాడు.

వాళ్లిద్దరు.. ఆ జూనియర్ కాలేజీ మలుపున.. రోడ్డుకు ఓరగా ఉన్నారు.

ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు.

అప్పటికే కాలేజీ మొదలై.. కొన్ని నిముషాలు అయ్యాయి.

ప్రస్తుతం.. ఆ ఆవరణలో సంచారాలు చాలా మేరకు తగ్గాయి..


"క్లాస్ మొదలవుతుంది." చెప్పగలిగాడు శ్రీహరి. పైగా కదిలాడు కూడా.


"ఆగు. ఎన్నాళ్లీ దాగుడు మూతలు. ఇక చాలు." అనేసింది సంపుటి.


"అది కాదు.. అలా కాదు.." గింజుకుంటున్నాడు శ్రీహరి.


"నా వెంబడి పడినప్పుడు లేంది.. ఈ వేళ ఏంటి నీ పితలాటకం." విసురుగా అడిగేసింది సంపుటి.


శ్రీహరి నిజమైన అవస్థ చవి చూస్తున్నాడు. సన్నగా వణుకుతున్నాడు కూడా. చుట్టూ పరికించుతున్నాడు.

"నీతో నాకు కాదు కానీ.. ముందు బుద్ధిగా చదువుకో. బాగుంటుంది." చెప్పుతుంది సంపుటి.


అప్పుడే.. గిర్రున తల తిప్పి.. సంపుటిని చూసాడు శ్రీహరి.

"నా వెనుక తిరగడాలు ఆపేసి. బాగుంటుంది." తేల్చేసింది సంపుటి.


శ్రీహరి ఒళ్లు కంపరంకు లోబడిపోతుంది..

 "ఇంత ఎండలో ఆ జలదరింపు ఏల." నాటకీయంగా అంది సంపుటి.


అప్పటికే తన చూపును కిందకి మరల్చుకున్నాడు శ్రీహరి.

"అబ్బాయ్. నో ఛాన్స్. నా నుండి నువ్వు తప్పుకో. కాదు.. కూడదు అంటే.. పెళ్లికి పద." చెప్పేసింది సంపుటి.


శ్రీహరి తలెత్తుకో లేక పోతున్నాడు.

అప్పుడే.. సంపుటి..

"రా. క్లాస్ కు పోదాం. చదువు కుందాం." అంది. 


కాలేజీ లోకి కదిలింది.. తన స్కూటీని తోసుకుంటూ.

కొంత ముందుకు వెళ్లేక.. వెనక్కు చూసింది.

ఇంకా శ్రీహరి రావడం లేదు.

"రా." అరిచింది సంపుటి.


దాంతో.. శ్రీహరి.. మర బొమ్మలా.. తన బైక్ ను నెట్టుకుంటూ.. భారంగా కదిలాడు.

అప్పుడు సమయం.. ఉదయం 9-36.


***

డిన్నర్ కొనసాగుతుంది.

కొద్దిసేపు నిశ్శబ్దం పిమ్మట.. 

"సంపుటి." భోజనం చేస్తున్న కూతురును చూస్తూ పిలిచింది సంచిక.


భోజనం ఆపి.. తల్లిని చూస్తుంది సంపుటి.


సంచిక భర్త.. ప్రమథ.. తల దించుకొని.. తిండి తింటున్నాడు.


"నాన్నతోనే కాదు.. నాతోనూ అట్టివి డిస్కస్ చేస్తుండాలి." చెప్పింది సంచిక.. సంపుటినే చూస్తూ.


ప్రమథ తిండి ఆపి.. తల ఎత్తి.. భార్యను చూసాడు. వెంబడే చూపును కూతురు వైపు తిప్పాడు.


"అట్టివి అంటే.. ఎట్టివి." అడుగుతుంది సంపుటి.. తల్లిని చూస్తూ.


"వయస్సుకు మించిన ముదురయ్యావు." చికాకవుతుంది సంచిక.


"విషయంకు రామ్మా." సూటయ్యింది సంపుటి.


"చెప్తా. నీకు.. నీ నాన్న.. వత్తాసుగా. అందుకే నీకు ఇంతటి పెడసరం." భళ్లుమంది సంచిక.


"స్టేట్మెంట్స్ ఎందుకు.. సూటిగా అడిగేయక." చిర్రవుతుంది సంపుటి.


అప్పుడే.. "అమ్మ అడిగేది విను ముందు." మెల్లిగా మాట్లాడేడు ప్రమథ.. సంపుటినే చూస్తూ.

సంపుటి తగ్గింది.

అర నిముషం పిమ్మట..

కూతురును చూస్తూ.. "ఆ శ్రీహరితో నువ్వు అలా బిహేవ్ చేయ రాదు." అంది సంచిక.


ఆ వెంబడే..

భర్తను చూస్తూ.. "ఆ బిహేవ్ ను మీరు.. వెనుకేయడం సబబు కాదు." అనేసింది.


ప్రమథ తల దించుకున్నాడు. 

"సారీ చెప్పాగా." అన్నాడు మెల్లిగా.


"మీ సారీ వట్టి బోడిది. దాని బదులు.. సంపుటిది ఖండించాలి." టక్కున అంది సంచిక.


ప్రమథ మాట్లాడ లేదు.

కానీ సంపుటి మాట్లాడింది.

"ఆ శ్రీహరి వాటం నాకు నచ్చ లేదు. చదువును వదిలి.. ప్రేమ అంటూ.. వెంట పడడం ఏమిటి. అందుకే తుంచేసాను." అంది విసురుగా.


"అది పొగరుతనం. ఇట్టి నిర్వాకంకి పర్యవసానం ఊహాతీతం. అర్థం చేసుకో.." చెప్పుతుంది సంచిక.


అడ్డై..

"నువ్వంటుంది నాకు అర్థం కావడం లేదు." అంది సంపుటి.


ఆ సమయంన.. కూతురునే చూస్తున్నాడు ప్రమథ.

"ప్రస్తుతం నీది.. పసర వయస్సు.. మధ్యస్థ చదువు.. మిడి మిడి అవస్థలు.." 

చెప్పుతున్న తల్లికి అడ్డై..

"పాయింట్ కి రామ్మా." విసుగవుతుంది సంపుటి.


"అంతే మరి. చెప్పాలనుకునేదేదో చక్కగా చెప్పేయ వచ్చుగా." కలగ చేసుకున్నాడు ప్రమథ.


భర్తను చూస్తూ.. సంచిక గుర్రుమంది.


"సంచిక కూల్. అర్థం చేసుకొనేలా చెప్పితే.. మన సంపుటి వినక పోతుందా." నెమ్మదిగా చెప్పేసాడు ప్రమథ.


సంచిక తమాయించుకుంది.

అర నిముషం తర్వాత.. కూతురుని చూస్తూ..

"నువ్వు.. ఆ శ్రీహరిని అంత రఫ్ గా రిఫ్యూజ్ చేయక.. కాస్తా కుదరుగా నీ అఇష్టతను తెలియ పర్చవలసింది." చెప్పింది.


"అతడు చాన్నాళ్లుగా నా వెంట పడుతున్నాడు. నన్ను అస్థిర పరుస్తున్నాడు. నేను.. నా చేతలతో.. నా తిరస్కారాలని ప్రదర్శస్తూనే వచ్చాను. అబ్బే.. అతడి సొద అతడిదే. అందుకే అట్టి మాటలతో తేల్చేసాను." చెప్పింది సంపుటి.


"అలా చెప్పిందే సవ్యంగా లేదు. నీ మాటలకు అతడు హర్ట్ ఐ.. ఏమైనా చేపట్టితే.. ఎంత గిల్టీ." నొచ్చుకుంటుంది సంచిక.

తల్లినే చూస్తున్న సంపుటి.. వెంటనే ఏమీ చెప్పలేక పోయింది.

ప్రమథ కలగ చేసుకున్నాడు.

"అలా ఏమీ కాలేదు లే. ఆ శ్రీహరి సాఫీగా తప్పుకుంటాడు లే." అన్నాడు.


ఆ వెంబడే..

"ముందు డిన్నర్ పూర్తి చేద్దాం." చెప్పాడు.


డిన్నర్ ముగుస్తుండగా..

"సంపుటి." అంది సంచిక.


సంపుటి తలెత్తి.. తల్లిని చూస్తుంది. 

"డోన్ట్ లెట్ దిస్ హెప్పన్ ఎగేన్. ప్లీజ్." చెప్పింది సంచిక. 


ఆమె గొంతు బాగా బొంగరయ్యింది.

సంపుటి ఏమీ అనలేకపోతుంది.


ప్రమథ.. "యస్ బేబీ.. ప్లీజ్. ఇకపై నీ అఇష్టతలను మా దృష్టికి తే. మేము నీ పక్షాన హేండిల్ చేస్తాంగా. నువ్వు స్ట్రగుల్ కాకూడదు." చెప్పాడు కూతురును చూస్తూ.


సంపుటి సన్నగా తలాడించగలిగింది.


***

మర్నాడు..

తను పని చేస్తున్న చోట ఉంది సంచిక.

ఆ చోట.. తనది మేనేజర్ హోదా.


తను.. తన కేబిన్ లో.. ఒక్కర్తె ఉంది. తన ముందు ఫైల్స్ దొంతరగా ఉన్నాయి. కానీ అటు పనికి ఆమె సానుకూలంగా లేదు. ఆమె లోని తర్జనభర్జనలు.. ఆమెను సతమతం పెడుతున్నాయి.


మరి తాళ లేక.. తన చిన్న నాటి స్నేహితుడు.. శ్రీకర్ కు ఫోన్ చేసేసింది.


శ్రీకర్ విశాఖపట్నంలో ఉద్యోగ రీత్యా ఉంటున్నాడు.

సంచిక హైదరాబాద్ లో ఉంటుంది.


అటు శ్రీకర్.. సంపుటి ఫోన్ కాల్ కు కనెక్ట్ అయ్యాడు.

"హలో.. చిక." పలకరించాడు.


"కర్.. బిజీయా." అడిగింది సంచిక.

"నో. చెప్పు." చెప్పాడు శ్రీకర్.


సంచిక సర్దుకుంటుంది.

"కర్.. నేను ఈ మధ్య.. చిరాకయ్యిపోతున్నాను." మెల్లిగా చెప్పగలిగింది సంచిక.


అటు శ్రీకర్ కాస్తా కుదురు తప్పాడు. కానీ ఏమీ అడగ లేదు.

"నిన్న.. సంపుటితో నాస్టీగా వ్యవహరించాను." చెప్పింది సంచిక.


"నువ్వా." ఆశ్చర్యమయ్యాడు శ్రీకర్.

"అవును కర్. నిజమే.. నేనే అన్కాన్సియస్ గా మెసిలాను. తేరుకొనేక.. సంపుటికి 'సారీ' చెప్పలేక పోయాను." 

నొచ్చుకుంటుంది సంచిక.


అది శ్రీకర్ గుర్తించగలిగాడు.

"కూల్ చిక." అప్పటికి చెప్పగలిగాడు. ముందు సంచిక కుదురు కావాలని అతను తలుస్తున్నాడు.

సంచిక ఏమీ చెప్పడం లేదు.

తప్పక శ్రీకర్ అడిగాడు. "ఇంతకీ ఏమైంది."


శ్రీహరి వ్యవహారం.. శ్రీకర్ కి.. క్లుప్తంగా చెప్పగలిగింది సంచిక.

ఆ వెంబడే..

"సంపుటి తీరు ఘోరంగా." అడిగింది.


"ఉఁ" కొట్టాడు శ్రీకర్. 


"తొలుత నుండి సంపుటిలో ఆ ముక్కుసూటితనం జాస్తీగా." అనేసాడు.


"ఏమీ కాలేదు కానీ.. ఆ శ్రీహరి.. సంపుటి తీరును సీరియస్ గా తీసుకొనుంటే.." ఆగింది సంచిక. తను బెంబేలవుతుంది.


అంతలోనే.. "సరే. ఏమీ కాలేదుగా." అనేసాడు శ్రీకర్.

ఆ వెంబడే..

"నేను సంపుటితో మాట్లాడతా." చెప్పాడు.


"వద్దులే. నేను రిక్వెస్ట్ చేసానులే." చెప్పింది సంచిక.


"ప్రమథకు తెలుసా." అడిగాడు శ్రీకర్.

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









93 views0 comments

댓글


bottom of page