top of page

హృదయ రాగాలు - పుస్తకావిష్కరణ

Updated: Apr 12

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #హృదయరాగాలు, #HrudayaRagalu, #బాలగేయాలు

కవి సోమన్న "హృదయ రాగాలు" పుస్తకావిష్కరణ కడపలో..


Hrudaya Ragalu - Book Unveiling Ceremony At Kadapa - Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 10/02/2025

హృదయ రాగాలు - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 63వ పుస్తకం "హృదయ రాగాలు" అవనిగడ్డ శాసన సభ్యులు డా.మండలి బుద్ధ ప్రసాద్, ఉపకులపతి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆచార్య వెలదండ నిత్యానంద రావు,ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి , జింక సుబ్రహ్మణ్యం,ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు శివకృష్ణ మరియు విచ్చేసిన అతిరథ మహారథుల చేతుల మీద ఐ.ఎం. ఎ హాల్, శంకరాపురం,కడపలో ఘనంగా ఆవిష్కరించారు.పిదప ఈ పొత్తాన్ని శ్రీ యల్లాప్రగడ నరసింహ సాయి గారికి అంకితమివ్వడం జరిగింది. అనంతరం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో 64 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ డి. కె.చదువులబాబు, కవి,కళాకారుడు శ్రీ కె.వి.నాగేశ్వరయ్య, కొప్పుల ప్రసాద్,జహీర్ మరియు అతిరథ మహారథులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.


-గద్వాల సోమన్న












Comments


bottom of page