#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #IlavelpuluPillalu, #ఇలవేల్పులుపిల్లలు

Ilavelpulu Pillalu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 01/01/2025
ఇలవేల్పులు పిల్లలు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
పిల్లలతో కళకళ
సెలయేరుల గలగల
తారమ్మల మిలమిల
లేకుంటే వెలవెల
ఇల్లంతా సందడి
బుడిబుడి నడకలతో
తలపించును సింగిడి
నవ్వుల పూవులతో
పసి పిల్లల లోకము
భువిని స్వర్గధామము
అత్యంత పవిత్రము
చూడ దేవాలయము
పిల్లలు ఇలవేల్పులు
ప్రకాశించు భానులు
సదనానికి అందము
మిక్కిలి ఆనందము
-గద్వాల సోమన్న
గద్వాల సోమన్న గారి కవిత "పిల్లలు ఇలవేల్పు లు" ... అద్వితీయం.
పిల్లలు దేవుడి ప్రతి రూపాలు ... వారి లేత మనస్సులు - పసి హృదయాలు ... మందిరాలు.
పి.వి.పద్మావతి మధు నివ్రితి