ఇల్లాలి జీవితం..
- Mohana Krishna Tata
- Jan 13
- 1 min read
Updated: Jan 21
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Illali Jeevitham, #ఇల్లాలి జీవితం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Illali Jeevitham - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 13/01/2025
ఇల్లాలి జీవితం - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
ఇల్లాలి జీవితం..
పరమ పవిత్రం
మగని మనసున ఆమెదే గొప్ప స్టానం
ఆయనే ఆమెకు పెద్ద వరం
మధురంగా సాగాలంటే వారి సంసారం..
భర్తకు పంచివ్వాలి అంతులేని మమకారం
చేయూత నిచ్చి చేయవలె ఉపకారం
కోరికలు తీర్చుటలో ఆమె అందించవలె సహకారం
ఏది ఏమైనా..
ఆమె సహనంతో చక్కదిద్దుకోవలె సంసారం
అటులైన ఇద్దరి జీవితం అయ్యే స్వర్గం
చెలాయించరాదు ఎన్నడూ భర్త పై అధికారం
చూపించరాదు అస్సలు అహంకారం
కలనైనా తలపెట్టరాదు ఎప్పుడూ అపకారం
అస్సలు ఉండరాదు ఆమెకు ప్రతీకారం
అలా లేకపోతే..
కాదు..వద్దు అంటే..
ఇద్దరి జీవితం అయ్యే అంధకారం
-తాత మోహనకృష్ణ
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comentários