#AyyalaSomayajulaSubrahmanyam, #IntiDongaPremaGola, #ఇంటిదొంగప్రేమగోల, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguCrimeStory

Inti Donga Prema Gola - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/02/2025
ఇంటి దొంగ - ప్రేమ గోల - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
“దోపిడీకి గురైన బ్యాంకు డబ్బును ఎంత వీలయితే అంతతిరిగి వెనక్కి తేవాలి. ఇదె
వ్వరికీ తెలియకూడదు. మీ సాయం కావాలి”- ఏసిపి. రఘుని బతిమాలుతున్నాడు బ్యాంకు మేనేజర్ బలరామ్. ఏసీపి పక్కనే సి. ఐ. ప్రతాప్ ఉన్నాడు.
“నేరస్తుడెవరో తెలుసుకోగలిగాం. కానీ అతడు అదృశ్యమయ్యాడు. గాలిస్తున్నాం కానీ, జాడ దొరకడం లేదు. ఇదిగో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్” ప్రతాప్ చెప్పాడు.
ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్న బ్యాంక్ అది. నెట్ ట్రాన్స్‌ఫర్‌లు రోజూ జరుగుతుంటాయి. ఆ బ్యాంకులో ఇంకా పాతకాలం నాటి పద్దతి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ లెటర్లు కూడా అమలు చేస్తున్నారు. నెట్ వాడకం తెలియని వాళ్ళు ఈ పద్దతి లోనే కాష్ బదిలీ చేస్తున్నారు. అయితే ఓ రోజు క్లర్కుకి అనుమానం వచ్చింది.
ఎందుకంటే, అంతకుముందు ఇలాంటి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కి బ్యాంకునుంచి ఎటువంటి కనఫర్మేషన్ అందలేదు. దాంతో ఆ బ్యాంకుకి ఫోన్ చేశాడు. వాళ్ళు అలాంటి లెటర్ పంప లేదన్నారు. దాంతో అతడు పాత రిక్వెస్ట్ లెటర్లు, ఈ మెయిల్స్, పాత ఉత్తరాలన్నీ పరిశీలించడంతో పెద్దకుట్ర బయటపడింది.
క్లయింట్‌మెయిల్ నుంచి, బ్యాంకు మెయిల్ నుంచి, బ్యాంకులెటర్‌హెడ్‌ల పైన ఈ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్టులు వచ్ఛాయి. కానీ అవి క్లయింట్ పంపలేదు. ఎవరో బ్యాంకు మెయిల్ ఎకౌంట్ ను తెలుసుకుని, బ్యాంకు లెటర్‌హెడ్ దొంగలించి ఈ పని చేస్తున్నారు. లెక్కలు చూస్తే కోట్లలో డబ్బు మాయమైంది. ఇది ఇంటిదొంగల పనే. బ్యాంకులో పని చేసే వారి పనే అని పోలీసులు అనుమానించారు.
అందుకని ప్రస్తుత, రిటైర్ అయిన వాళ్ళందరి మీద నిఘా పెట్టారు. ఆరునెలల క్రితం రాజీనామా చేసిన విజయ్ పై వారి దృష్టి పడింది. మంచిగా, ఎంతో నైపుణ్యంతో పనిచేస్తున్న విజయ్ కు ఒక కోరిక ఉంది. గొప్ప సినీ నటుడుగా, హీరోగా అయిపోవ్వాలని.
హఠాత్తుగా ఒకరోజు రాజీనామా చేశాడు. ఇంక ఎవ్వరికీ కనబడలేదు. నేనే సినిమా తీస్తున్నానంటూ ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు. సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్కరినీ అడిగారు. ఎక్కడా జాడ లేదు. అతనికి చుట్టాలు, పక్కాలు ఎవ్వరూ లేరు. విజయ్ పరారయ్యాడు. మొత్తం డబ్బంతా తీశాడు కానీ ఎకౌంట్ క్లోజ్ చేయలేదు. దానిపైనే మొత్తం నిఘాను పెంచారు. విజయ్ ట్రాన్స్‌ఫర్ చేసిన ఎకౌంట్ లన్నీ నకిలీవి, దొంగవి.
"మీరు బాగా డీల్ చేశారు. నేను ఇంతకన్నా ఎక్కువగా ఏమీ చేయలేను' అని రఘు ప్రతాప్ తో అన్నాడు.
“అలా అనకండి.. మీరు కేసు టేకప్ చేసి మీ తరహాలో శోధించండి. మీకు ఏమైనా కొత్త విషయాలు తెలియవచ్చేమో” అన్నాడు బలరామ్ ప్రాదేయపడుతూ ఏసీపి రఘు తో.
సరేనని రఘు తలూపి మళ్ళీ ప్రతాప్ తో కలిసి కేసును కూలంకషంగా స్టడీ చేశారు.
***
“సార్.. విజయ్ అద్దెకున్న ఇళ్ళ వాళ్ళందరినీ అడిగా. ఎవ్వరితోనూ కలవడు. ఎవ్వరితోనూ మాట్లాడడట కూడా. గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటాడట. సినిమాల్లోకి వెళ్ళిపోతున్నానని తెగ చెబుతుండేవాడట. ఇంతకంటే ఎవ్వరికీ ఏమీ తెలియ దంటున్నారు”
“ఆఫీస్ లో వాళ్ళ కొలీగ్స్ ను అడిగావా?” అడిగాడు రఘు.
“అందరినీ అడిగాను. ఎవరితో దగ్గరగా ఉండడట. అతనెవరో కూడా తెలియనట్టే ఉన్నారు” చెప్పాడు ప్రతాప్.
రఘు లేచి 'పద' అన్నాడు.
***
ప్రతాప్ అడిగిన వాళ్ళందరినీ మళ్ళీ రఘు దబాయించి అడిగాడు. వాళ్ళంతా నిజమే చెబుతున్నట్టుగా గ్రహించాడు. సెలవులో ఉన్న జానకి ని కూడా పిలిచి అడిగాడు.
ఆమె కూడా అందరిలాగానే చెప్పింది.
“అతను నీలాంటి అందమైన ఆడపిల్లను పెళ్ళి చేసుకోకుండా, ఇంకా మరెవరినీ కూడా చేసుకోకపోవటం విడ్డూరం గా ఉంది” అన్నాడు రఘు.
“అతను మంచోడే కానీ మా నాన్న కూడా అడిగారు నన్ను చేసుకొమ్మని. ఆ తరువాత ఏమయిందో కానీ అతన్ని అస్సలు కలుసుకోకూడదని మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు. అప్పడినుంచి నేను కలుసుకోలేదు అతన్ని”.
------
జానకి ఇంటికి వెళ్లారు ప్రతాప్, రఘు.
“అమ్మ పోయినప్పటినుంచి నాన్నకు సరిగా లేదు” చెప్పింది జానకి.
ప్రతాప్ ను చూసి ఎవరో అనుకుని, ఏదో డబ్బు విషయం మాట్లాడాడు జానకి తండ్రి. ప్రతాప్ మాటలు అస్సలు వినిపించుకోలేదు. ఇక ఆయనతో మాట్లాడి లాభం లేదని గ్రహించి “లాభం లేదు సార్” అన్నాడు.
కానీ ప్రతాప్ ని ఊరికొమ్మని సంజ్ఞ చేశాడు రఘు.
కానీ ప్రతాప్ మాటలకి పెద్దాయన అతడి వైపు కోపంగా చూశాడు.
“నీకు నేను బ్యాంకు లోనే చెప్పాను కదా। నాకూతురి వైపు చూస్తే ఊరుకోనని. సినిమాలో ఐటమ్ డాన్సర్ వెంట తిరిగే నీలాంటి వాడిని కన్నెత్తి చూడవద్దని నా కూతురు కు
చెప్పా. నువ్వు మంచి వాడివని అనుకున్నాను. ముందు బైటికి నడు” కోపంగా అరిచాడు.
ప్రతాప్ బిత్తరపోయాడు.
రఘుకి ముఖం లో నవ్వులు వెలిసాయి.
“విజయ్ చాలా మంచోడు” అన్నాడు రఘు. “నాకు బాగా తెలుసు”.
పెద్దాయన కోపంగా రఘు వైపు చూశాడు.
“నీకేం తెలుసని? విజయ్ ఎవరో తైతక్కలాడే, క్లబ్బు డాన్స్ లు చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నానని ఫోటో కూడా చూపించాడు”.
“నిజమా?” అన్నాడు రఘు.
“అవును” అంటూ ఆ పెద్దాయన, “ఆమె పేరు.. పేరు..” అంటూ మౌనంగా ఉండిపోయాడు.
“సార్, ఎక్కడ వెతుకుతాం, ఆమె ఎక్కడుందో, ఏ ట్రూప్‌లో ఉందో? అస్సలు ఫేమస్ కూడా కాదేమో? ఏదో రికార్డింగ్ డాన్సరేమో?”
రఘు డైరీ తీసి ఏదో నంబర్ కు ఫోన్ చేసి విజయ్ ఫోటో తీసుకుని ప్రతాప్ తో బైటకు వెళ్ళిపోయాడు.
------------
విజయ్ ఫోటోను పరిశీలనగా చూశాడు ఆంతోనీ. జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్.
“నా దగ్గర చాలా మంది డ్యాన్సర్లుంటారు. వాళ్ళ సొంత విషయాలు మేము పట్టించుకోం. ఎవరెవరో కుర్రాళ్ళు వస్తూంటారు. వాళ్ళనెవ్వరినీ మేము గుర్తు పెట్టు
కోలేం” అన్నాడు.
“ఒకసారి మీ వాళ్ళకి ఈ ఫోటో చూపెట్టండి” అడిగాడు రఘు.
సరే, అని అందరికీ చూపెట్టడం మొదలుపెట్టాడు. అందరూ అడ్డంగా తలలూపుతున్నారు. ఒకామె దగ్గర మాత్రం కళ్ళల్లో మెరుపు కనబడింది. ఆమె దగ్గరకు వెళ్ళాడు రఘు.
“ఇతను షాలినీ కోసం వచ్చేవాడు. రోజూ ఏవో బహుమతులు తెచ్చేవాడు. ఎంత చీ కొట్టినా వచ్చేవాడు”.
“ఇవాళ షాలినీ రాలేదా?” అడిగాడు రఘు.
“ఇక్కడ అవకాశాలు రావటం లేదని ముంబాయి వెళ్ళింది. అక్కడ బార్‌గర్ల్ గా జేరుతానని”
“ఆమె ఎడ్రస్ ఇస్తారా?” అడిగాడు రఘు.
--------
ముంబాయి లోని దాదర్ ఏరియా లో పెద్దపెద్ద విల్లాల పక్కన జోపడ్‌పట్టీ లు వున్నాయి. అందులో ఓ అగ్గిపట్టెలాంటి దానిముందు తలుపు తట్టాడు రఘు.
“ఎవరు కావాలి” అని ఒకామె అడిగింది.
“షాలిని ని కలవాలి. సినిమాలో అవకాశం ఉంది”
“అందరూ దాని వెంటే పడతారు. అది చీ కొట్టినా. హైదరాబాద్ నుంచి ఒక బకరాగాడు వచ్చాడు. వాడిని సుబ్బరంగా వాడేసుకుంటోంది. వాడికి మాత్రం తెలియటంలేదు”
“ఏ స్టూడియో?” అడిగాడు రఘు.
-------
“ఇప్పుడే వెళ్ళిపోయారు సాబ్'” రఘు కు జవాబొచ్చింది.
' ఎక్కడికి వెళ్ళింది? ఒక్కతే నా?వెంట ఎవరైనా ఉన్నారా? అడిగాడు రఘు.
' ఆమెని ఒంటరిగా వదలడు. మదన్ తోటి వెళ్ళింది.
' ఎటు వెళ్ళారు?
“ఏదైనా బీచ్‌కో.. డిన్నర్ చేయడానికో..” చెప్పాడతను.
“ఇటువంటి వాళ్ళు ఏ హోటల్ కు వెళతారు సాధారణంగా?”
“ఎక్కువగా బీచ్‌తాజ్ కు వెళతారు”
---------
బీచ్‌తాజ్ లో అందరినీ ఓ పక్కనుండి చూడసాగాడు. షాలినీ, విజయ్ పోలికలతో ఎవ్వరూ కనబడటంలేదు. అటుఇటు తిరగుతున్న వెయిటర్ కు ఫోటో చూపెట్టి ‘వీళ్ళు వచ్చారా’ అని అడిగాడు. వచ్చారని చెప్పి వాళ్ళ కాబిన్ చూపెట్టాడు.
మెల్లిగా కాబిన్ దగ్గరకెళ్ళి తలుపు తీసి లోపల అడుగుపెట్టాడు రఘు.
మోకాళ్ళపై కూర్చుని షాలినీ ని బతిమాలుతున్నాడు విజయ్.
“నువ్వు లేందే నేను బతకలేను. నేను సంపాదించినదంతా నీకే. నన్ను పెళ్ళి చేసుకో”
ఆమె ఏం సమాధానమిచ్చేదో కాని రఘుని చూసి అలా ఆగిపోయింది.
“విజయ్.. నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బంతా నీది కాదు. బ్యాంకుది” అన్నాడు రఘు.
“సారీ.. నేను మదన్ ని. విజయ్ కాదు” అన్నాడు తేరుకుని.
అడుగు ముందుకేసి దవడ మీద లాగి కొట్టాడు రఘు.
“అమ్మా” అని దవడ పట్టుకున్నాడు విజయ్.
“ఇతను ఏం చేశాడు?” అడిగింది షాలినీ.
“బ్యాంకు డబ్బు దొంగలించాడు” చెప్పాడు ప్రతాప్.
“నేను ఏం చేసినా షాలినీ కోసమే చేశాను! నేను దొంగను కాను”.. అరుస్తున్న విజయ్ ను బయటకు లాక్కొచ్చి. సంకెళ్ళు వేశారు రఘు & ప్రతాప్.
ఇలా ప్రేమగోలలో పడి ఇంటిదొంగయ్యాడు విజయ్.
—————————-శుభంభూయాత్—————————-
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments