top of page

ఙ్ఞానమ్మ


'Jnanamma' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

'అమ్మగారు' వెళ్ళి పోయింది. ఆశ్రమమంతా విషాదం అలుముకుంది. కన్నీటి వీడ్కోలు చెబుతోంది. ఆశ్రమంలో చిన్నాపెద్దా... అమ్మగారి గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

స్వర్ణ వదనం వివర్ణమైంది... తనకు ఇప్పుడు 50 సంవత్సరాలు..


తను చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఆశ్రమానికి తీసుకురాబడిందో తెలీదు. ఎవరో తనని వాకిట్లో వదిలేసి వెళ్ళారట. అమ్మగారు తన చేతులతో పెంచింది. అమ్మగారు తెల్లని చీరెలాంటి బట్టను తలమీద ముసుగులా వేసుకునేది. నందివర్ధనం పువ్వును గుర్తుకు తెచ్చేది.


తను విన్న కథ ప్రకారం ఆలోచిస్తోంది, స్వర్ణ.

'అమ్మగారి' పేరు ఙ్ఞానప్రసూనాంబట. అందరూ పేరుమరిచిపోయారు. 'అమ్మగారు' గానే పిలువబడింది. బాల్యవివాహం పేరుతో అమ్మగారికి ఎనిమిదేళ్ళ వయసులోనే, యాభై ఏళ్ళ రెండో పెళ్ళి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసారుట.

అప్పుడు ఆమెపేరు... 'ఏమే! ఒసేవ్' ట.


అత్తగారింట్లో అదేపేరు. అక్కడ ఆమెపేరు అందరూ మరిచిపోయారు. ఈమె యుక్తవయసు వచ్చి, సంసారం గురించి కలలు కనే వయసులో తన భర్త మొదటి సంబంధం పిల్లలతో 'అమ్మా' అని పిలిపించుకుందామని ప్రయత్నించినా

ఈమెను 'సవతి తల్లి'అనే మిషతో గొడవలతో, దూరంగాఉంచేసారు.


భర్తతో ఒక్క పిల్లనో, పిల్లవాడినో కని 'అమ్మా' అనిపిలిపించుకోవాలని తపన పడింది. కానీ అప్పటికే క్షయ రోగం ముదిరిపోయి, అతనికి సేవలుచేయటానికే సమయం వెచ్చించింది. ఈమెకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి, భర్తపోయాడు. కాపురం చేయకుండానే 'విధవ' అనే ముద్రతో పుట్టింటికి చేరింది.


ఆ రోజుల్లో ఆచారం ప్రకారం శిరోముండనం చేయించి, తెల్లచీర ముసుగుతో తిరిగే 'ఙ్ఞానమ్మ', ఊరిలో అందరికీ వంటలక్క. ఏ ఇంట్లో ఏ కార్యం జరిగినా వంటకు సాయం వెళ్ళేది. తలలో నాలుకలా మెలిగేది.


వీళ్ళు పదిమంది సంతానం. ఈమే అందులో చివరిది... అన్నలూ, అక్కడ పిల్లలు, ఙ్ఞానం పిన్ని, ఙ్ఞానత్తా, అనే పిలిచారుగానీ 'అమ్మా'అని ఎవరూ పిలవలా. 'అమ్మా' అని పిలిపించుకోవాలని ఎంత తపించిపోయిందో! చనిపోయిన ఆ జీవుడికే తెలుసు.


పెద్దన్న పెళ్ళాం, పిల్లవాణ్ణి కని పురిట్లోనే పోతే, ఆ పిల్లవాణ్ణి పెంచుకోవాలని" 'అమ్మా' అను "చిలకపలుకులుగా, నేర్పుకుంటుంటే, తమ్ముడు మధ్యలో వచ్చి, "భర్త పోయిన దానివి.. వీడు 'అమ్మా'అనిపిలిస్తే, నాన్న ఏడి? నాన్నపోయిన ఇన్నాళ్ళకి నన్నెలా కన్నావ్? అని వాడు అడిగితే, ఏం సమాధానం చెబుతావ్ ?" మాటలతో గుండెల్లో గుచ్చేసి,

"అత్తా " అని అలవాటు చేసాడు.


నలుగురు పిల్లల తండ్రి.... అన్నయ్యకు... తనకన్నా తక్కువ వయసున్న మరో అమ్మాయితో పెళ్ళిజరిపించారు పెద్దలు. ఆ పెళ్ళిలో చాకిరీ అంతా ఙ్ఞానమ్మదే.

కానీ ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన, ఙ్ఞానమ్మకు పెళ్ళి చేయాలనే,

ఆలోచన, పెద్దలకు రాకపోవటం?!.... అనే విచారకరమైన సాంప్రదాయాన్ని మోసింది.


భర్తనుండి సంక్రమించిన ఆస్థితో, ఇంట్లో అందరితో పోరాడి... ఊరిచివర ఈ ఆశ్రమం పెట్టింది. అప్పుడు స్వర్ణ మెుదటి అనాధపిల్లగా, ఆశ్రమం ముందు వదిలేయబడి...

ఙ్ఞానమ్మ చేతుల్లోకి వచ్చింది. ఊహతెలిసాక... వారూ వీరూ పెద్దవాళ్ళంతా చెప్పారు అమ్మగారిని "అమ్మగారూ" అని పిలవాలి అని....


అప్పటినుండి అమ్మగారూ అని పిలుస్తూనే ఉంది. చాలా మంది పసిపిల్లలు, పెద్దపిల్లలతో 'అమ్మ' అని పిలిపించుకోటానికి ప్రయత్నించింది. కానీ ఆమెనూ గౌరవమో, భక్తో, వినయమో, 'అమ్మగారు' గానే మిగిలిపోయింది. తన గుండె లోతుల్లో 'అమ్మ' అనే పిలుపుఆవిరైపోయింది.


స్వర్ణ పెద్దదై, ఈ ఆశ్రమంలో వ్యక్తినే పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కన్నాక, ఆపిల్లలను ఎత్తుకు తిరుగుతూ, ఙ్ఞానమ్మ గారు పడ్డ ఆరాటం స్వర్ణ గ్రహించింది. తనే కాదు, ఆశ్రమంలో ఎంతో మంది పిల్లలను కన్నారు. ఏ పిల్లలను చూసినా,

'అమ్మగారి' తపన, 'అమ్మ'అనే పదం వాళ్ళనోట్లోంచి రాగానే, 'అమ్మగారు' చేసే సంబరం.... ఆమెచేసే ఉత్సవం....


ఆ తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు 'అమ్మగారు'అని పిలిపించి దండం పెట్టించటం.... అప్పుడు... అమ్మగారి ముఖంలో మారే రంగులూ.... స్వర్ణ గ్రహిస్తూనే ఉండేది.


అయ్యో! ఒక్కసారన్నా 'అమ్మా' అని పిలవలేకపోయానే? ఎంత పొరపాటు చేసానూ! అనుకుని బాధపడి, 'అమ్మా!'అని పిలవాలని నోటిదాకా వచ్చింది.

దీపావళి పండుగరోజు, ఆశ్రమంలో టపాకాయలు పేల్చుతూండగా, లక్ష్మీ ఔట్ పక్కనే పేలి.... చెవిలో కర్ణభేరి బద్దలై, చెముడు వచ్చేసింది.


ఇక 'అమ్మా'అని పిలిచినా, 'అమ్మగారూ' అనిపిలిచినా, వినబడదు.

ఇప్పుడు... ఇవాళ శాశ్వత నిద్రలోకి ఒరిగిపోయింది. ఆశ్రమ మూలస్థంభం కూలిపోయింది.

స్వర్ణ కన్నీరు కారుస్తూ..


"ఇంత ఆశ్రమం స్థాపించి, ఇంతమంది అనాధలను, పిల్లలకంటే ఎక్కువగా ఆదరించిన ఈ అమ్మకన్నా మిన్నెవరు? అందరంకలిసి, 'అమ్మా'అని ఆమె దగ్గరకు, వెళ్ళి, పిలుద్దాం" అంది.


కారణం ఏమిటో కూడా వివరించింది. విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరైన ఆశ్రమం అంతా 'అమ్మా!' అని ఎలుగెత్తి ఆక్రోసించింది. కానీ ఆమెకు వినబడదుగా!

/////////////

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









78 views1 comment

1 Kommentar


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
03. Feb. 2023

Srinivas Bhagavathula • 3 days ago

కథ చాలా బాగుంది... చక్కగా వ్రాసావు భారతీ.... మల్లవరపు సీతారాం గారు చదివిన విధానమూ బాగుంది

Gefällt mir
bottom of page