top of page

కాల వాహినిలో - పార్ట్ 8



'Kala Vahinilo - Part 8'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 13/09/2024

'కాల వాహినిలో - పార్ట్ 8' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. 


గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. 


గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. 

జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. 

ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది. 




ఇక కాల వాహినిలో.. పార్ట్ 8 చదవండి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనియున్న వారణాశి (కాశి).. హైందవతకు ప్రమాణం.. తరతరాలుగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం.. 


కాశీ వైభవాన్ని పూర్తిగా తెలుపడం ఎవరి తరమూ కాదు. సముద్రం నుండి తీసిన నీటి బిందువులాంటి సంక్షిప్త సమాచారం కాశీకి సొంతం. 

కాశీపట్టణం గొడుగులాంటి పంచ క్రోసుల పరిధిలో ఏర్పడిన భారత భూభాగం. ఇది లింగం లాంటి శ్రీ పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో వుంటుంది. కాశి బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. 


శ్రీ విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో పరమశివుడు నిర్మించుకొన్న ప్రత్యేక స్థలం. యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసముండే నగరం.. కలియుగాంత ప్రళయ కాలంలో.. మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. 


కాశీ యావత్ భువిపైని సప్త మోక్షద్వారాలలో ఒకటి. కాశీ పన్నెండు జ్యోతిర్లింగాలలో కల్లా శ్రేష్టమైనది. 

పద్నాలుగు భువన భాండాలలో విశిష్టమైన స్థలం. 


కాశీలో గంగా స్నానం.. బిందు మాధవ దర్శనం.. అనంతరం మొదటి డిండి వినాయకుడు.. విశ్వనాథుడు.. విశాలాక్షి.. కాలభైరవ దర్శనం.. అతి ముఖ్యం. 


ఎన్నోజన్మల్ పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడు. 


కాశీలో మరణించిన వారికి యమబాధ.. పునర్జన్మ వుండదు. 

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. 

డిండి గణపతి.. కాలభైరవుడు పరిశీలించి, యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారు. 


కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తరువాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించినవారు కాశి దాటి వెళ్ళిపోయినా పాపం అంటకుండా రక్షగా నల్లని కాశిదారం కడతారు. 

కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. 


కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వాడి కుడిచెవిలో తారకమంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. 

అందుకే ’కాశ్యాన్తు మరణాత్ ముక్తి’ అని శాస్త్ర వచనం. కాబట్టి చివరి జీవితాన్ని చాలామంది కాశీలో గడుపుతారు.


మరణించిన వారి అస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాధునిచే ఉద్ధరింపబడతారు. 


గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళి దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. 

ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీపట్టణం వదలి దూరం జరుగదు. 


పరమ శివుని కాశీ క్షేత్రంలోని కొన్ని వింతలు :-

కాశీలో గ్రద్దలు ఎగరవు. గోవులు పొడవవు. బల్లులు అరవవు. శవాలు వాసన రావు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి, పైకి లేచి ఉంటుంది. 


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి, అట్టిసందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది. 

కానీ పూర్వం అక్కడ అనేక సుందర వనాలు.. పూలమొక్కల చెట్ల మధ్యన ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడిచుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారు. 


అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అక్కడి పరిస్థితులపై అనేక రీసెర్చిలు జరిపి ఆశ్వర్యపోయారు. 


అసలు ఈ కాస్మోర్స్ ఎక్కడినుండి వస్తున్నాయి? ఊహకు అందని విషయం. 


అప్పటి పూర్వీకులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు. 


అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని పాశ్చాత్యులు ఆశ్చర్యానికి గురైనారు. 


కాశీ విశ్వేశ్వరులకు శవ భస్మంతో అభిషేక పూజ ప్రారంభిస్తారు. 


కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శించిన జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి విముక్తి లభిస్తుంది. 


కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటిరెట్లు ఫలితం ఉంటుంది. పాపం చేసినా కోటిరెట్లు పాపం అంటుతుంది. 


విశ్వనాథుని అభిషేకించిన తరువాత చేతి రేఖలు మారిపోతాయి. 


అక్కడ శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు, జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశి. 


కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి. 

అందులో దేవతలు.. ఋషులు.. రాజులతో పాటు ఎందరో తమ తమ శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. 

అందుకో కొన్ని ముఖ్యమైనవి. 


1. దశాశ్వమేధ ఘాట్ :-

బ్రహ్మదేవుడు పదిసార్లు అశ్వమేధయాగం చేసినది అక్కడే. రోజూ సాయంకాలం గంగామాతకు హారతి జరుగుతుంది. 


2. ప్రయాగ ఘాట్:-

ఇక్కడ భూగర్భంలో గంగతో యమున సరస్వతులు కలుస్తాయి. 


3. సోమేశ్వర ఘాట్ :-

చంద్రునిచేత నిర్మితమైనది. 


4. మీర్ ఘాట్:-

సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి పీఠం. ఇక్కడ యముడు ప్రతిష్టించిన శివలింగం ఉంటుంది. 


5. నేపాలీ ఘాట్ :-

పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టించాడు. 


6. మణికర్ణికా ఘాట్ :-

ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో త్రవ్వి నిర్మించాడు. ఇక్కశ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవులకు కూడా వర్ణనాతీతం. 


7. విశ్వేశ్వర్ ఘాట్ :-

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడ అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసి బిందుమాధవుణ్ణి దర్శిస్తారు. 

8. పంచగంగా ఘాట్:-

ఇక్కడ భూగర్భం నుండి గంగలో ఐదు నదులు కలుస్తాయి. 


9. గాయ్ ఘాట్ :-

అక్కడ గోపూజ జరుగుతుంది. 


10. తులసీ ఘాట్ :-

తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన స్థలం. 


11. హనుమాన్ ఘాట్ :-

అక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. అక్కడ సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యుడు జన్మించారు. 


12. అస్సీ ఘాట్ :-

పూర్వం దుర్గాదేవి.. శుంభ.. నిశుంభ.. అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గమును అక్కడ వేయడం వల్ల ఒక తీర్థం ఉద్భవించింది. అదే అస్సీఘాట్. 


13. హరిశ్చంద్ర ఘాట్ :-

సర్వం పోగొట్టుకొన్న సత్య హరిశంద్రుడు అక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడు. నేటికీ ఇక్కడ నిత్యం చితి కాలుతునే ఉంటుంది. 


14. మానస సరోవర్ ఘాట్:-

అక్కడ కైలాస పర్వతం భూగర్భ జలధార కలుస్తుంది. అక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం పుట్టిన పుణ్యం లభిస్తుంది. 


15. నారద ఘాట్ :- 

నారదుడు శివలింగాన్ని స్థాపించాడు.


16. చౌతస్సీ ఘాట్ :- 

స్కంధపురాణం ప్రకారం అక్కడ అరవైనాలుగు మంది యోగినులు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతిగల స్థలం. అక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి అరవై నాలుగు యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి. 

17. రాణామహల్ ఘాట్ :-

అక్కడ పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి గురించి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకొన్నాడు. 


18. అహల్యాబాయి ఘాట్ :-

ఆమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తున్నాము. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్స్ దగ్గర ఉద్భవించే తీర్థాలు ఇక్కడ కలుస్తాయి. 

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్యన విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందినది. 


కానీ మహమ్మదీయుల దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన తరువాత కాశీని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందుమాధవ్‍తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టారు. 


నేటి విశ్వనాథ మందిరంలో నంది, మసీదువైపు గల కూల్చబడ్డ మందిరంవైపు చూస్తూవుంది. అక్కడ శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కనే ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించింది. 


కాశీ.. వారణాశి స్మరణం.. మోక్షకారకం.. 


సత్యానందరావు.. సావిత్రి.. నరేంద్ర.. జానకీ.. కావ్య.. సదాశివం.. అన్నమ్మ.. తిరుమలరావు.. సోమయాజులు.. అన్నపూర్ణమ్మ.. రామయోగి కాశీక్షేత్రం చేరారు. మనస్సు మంచిదైతే అంతా మంచిగా జరుగుతుందన్న సామెత రీతిగా వారికి హనుమ అనే పేరుగల ఒక తెలుగు గైడ్ తటస్థపడ్డాడు. ముఫ్ఫై ఏళ్ల ప్రాయం.. అతను ఇరవై సంవత్సరాలుగా కాశీ వాసి. పై అన్ని వివరాలు హనుమ వారికి తెలియజేశాడు. క్రమంగా అన్ని స్థలాలను దర్శింపచేశాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు తెలిపాడు. 



ద్వాదశ జ్యోతిర్లింగాలు.. రాశులు అవి వున్న ప్రాంతాలు

రామేశ్వరం మేషం తమిళనాడు


సోమనాధ్ వృషభం

గుజరాత్


నాగేశ్వరం మిథునం గుజరాత్


ఓంకారేశ్వరం కర్కాటకం మధ్యప్రదేశ్


వైద్యనాధ్ సింహం ఝార్కండ్


శ్రీశైలం కన్య

ఆంధ్రప్రదేశ్


మహాకాళేశ్వరం తుల మధ్యప్రదేశ్


ఘృష్ణేశ్వరం వృశ్చికం మహారాష్ట్ర


విశ్వేశ్వరం ధనస్సు

కాశి

భీమశంకరం మకరం మహారాష్ట్ర


కుంభం కుంభం ఉత్తరాఖండ్


త్రయంబకేశ్వరం meena మహారాష్ట్ర


వారు వారణాసిలో ఐదు రోజులు ఉన్నారు. ఆ ఐదు రోజులు హనుమ వారితోనే గడిపాడు. ప్రణాళికబద్ధంగా ఆయా ప్రాంతాలన్నింటిని రోజుకు కొన్ని చొప్పున చూపించాడు. మూడుసార్లు పడవలలో వారిని సూర్యోదయానికి ముందే అవతల దరికి తీసుకొని వెళ్ళి స్నానాలు చేయించాడు. నాలుగురోజులు ప్రతి సాయంత్రం గంగామాతకు దశాశ్వఘాట్‍లో జరిగే మహా హారతిని తిలకించారు. 

ఆ ఐదురోజులు.. కావ్య కళ్ళు జనాల మధ్య చంద్రాన్ని ఎంతగానో వెదికాయి. ప్రతిరోజూ ఆశగా జనాలను కలయచూసేది. కాని ఆమెకు మిగిలింది నిరాశే.. రేపు ఉదయం బయలుదేరుతారనగా కావ్య ఆ రాత్రి తిరుమలను సమీపించింది. 


"ఏమ్మా.. పడుకోలేదా!"


"నిద్ర రావటం లేదన్నయ్యా!"


"అలా చల్లగాలిలో వీధిలో కొంతసేపు తిరిగివద్దామా!"


"అలాగే పద"


ఇరువురూ లాడ్జి ప్రాంగణం దాటి వీధిలో ప్రవేశించారు. 

నిర్మానుష్యంగా ఉంది మార్గం. వాచీని చూచాడు తిరుమలరావు. 

పదకొండున్నర.. 


"అన్నా!"


"చెప్పమ్మా!"


"ఇప్పుడు మనం ఆలయానికి పోగలమా!"


"ఆలయాన్ని మూసి వుంటారమ్మా!"


"ఈ ఐదురోజులూ జనాల మధ్యన బావ కనిపిస్తాడేమోనని పిచ్చిదానిలా వెదికాననన్నా!"


"ఆ విషయం నాకు తెలుసు చెల్లీ!"


"మరి బావ?!"


"ఎక్కడో వుండి వుంటాడు"


"మన వూరికి వస్తాడంటవా!"


తిరుమలరావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. 


"అన్నయ్యా.. ?" ప్రశ్నర్థకంగా తిరుమల ముఖంలోకి చూచింది కావ్య. 


నిలబడి కళ్ళు మూసుకొని వున్న తిరుమలరావు కళ్ళు తెరిచాడు. 


"తప్పక బావ వస్తాడమ్మా!" గట్టిగా చెప్పాడు. 


"అన్నయ్యా!" ఆశ్చర్యంతో చూచింది కావ్య తిరుమల ముఖంలోకి. 


"నా మాటను నమ్ము చెల్లీ!" చిరునవ్వుతో చెప్పాడు తిరుమల. 


కావ్య వదనంలో వింత కాంతి.. పెదవులపై దరహాసం.. సన్నగా తుంపర ప్రారంభమయింది. 

నీటి బిందువులు శరీరాలను తాకగానే ఇరువురి శరీరాలలో జలదరింపు. 

తిరుమలరావు ఆకాశంవైపు చూచాడు. 


"అమ్మా!.. వర్షం తీవ్రంగా రావచ్చు.. పద.. వెళ్ళిపోదాం"


"సరే అన్నయ్యా! నీ మాటలను విన్నాక నా మనస్సున ఎంతో ఆనందం. "


"అవి నా మాటలు కావు.. ఆ సర్వేశ్వరునివే.. వారు పలికించారు. నేను పలకలేదు"


కావ్య ఆనందంగా నవ్వింది. 

ఇరువురూ లాడ్జిలో ప్రవేశించారు. పడుకొన్నారు.. 


మరుదినం.. ఏడుగంటలకు ఎయిర్‍పోర్టుకు బయలుదేరారు. వయా హైదరాబాద్.. చెన్నైల మీదుగా ఎయిర్‍లో పయనించారు. 


ఆ యాత్ర అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. మనస్సులకు శాంతిని ప్రసాదించింది. దైవం మీద నమ్మకాన్ని.. ఆరాధనా భావాలను ద్విగుణీకృత పరచింది

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


31 views0 comments

Comments


bottom of page