top of page

కాలం తో పాటు


'Kalamtho Patu' New Telugu Story


Written By Sita Mandalika


రచన: సీత మండలీక

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“ఈరమ్మా, ఈదినం చంద్రయ్య కొడుకు, బిడ్డ ని చూసుకుందికి వస్తాడట. స్వరూప ని మంచి బట్టలేసుకుని మంచిగా తయారవమను. వాళ్ళు వచ్చేక చాయ్ బిస్క్యూట్లు తయారుగుంచు” అని భార్యకి చెప్పి చేనుకి బయలు దేరేడు వెంకటయ్య.

“బిడ్డా, సాయంకాలం పిల్లగాడు నిన్ను చూసుకుందికి వస్తాడట. జరా ఇల్లు నీటుగుంచి మంచిగా తయారవు” అంది ఈరమ్మ.


“అమ్మా, ఇప్పుడే కళ్యాణం చేసుకోను. నేను ఇంకా సదూకోవాల” చెప్పింది స్వరూప.

“ఏం మాట్లాడుతున్నావ్ స్వరూపా.. కళ్యాణం ఇప్పుడే సేసుకోవా. నీ దోస్తులందరూ పెండ్లాడి బిడ్డలను కన్నారే” కోపంగా అంది ఈరమ్మ.


“అమ్మా, పెద్ద చదువులు చదివి నౌకరీ చెయ్యాల” చెప్పింది స్వరూప.

“ఏంటి కొత్త కొత్త మాటలు సెప్తున్నావు. చంద్రయ్య కి మస్తు చేనుంది. ఒక్కడే కొడుకు. నామాట విని కళ్యాణం చేసుకో బేటా”


“అస్సలు బాగోడు ఆ క్రిష్నయ్య. నౌకరీ ఉన్న అబ్బాయి నే

చేసుకుంటా”

“నా మాట సమజ్హ్చేసుకో బిడ్డా” అని చాయ్ పత్తా తెచ్చుకుని ‘వస్తా’ అంటూ వీరమ్మ బయలు దేరింది.

***

"మమత అపార్ట్మెంట్స్" ఎదురుగా ఉన్న పార్క్ లో రోజూ పిల్లలు ఆడుకోడానికి వెళ్తూ ఉంటారు. పెద్దలు కూడా తమ తమ వీలుని బట్టి కలుస్తూ ఉంటారు. ఆ రోజు డాక్టర్ శర్మిష్ట, నర్మద సాయంత్రం పార్క్ లో కలవాలని నిశ్చయించు కున్నారు. నర్మద ఉమెన్స్ కాలేజీ లో లెక్చరర్ ఆరేళ్లనించి అదే అపార్ట్మెంట్స్ లో ఉండడం శర్మిష్ట తో బాగా స్నేహం ఏర్పడింది. అదీ కాక ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు.


“హలో శర్మిష్ట.. ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా రోజులయింది కదూ” అంది నర్మద

“ఆ బాగానే ఉన్నాను నర్మదా.. ఈ మధ్య నైట్ డ్యూటీలు చెయ్యవలసి వస్తోంది. ఇక శని ఆది వారాలు అలసట, బద్దకం” అంది శర్మిష్ట.

“అర్జెంటు గా పార్క్ లో కలుసుకొమ్మని కబురు చేసేవు. ఏమిటి విశేషం?” అడిగింది నర్మద.


“ అదే నర్మదా.. మా ఇంట్లో నా పెళ్లి గురించి పెద్ద గొడవ అయిపోతోంది. నీకు తెలుసుకదా.. అశోక్, నేను ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకుంటున్నాము. అమ్మ నాన్నకి ఈ పెళ్లి విషయం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటె లాభం లేదని నేనే నిన్న నాన్నకి అన్ని విషయాలు చెప్పేను. ఆరు నెలలో పెళ్లి చేసుకుని ఒక ఏడాది ఎంజాయ్ చేసేక పీ. జీ. చేస్తామని. ” అంది శర్మిష్ట.


“అంకుల్ రియాక్షన్ ఎలా ఉందొ నేను ఊహించగలను శర్మిష్టా.. ” అంది నర్మద. “అదే.. ‘ఆ కేరళ అబ్బాయి ఎందుకు? నా స్నేహితుడికి తెలిసిన కుటుంబం లో ఒక అబ్బాయి ఉన్నాడు. అందగాడు, తెలివైన వాడు, పీ. జీ. చేసి చాలా పెద్ద హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. మంచి అబ్బాయట. నీ తో మాట్లాడి ఒక రోజు వాళ్ళని పిలుద్దామనుకుంటున్నాను’ అని తేల్చేరు నాన్న.


“నాన్నా! ఏమిటి మాట్లాడుతున్నారు? ఒక అబ్బాయి తో మూడు గంటలు మాట్లాడి మా ఫ్యూచర్ నిర్ణయించగలమా. అశోక్ తో నాపరిచయం సెకండ్ ఇయర్ లో అయ్యింది. ఫస్ట్ ఇయర్ లో అతను క్లాస్ టాపర్. అది ఒక్కటే కాదు. తన ప్రవర్తన, మాట్లాడే తీరు అన్నీ నాకు నచ్చేయి. సెకండ్ ఇయర్ లోనే మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. దానితో చనువు ఏర్పడింది. మా ఇద్దరి మధ్య చాలా అభిప్రాయాలు కలియడం తో పెళ్లి చేసుకుందామని నిశ్చయించు కున్నాము సరైన సమయం లో మీకు చెప్పి మీ అనుమతి తీసుకుందామనుకున్నాను. కానీ ఆ నిశయానికి ముందు చాలా సమయం తీసుకున్నాము. కానీ వారం రోజుల్లో ఎలాగ నాన్నా.. అన్నిటికంటే ముఖ్యం ఒకళ్లనొకళ్ళు అర్ధం చేసుకోడం..”


‘శర్మిష్టా! నీ వాదన నీకు నచ్చవచ్చు గానీ, నా మాట కూడా విను. అశోక్ కేరళ అబ్బాయి. వాళ్ళ కట్టూ, బొట్టూ పద్ధతులు, అన్నీ మనతో పోలిస్తే తేడా కదమ్మా, వాళ్ళ ఆచార వ్యవహారాలలో చాలా బేధాలుంటాయి. మారో మాట నువ్వు గుర్తు పెట్టుకోవాలి. పెళ్లంటే ఇద్దరి మనుషుల కలయిక కాదు, రెండు కుటుంబాల బాంధవ్యం’ అంటూ చాలాబోధ పరిచేరు.


‘అదీ కాక మరొక విషయం మర్చిపోతున్నావు. అమెరికాలో ఉన్న నీ అన్న నిన్ను చూసి ఎవరిని చేసుకున్నా ఏమీ అనలేము’ అని నాన్న చాలా సేపు ఆ విషయం బోధ పరిచేరు.

పెళ్లంటే ముఖ్యం గా మనసులు కలయిక అని ఎందుకు భావించరో?ఇంక వాదించడం ఇష్టం లేక ఊరుకున్నాను, ఐ అం గోయింగ్ టు మేరీ అశోక్ ఓన్లీ నర్మదా” అంటూ దృఢం గా చెప్పింది శర్మిష్ఠ.

స్నేహితురాలి మాటల తీరుకి మురిసిపోయింది నర్మద. తన జీవితం తనే తీర్చి దిద్దుకుంటున్న సంతోషం శర్మిష్ఠ కళ్ళల్లో కనిపించింది నర్మదకి.

“ఇంకేంటి సంగతులు చెప్పు నర్మదా”


“ఏం చెప్పమంటావు శర్మిష్టా. నా కధ రివర్స్ లో ఉంది”

“అందం, చదువు, క్వాలిఫికేషన్ ఉన్న నువ్వు నీ మనసు కి నచ్చిన వాడినే పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యి నర్మదా” అంది శర్మిష్ఠ. “నీకు నా బాధ అర్ధం అవడం లేదు శర్మిష్టా.. నేను ఓన్లీ చైల్డ్ అవడం వల్ల చిన్న తనం నించీ అమ్మ నాన్న ఇద్దరూ ఎక్కువగా శ్రద్ధ పెట్టి పెంచేరు. అతి శ్రద్ధ తో నాపై ఆంక్షలు చాలా ఉండేవి.


వీధిలో, పార్క్ లో ఆడుతూ ఉంటే వాళ్ళ తో కలిసి హాయిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకోవాలని ఉండేది. కానీ ఏ కోరిక తీరలేదు. ఎప్పుడో ఒక సారి అమ్మ తో పార్క్ లో ఒక్కర్తినీ కొంత టైం గడిపి వచ్చేదాన్ని. ఈ అతి కేర్ తో నా చైల్డ్ హుడ్ అసలు ఎంజాయ్ చెయ్యలేదు. ఇంక కాలేజీ లో చేరేక అమ్మ మరీ చాదస్తం గా ఒకటే విషయం పదే పదే చెప్పేది.


‘అబ్బాయిల తో స్నేహం మంచిది కాదమ్మా, వాళ్లకి దూరం గా ఉండాలి.. ఆ స్నేహాలు ఎటు పోతాయో. మంచి చెడు తెలియని వయసు.. ’ అంటూ అదే మాట.

నిజంగా నాకు అబ్బాయిలంటే పిరికితనం వచ్చేసింది. కాలేజీ లో చదివినప్పుడు లిమిటెడ్ ఫ్రెండ్స్ తోనే గడిచి పోయింది. అదే పిరికి తనం నా జీవితం లో ఒక సమస్య లా తయారయ్యింది”


“అవునా నర్మదా.. ఏం జరిగింది?” అడిగింది శర్మిష్ఠ.

నాకు 22 ఏళ్ళు వచ్చిన దగ్గరనించీ పెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించేరు. ఈ రోజుల్లో అబ్బాయిలు అందం తో పాటు చలాకి తనానికి కూడా వోట్ వేస్తారు. అది నాలో చాలా తక్కువగా కనిపించింది.


ముగ్గురు నలుగురు అబ్బాయి తలి తండ్రులు ‘మీ అమ్మాయి చాలా తక్కువగా మాట్లాడుడుతుంది. అసలు మా అబ్బాయి అంటే ఇష్టం ఉందొ లేదో తెలియడం లేదు’ అన్నారట.


వెంటనే అమ్మ నాతో అనేది ‘అదేమిటే.. కాలేజీ లో లెక్చరర్ గా చేస్తున్నావు కదా! ధైర్యం గా మాట్లాడ వచ్చు కదా” అని.

అమ్మ నాన్నలకి నన్ను ఎలా పెంచారో తెలుసును. అయినా చివరికి బ్లేమ్ అంతా నామీదనే.

“నిజమే నర్మదా! లెక్చరర్ గా ఉన్నావు.. ధైర్యం చేసి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎలాపెరిగినా ఇక పైన జీవితం నీది.

“నాకెంతో ఇష్టమయిన ఫిజిక్స్ స్టూడెంట్ ముందర చెప్పడం, ఒక కొత్త వ్యక్తి ముందు ఇద్దరి ఫ్యూచర్ చర్చించుకోడం ఒకటే కాదు కదా షర్మిష్టా. ఇది అమ్మకి నాన్నకీ ఒక పెద్ద సమస్య. ధైర్యం గా చక్కగా మాట్లాడు అని అమ్మ చెప్తుంది కానీ ఎంత ప్రయత్నించినా ధైర్యం చెయ్యలేక పోతున్నాను. ఈ నాలుగేళ్లు నీతో స్నేహం చేసేక నా మనసు విప్పి నీతో చెప్పగలుగుతున్నాను” బాధగా చెప్పింది నర్మద.

“జీవితం లో పెళ్లి అనేది ఒక సమస్య అనుకోకు నర్మదా. అది అందరి జీవితం లోను జరిగే ఒక మరుపు రాని ఘట్టం. నీకు కొత్తవాళ్లతో పిరికితనం అయితే, నీకు నచ్చిన.. నువ్వు ఫ్రీగా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి తో స్నేహం చెయ్యలేవా” అడిగింది శర్మిష్ట

“కాలేజీ లో ఒక లెక్చరర్ తో అతని స్నేహ భావం వల్ల, అతను నామీద చూపించే అభిమానం వల్ల అతనంటే కొంచెం ఇష్టం ఏర్పడింది. ఇద్దరం ఒక సారి కాంటీన్ లో కాఫీ కూడా తాగేము. ఏదో ఫామిలీ వివరాలు మాట్లాడుకుంటున్న సందర్భం లో తనకి ఒక పెళ్ళైన అక్క వుందని ఇప్పుడు తన టర్న్ వచ్చింది గాని ఇంకా టైం ఉందనుకుంటున్నానని అన్నాడు. ఇంత కన్నా మా స్నేహం ముందుకి వెళ్ళలేదు. అయినా మా పేరెంట్స్ కి నా పెళ్లి మీద చాలా ఎక్కువ ఆశలు ఉన్నాయి. చాలా గొప్ప సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారు” చెప్పింది నర్మద.

“అది ఎలా కుదురుతుంది నర్మదా? నీకు కొత్త వాళ్ళతో మాట్లాడానికి ధైర్యం లేదు. నువ్వు హాయిగా నీకు నచ్చిన లెక్చరర్ ని చేసుకుని జీవితమంతా హాయిగా గడువు. ఇంతకీ నీ మనసు దోచిన ఆ లెక్చరర్ పేరు చెప్పలేదు?” అడిగింది శర్మిష్ట.

“అతని పేరు హరీష్, నర్మదా!”

“ఓ.. పేరు కూడా చాలా బాగుంది. గో ఎహెడ్”

“తాను కూడా చాలా బాగుంటాడు”

“నువ్వు ఆలస్యం చెయ్యకుండా అతని మనసు లో మాట తెలుసుకో నర్మదా. మనం మళ్ళా కలిసినప్పుడు మంచి మాట చెప్తావనుకుంటున్నాను “

“షర్మిష్టా.. నీ మాటలతో నాకు చాలానే ధైర్యం వచ్చింది. నా మనసుకు నచ్చిన వాడినే చేసుకుంటాను” అని నవ్వుతూ లేచింది నర్మద. తన వెనకాలే శర్మిష్ట నడిచింది.

***

ఆ రోజు శర్మిష్ట తల్లి వనజ, నర్మద తల్లి వినోద అదే పార్క్ లో కలుసుకున్నారు.

“వినోదా! మా శర్మిష్ట ప్రేమ సంగతి నీకు తెలుసు కదా. మా ఆయనకి చెప్పినా అయన అంత సీరియస్ గా తీసుకోలేదు. తనకి తెలిసిన సంబంధం గురించి శర్మిష్ట తో మళ్ళీ మాట్లాడుతానంటారు. ఆయనకు ఇష్టమైన సంబంధం ఎలాగైనా ఖాయం చేస్తానంటున్నారు. మా అమ్మాయి తన ఫ్రెండ్ అశోక్ నే చేసుకుని సెటిల్ అవుతాయని కచ్చితం గా చెప్పేసింది. అది ఎవరి మాట వినదు. మేమే ఎక్కువ స్వతంత్రం ఇచ్చామేమోననిపిస్తోంది” అంది వనజ.

“వనజా! మా అమ్మాయి సంగతి నీకు తెలుసు కదా.. పెళ్లి కొడుకు ముందు అస్సలు సరిగ్గా మాట్లాడదు. అందరితో పాటు చలాకీ గా ఉండాలంటున్నారు. అందరూ అలాగే ఫోన్ చేసి చెప్తున్నారు. పిరికి గా పెంచి తప్పు చేశామని బాధ పడుతున్నాము. మనం పెరిగినట్టే మన పిల్లల్ని కూడా పెంచుదామనుకోడం అవివేకం.

కాలం తో మారిపోతున్న ఈ రోజుల్లో ఆడ మగ చదువులు, ఉద్యోగాలు కలిసి చేస్తున్నారు. పెళ్లిళ్ల విషయం లో కూడా వాళ్ళకే ఎక్కువ స్వతంత్రం ఇస్తే జీవితంలో ప్రధాన ఘట్టమైన పెళ్లి విషయం లో కూడా బాగా అలోచించి వాళ్ళే సరైన నిర్ణయం తీసుకుంటారేమో. అలా అని తల్లి తండ్రుల ప్రమేయమే ఉండకూడదని కాదు. ఈ తరం లో పిల్లలని పూర్తిగా కంట్రోల్ చెయ్యకుండా వాళ్లకి స్వతంత్రం ఇస్తూ వాళ్ళు తప్పటడుగులు వెయ్యకుండా చూడడం వరకే మన ప్రమేయం అనుకోవాలి.

అసలు ఈ మాట విన్నావా వనజా?ఆ వీరమ్మ కూతురు చదువు, ఉద్యోగం లేని వాడిని పెళ్లి ససేమిరా చేసుకోనని చెప్పేసిందిట.

‘బిడ్డకి నచ్చక పోతే ఎలా.. మరో సంబంధం చేస్తానమ్మా’ అంది వీరమ్మ.

“అన్ని వర్గాల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూడు వినోదా.. ఏటి లో కొత్త నీరు వచ్చి పాత నీటిని తరిమేసినట్లు” అంది వనజ.


“బాగా చెప్పేవు వనజా, మనం మాటల్లో పడి చీకటై పోయిందని గ్రహించలేదు. పద వెళదాం” అని వినోద అనడంతో అపార్ట్మెంట్స్ వైపు నడిచేరు ఇద్దరూ.

***

సీత మండలీక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

Podcast Link

Twitter Link


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం : సీత మండలీక

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది.



45 views2 comments
bottom of page