'Kalanikunna Balam' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 13/06/2024
'కలానికున్న బలం' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
నాదగ్గరున్నది తెల్ల కాగితమే
నేను నేర్చుకున్న అక్షరాలు అందరికీ తెలిసినవే
పదాలేవీ నేను కొత్తగా సృష్టించలేదు
నిఘంటువులో ఉన్న పదాలే నేను వాడేది
ఇక నా కలములోని మసిసలిలము కొత్తది కాదు
కాకపోతే నా ఆలోచన అందరిలా ఉండదు
ఆ ఆలోచనా స్రవంతి పరవళ్ళు త్రొక్కేది
నేను నేర్చుకున్న అక్షరాల రూపం దాల్చుకునే
అందరికీ తెలిసిన అక్షరాలే అందరూ వినిన ధ్వనులే
కాని నా భావాలు పదాల సహకారంతో
పరుగిడుతుంటె నా మసి సలిత కలం
ఇంకా ప్రోత్సహించి భావాలకు రూపమిస్తుంది
నా మనోభావ పయనానికి ఊతమిస్తుంది
కలం నా చేతిలోదైనా నా భావాలకంటె
ముందే ఉరుకులు పరుగులు
ఈ కలాన్ని అదుపులో పెట్టకపోతె
అణు క్షిఫణులకంటె అధిక శక్తి సమకూర్చుకుంటుంది
తెల్ల కాగితం దానికి తోడుగ నిల్చి సహకరిస్తుంది
నా ఆలోచనలకు హద్దులు చేరిపేస్తుంది
ప్రతి అక్షరములో ప్రభంజన ప్రభావం చూపెడుతుంది
కాగితం-కలం తోడి దొంగలై నా మదికి పదును పెడుతయి
కలం కాగితాలేకమైతె వాటి బలం చాటమంటయి
ఒక్క అగ్గిపుల్లలో ప్రపంచాన్ని దహనం చేసే శక్తి
దాగి ఉన్నట్లే అగ్గికంటె అదిక శక్తి
నా కలంలో ఉన్నదని నన్ను ప్రరేపిస్తాయి.
చేతికంటితే కడుక్కునే మసిసలిలం
కాగితానికంటుకుంటె దాని ప్రభావము చెప్ప వశముగాదు
చివరకు నేను గ్రహించిందేమిటంటె
బాగా ఆలోచించి మనసులో నింపుకొని వ్రాయాలని
వ్రాస్తూ వ్రాస్తూ ఆలోచనలకూతమీయవద్దని
చదువరులకు తిట్టడానికి, తప్పులు పట్టడానికి
మనసులో అన్యదా ఊహించుకోవడానికి, దెప్పడానికి
పరిపరి విధాల ఆలోచనల దారికి
పోవడానికి అవకాశమీయవద్దని .
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
コメント