top of page
Original.png

కన్నతల్లి - కల్పవల్లి

Updated: Dec 6, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#KannathalliKalpavalli, #కన్నతల్లికల్పవల్లి


Kannathalli - Kalpavalli - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 20/11/2024

కన్నతల్లి - కల్పవల్లి -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


ఇంటిలోన కన్నతల్లి

చూదంగా కల్పవల్లి

లేరు ఎవరు ఆమె సాటి

కుటుంబ సేవలో మేటి


అమ్మ లేక జగతి లేదు

ఇంట కాంతి కానరాదు

సృష్టికామె ఆధారము

బలమైన ప్రాకారము


పంచుపెట్టు మమకారము

అందించును సహకారము

కుటుంబ అభివృద్ధికిల

చుట్టుతుంది శ్రీకారము


అమ్మ త్యాగము గొప్పది

పోల్చగ నింగి చిన్నది

ఈ సత్యం తెలుసుకొనుము

ప్రేమతోడ మసలుకొనుము



-గద్వాల సోమన్న




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page