కనువిప్పు
Kanuvippu - Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma
కనువిప్పు - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
Published in manatelugukathalu.com on 26/04/2026
విజయం మనిషిని ఎదగనిస్తుంది…కానీ అదే విజయం అహంకారంగా మారితే, పతనానికి దారితీస్తుంది.
ఒక తెలివైన అనలిస్ట్ తన టీమ్ మాటలను వినకపోవడం వల్ల ఎదుర్కొన్న కఠిన అనుభవం—నాయకత్వానికి అసలు అర్థం ఏమిటో తెలియజేసే కథే “కనువిప్పు”.
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలో ఆదిత్య అనే సీనియర్ అనలిస్ట్ పనిచేస్తున్నాడు. అతని గురించి ఒక మాట అందరికీ తెలుసు— కంపెనీ విషయాల్లో “ఆదిత్య చెప్పిందే ఫైనల్”; అతనే కర్త, కర్మ, క్రియ.
మూడేళ్లలోనే అతని విశ్లేషణలు కంపెనీకి భారీ లాభాలు తెచ్చాయి. మేనేజ్‌మెంట్ అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. క్రమంగా అతని మాటే సంస్థలో శాసనంలా మారిపోయింది.
కానీ అదే విజయాలు అతనిలో అహంకారాన్ని పెంచాయి. దాంతో, కంపెనీ విషయాల్లో ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా పోయాడు.
………………………….
ఇటీవల కంపెనీకి ఒక పెద్ద డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ మంజూరైంది.ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే కంపెనీకి భారీ లాభాలు దక్కనున్నాయి.అయితే ఈ ప్రక్రియలో చిన్న తప్పిదం జరిగినా, కంపెనీకి తీవ్రమైన నష్టం కలగవచ్చు.
టీమ్ మొత్తం విశ్లేషణలో నిమగ్నమైంది.
ఆ సమయంలో, AIలో దిట్ట అయిన జూనియర్ అనలిస్ట్ నేహా ఒక కీలక అంశాన్ని గమనించింది. ఆమె జాగ్రత్తగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది:
“సర్… ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బయటి డేటాపై ఆధారపడి ఉంది. గత వారం వాళ్ల సిస్టమ్ రెండుసార్లు డౌన్ అయింది. ఇలా కొనసాగితే మన డేటా ప్రవాహం ఆగిపోతుంది—మన నిర్ణయాలు ప్రభావితమవుతాయి,” అని ఆమె గట్టిగా హెచ్చరించింది.
ఆదిత్య వెంటనే స్పందించాడు: “అది వాళ్ల టెక్నికల్ సమస్య. మన ప్రాజెక్ట్‌కు సంబంధం లేదు. ఈ విషయంపై ఇక చర్చ అవసరం లేదు,” అన్నాడు.
నేహా మళ్లీ ధైర్యంగా చెప్పింది: “సర్, వాళ్ల డేటా ఆగిపోతే మన నిర్ణయాలు తప్పు దిశలో వెళ్లే అవకాశం ఉంది…”
ఆదిత్య చిరాకుగా చూసి అన్నాడు: “No problem. మన దగ్గర బ్యాకప్ ఉంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యలా చూపాల్సిన అవసరం లేదు. మనమే హ్యాండిల్ చేయగలం.అంటూ, “ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి,” అని కఠినంగా అన్నాడు. నేహా నిశ్శబ్దంగా తల వంచుకుంది.
…………………………
కొన్ని వారాల తర్వాత ప్రాజెక్ట్ అమలు ప్రారంభమైంది.మొదట ప్రతిదీ సాఫీగా సాగింది.
కానీ కొద్ది రోజులకే సమస్యలు కనిపించాయి. ఒక రోజు డాష్‌బోర్డ్‌లో డేటా అసాధారణంగా మారడం మొదలైంది.లాభాలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి… కానీ వాస్తవ ట్రాన్సాక్షన్లు ఆలస్యం అవుతున్నాయి.
సంబంధిత ఇంజనీర్ వెంటనే ఆందోళనగా అన్నాడు:
“సర్… బయట డేటా ఫీడ్ సరిగా రావడం లేదు. కొన్ని రికార్డులు మిస్ అవుతున్నాయి.”
ఆదిత్య వెంటనే అన్నాడు: “ఇది తాత్కాలిక సమస్య. సిస్టమ్ రిఫ్రెష్ చేయండి.”
నేహా స్క్రీన్‌ను గమనిస్తూ చెప్పింది: “సర్… ఇది చిన్న సమస్య కాదు. డేటా పూర్తిగా రావడం లేదు. ఇలా కొనసాగితే మన రిపోర్ట్స్ తప్పు డేటాపై ఆధారపడతాయి.”
అప్పుడే స్క్రీన్‌పై అలర్ట్ మెసేజ్ వచ్చింది. మార్కెట్ డేటా ఫీడ్ ఆగిపోయింది.
ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం నెలకొంది.
అసంపూర్ణ డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడులను తప్పుదోవ పట్టించాయి.
కంపెనీకి నష్టం వేగంగా పెరిగింది.
టీమ్ అంతా అయోమయంలో పడింది.
ఆదిత్య మాత్రం స్క్రీన్‌ను చూస్తూ నిశ్శబ్దంగా నిలిచిపోయాడు.ఆ క్షణంలో—నేహా మాటలు అతని మనసులో గింగిరుమన్నాయి.
“హతవిధీ…” అనుకుంటూ అతను తలవంచాడు.
“డేటాపై నమ్మకం పెట్టుకున్నాను… కానీ టీమ్ హెచ్చరికలను, ముఖ్యంగా నేహా మాటలను పట్టించుకోలేదు,” అని బాధతో అన్నాడు.
“ఇది సిస్టమ్ తప్పు కాదు… నా మూర్ఖత్వం,” అని అతను తనలో తాను అనుకున్నాడు.
ఆ క్షణంలో నేహా మాటలు అతనికి మళ్లీ గుర్తొచ్చాయి.
అప్పటికే కంపెనీకి భారీ నష్టం జరిగిపోయింది.తప్పు నిర్ణయాల ప్రభావం మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది.
………………………….
కొన్ని నెలల తర్వాత కంపెనీ విధానం మారింది. ఇకపై ప్రతి నిర్ణయానికి ముందు అన్ని స్థాయిల అభిప్రాయాలను వినే కొత్త వ్యవస్థను ఆదిత్య అమల్లోకి తీసుకువచ్చాడు. ఆ దిశలో సంస్థ కొత్త మార్గంలో ముందుకు సాగింది.
నేహా లీడ్ అనలిస్ట్‌గా ప్రమోట్ అయింది.
ఆదిత్యకు ఒక నిజం స్పష్టమైంది—
తన అనుభవం అతనికి ఒక శాశ్వత సత్యాన్ని నేర్పింది—
"మంచి నిర్ణయాలు ఒంటరిగా తీసుకోబడవు;
వినడంలో, అర్థం చేసుకోవడంలో, కలిసి ముందుకు సాగడంలోనే సాకారమవుతాయి."
“వినడమే నాయకత్వానికి మొదటి అడుగు.”
———————————
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ
***
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్కారం,
నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.
మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ
ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)
వార్తాపత్రిక కాలమిస్ట్
రాజీవ్ నగర్, హైదరాబాద్






Comments