top of page

కరికాల చోళుడు - పార్ట్ 14

Updated: Sep 3

#MKKumar, #ఎంకెకుమార్, #KarikalaCholudu, #కరికాలచోళుడు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Karikala Choludu - Part 14 - New Telugu Web Series Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 28/08/2025

కరికాల చోళుడు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక

రచన: ఎం. కె. కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోళ సామ్రాజ్యం అస్థిర పడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. గూఢచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు. పాండ్యులతో చేయి కలిపిన నెలయన్మార్ ను బంధిస్తాడు. కరికాలుడి వ్యూహం వలన యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు. కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలంచెట్చెన్ని మరణిస్తాడు. అధికారాన్ని కరికాలుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. 


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 చదవండి. ఉరయ్యూర్ రాజభవనంలో రాజమహిషి వందనాదేవి చీకటి గదిలో కూర్చొని ఆలోచిస్తోంది.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 14 చదవండి.


రాత్రి వేళ, అంతఃపురంలోని మౌనం, రాణి భయపడుతూ యువరాజును దాచుకోవడం. ఇవంతా కలిపి ఒక నిశ్శబ్ద నాటకాన్ని తలపిస్తున్నాయి.


బయట రాజభవనం ప్రశాంతంగా కనిపించొచ్చు, కానీ లోపల భయంతో, అపహాస్యంతో, మోసంతో రగులుతోంది.


ఈ యుద్ధంలో శత్రువుగా ఎవరు నిలిచారు? యువరాజు తిరిగి తన స్థానం ఎలా సంపాదించుకుంటాడు? 


తన కొడుకుని ఎంతకాలం దాచగలదు? ఈ మోసం వెనుక ఎవరు ఉన్నారు? ఇన్ని ప్రశ్నలను మహా రాణి ఎదురుకుంటోంది.


ఆమె పక్కన వున్న రహస్య గదిలో కరికాలుడు నిద్రపోతున్నాడు. మంత్రుల కుట్రను ఆమె హృదయం అంగీకరించలేకపోతోంది.


రాణి తనలోతానే "నా కుమారుడిని గద్దె నుండి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది తాత్కాలికమా? లేక శాశ్వతమా? ఈ కుట్ర వెనుక మరింత ప్రమాదం ఉందా?"


తన మనసులో మధనపడుతూనే, ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అకస్మాత్తుగా, గదిలో ఒక చీకటి రూపం కదులుతున్నట్లు అనిపించింది.


రాణి గట్టిగా "ఎవరున్నారు?"


చీకట్లోంచి ఒక సన్నటి శబ్దం వచ్చింది. వెంటనే రాణి తన చేతిలోని దీపాన్ని పైకి లేపి చూచింది. 


రాణి: "బయటికి రా! ఈ దొంగచాట్లెందుకు?"


చీకట్లోంచి ఒక వృద్ధుడు ముందుకు వచ్చాడు. అతను మంత్రులలో ఒకడైన ధర్మసేన.


ధర్మసేన: "దేవీ, నేను మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వచ్చాను."


రాణి అశాంతిగా "ఏమిటది?"


ధర్మసేన చుట్టూ చూసి, గంభీరంగా "ఈ సభలో కొందరు యువరాజును దాచిపెట్టాలనో, బంధించాలనో మాత్రమే అనుకోవడం లేదు... ఆయనను పూర్తిగా తొలగించాలనుకుంటున్నారు!"


రాణి తీవ్ర కంగారుగా "అంటే...?"


ధర్మసేన: "రాత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. యువరాజును దొంగిలించి, రాజభవనం నుండి బయటకు పంపించమని సైనికులకు ఆదేశాలు ఇచ్చారు. కాని... నిజం చెప్పాలంటే, వారు అర్ధరాత్రి యువరాజుని హత్య చేయాలని కూడా యోచిస్తున్నారు”


రాణి ఉలిక్కిపడి ఒక్కసారి మూగబోయింది.

ఆమెకు ఒక్క క్షణం తన గుండె ఆగిపోయినట్లు అనిపించింది.


రాణి: "నా కుమారుడిని హత్య చేయాలనుకుంటున్నారా? నువ్వు నిజం చెబుతున్నావా?"


ధర్మసేన: "అవును, దేవీ. ఈ కుట్ర వెనుక మీ నమ్మిన కొందరు మంత్రులే ఉన్నారు. నేను మీకు మద్దతుగా ఉన్నాను. వెంటనే యువరాజుని భద్రంగా పంపించాలి"


రాణి స్పష్టంగా, "నా కుమారుడు ఈ రాత్రే భద్రంగా రాజభవనం నుండి వెళ్లిపోవాలి! కానీ... ఎక్కడికి?"


ధర్మసేన: "రాజమాత, కరువూరులో మేము విశ్వసించగల వ్యక్తి ఉన్నాడు. అతని వద్ద యువరాజు ఉండగలడు. అక్కడ అతనికి అవసరమైన శిక్షణ, భద్రత ఉంటుంది."


రాణి ఒక క్షణం ఆలోచించింది. ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది.


రాణి నిశ్చయంగా "యువరాజు సురక్షితంగా ఉండాలి. ఈ రాత్రే అతన్ని కరువూరుకు పంపాలి”


ఆ రాత్రి, రహస్యంగా కరికాలుడిని భద్రంగా రాజభవనం నుండి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 


కానీ... ఈ కుట్ర వేరే ఎవరికైనా తెలిసి పోతుందా? యువరాజు సురక్షితంగా బయటపడతాడా? లేక... కొత్త ముప్పు ఎదురు పడతుందా.


రాత్రి గాఢంగా వ్యాపించింది. రాజభవనం చుట్టూ నిశ్శబ్దం. కానీ అంతఃపురం లోపల ఓ తుఫాను మెల్లగా రగులుతోంది. రాణి సలువానదేవి, ధర్మసేన, విశ్వాసపాత్రుడైన కొందరు సైనికులు యువరాజు రక్షణ కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.


రాణి: "ధర్మసేన, రాజభవనానికి గస్తీ కాస్తున్న సైనికులని ఏదైనా రీతిలో తప్పించగలవా?"


ధర్మసేన తలూపుతూ "దేవీ, అందుకు నా అనుచరుడు మణివన్నన్ సన్నద్ధంగా ఉన్నాడు. అతను ప్రధాన ద్వారంలో సమస్య కలిగించేలా చేస్తాడు. ఆ గందరగోళంలో మనం వెళ్ళగలిగితే చాలు"


ఆ క్షణం గదిలోకి ఓ యువకుడు ప్రవేశించాడు అతను మణివన్నన్.


మణివన్నన్ హడావిడిగా "ధర్మసేన! ప్రమాదం! మీ ప్రణాళిక తెలిసిపోయింది. మన ప్రయత్నాన్ని ఏవరో గమనించారు."


రాణి హఠాత్తుగా నిలబడింది. ఆమె కళ్లు భయంతో నిండిపోయాయి.


రాణి: "అంటే… కరికాలుడిని బయటికి తీసుకెళ్లడం ఇప్పుడు అసాధ్యమా?"


ధర్మసేన: "అది కాదు, రాణి గారు, సమయం తక్కువ. కానీ మన దగ్గర మరో మార్గం ఉంది. మణివన్నన్, వెనుక ద్వారం వద్ద గస్తీ ఏమిటి?"


మణివన్నన్: "అక్కడ కేవలం ముగ్గురు సైనికులున్నారు. అయితే, బయట ముళ్లకంచె ఉంది. కానీ అది పెద్ద సమస్య కాదు."


రాణి, తన కుమారుడిని చూసి ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. ఆ క్షణంలో ఆమె తన నిర్ణయాన్ని మరింత ధృఢతతో తీసుకుంది.


రాణి: "ధర్మసేన, కరికాలుడిని వెంటనే వెనుక ద్వారం నుండి తీసుకెళ్లండి. మణివన్నన్, నువ్వు ముందు వెళ్లి దారి సిద్ధం చేయాలి. నా కుమారుడు బ్రతకాలి!"


ధర్మసేన యువరాజు దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే యువరాజు అర్థం చేసుకున్నాడు. తనపై ముప్పు ఉందని. కాని అతను ధైర్యంగా ఉన్నాడు.


కరికాలుడు: "అమ్మా, నువ్వు అధైర్య పడకు. నేను వెళ్ళిపోతాను. కానీ ఒక రోజు తిరిగి వస్తాను. నీ కోసం, నీ ఆశయం కోసం"


రాణి కన్నీరు ఆపుకుంటూ, అతని తల ముద్దాడింది.

 

==============================================

ఇంకా వుంది..

==============================================

ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏





Comments


bottom of page