top of page

కథ సుఖాంతం


'Katha Sukhantham' New Telugu Story

కథ సుఖాంతం తెలుగు కథ

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

చెట్టు మీద నుంచి భేతాళుడిని దింపి భుజం మీద వేసుకుని నడవటం మొదలుపెట్టిన విక్రమార్కుడు, “యింకా ఆలస్యం ఎందుకు? మొదలెట్టు నీ చెత్త కథ, అలా మూగనోము పట్టుకుని కూర్చున్నావు” అన్నాడు భేతాళుడిని.


“ఏం చెప్పమంటావ్ రాజా, ఎప్పుడూ ఒకే దారిన మోసుకుని వెళ్తున్నావు, నాకు చాలా చిరాకుగా వుంది, ఈసారి వేరే దారినుంచి తీసుకుని వెళ్ళు” అన్నాడు భేతాళుడు.


“యింత బ్రతుకు బతికి చివరికి యింటి వెనకాల చచ్చినట్టు, పెద్ద మహారాజును అయ్యి కూడా నిన్ను మోసుకుంటో తిరగాలిసి వచ్చింది. అయినా నిన్ను అని ఏమి లాభం, ఆ సన్యాసి ని అనాలి” అన్నాడు విక్రమార్కుడు.


“పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదని, ఎప్పుడో ఒకప్పుడు మన యిద్దరికి ఈ బాధ వదులుతుందిలే” అని కథ మొదలుపెట్టాడు.

ఒక వూరిలో రామారావు అనే మాస్టర్ గారికి కృష్ణ, రేలంగి, శివరాం అనే ముగ్గురు కొడుకులు వున్నారు. తండ్రి పెంపకం లో ముగ్గురు బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు.


నిజంగానే ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకరంటే ఒకరు ప్రేమతో జీవిస్తున్నారు. ఎప్పుడైనా పొట్లాడుకుందామని అనుకున్న, ఆ పని చెయ్యలేక పోతున్నారు.

అయితే అందరికంటే చిన్నవాడైన శివరాం ఒక కథ రాసి, ఒక ప్రముఖ పత్రిక కి పంపించడం, వాళ్ళకి ఆ కథ నచ్చి పత్రిక లో వేసుకుని, ఆ శివరాం కి పారితోషకం పంపించారు.


తన కథ పడిన విషయం, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో యింట్లోకి కావలిసిన రెండు బల్బ్స్ కొనుకున్నాను అని చెప్పాడు. ఆ మాటతో రేలంగి తన తమ్ముడు నుంచి ఆ పత్రిక విలాసం తెలుసుకుని, తను కూడా మంచి హాస్య కథ పంపించాడు.

అయితే రేలంగి పంపిన కథ ని పత్రికల పోటీకి సెలెక్ట్ చేసుకుని పదివేల రూపాయలు బహుమతి గా యిచ్చారు.


ఈ విషయం పత్రిక చదివి తెలుసుకున్న శివరాం, అన్నగారికి ఫోన్ చేసి “ప్రతిదానికి నాకు పోటీకి వస్తావు, నేను పంపిన పత్రిక కే ఎందుకు పంపించావు” అని అనటం తో యిన్నాళ్ళు లేని పొట్లాట మొదలైంది.


ఈ విషయం తెలిసిన పెద్దన్నగారు యిద్దరికి సర్ది చెప్పి, “యింతకీ ఆ పత్రిక అడ్రస్ ఏమిటి?” అని ఆడిగాడు.


‘బాబోయ్ యిప్పుడు వీడు కూడా పోటీకి వస్తాడేమో’ అనుకుని, “నీకెందుకు లే అన్నయ్య, గవర్నమెంట్ నీకు యిచ్చే పెన్షన్ ముందు మాకు పత్రిక వాళ్ళు యిచ్చేది చాలా తక్కువ, అయినా అందరు మన యింటి పేరు వాళ్లే అయితే బాగుండదు” అని సర్ది చెప్పాడు శివరాం.


అయితే శివరాం లాగానే పట్టువిడవని కృష్ణ, పాత పత్రికలు అన్ని తిరిగేసి ఒక కాపి కథని తయారుచేసి శివరాం పంపిన పత్రికకి పంపించాడు.

“వింటున్నావా రాజా” అని అడిగాడు భేతాళుడు.


“కథ అయిపోయిందా, యిదే నీ ప్రశ్ననా” అని ఆడిగాడు భేతాళుడుని.

“అబ్బే యింకా కాలేదు, నువ్వు వింటున్నావా లేదా అని అనుమానం వచ్చింది. చచ్చి చెడి కథ అంతా చెప్పిన తరువాత, నువ్వు వినలేదంటే నాకు నీరసం వస్తుంది” అన్నాడు.


“వింటున్నాను, కాని చాలా కొత్త పదాలు, నేను ఎప్పుడు వినినవి వాడుతున్నావు, పోనీ నువ్వే ఆ శివరాం ని పట్టుకుని పత్రిక అడ్రస్ సంపాదించి కథ రాయచ్చుగా, నాకు చెప్పితే ఏమోస్తుంది కంఠసోష తప్పా” అన్నాడు.


“అలవాటైపోయింది నీకు చెప్పడం, విను. ఆ కాపీ కథ ని కృష్ణ పంపగానే, అది చదివిన శివరాం ఆ పత్రిక కి ఆకాశరామన్న ఉత్తరం రాసాడు.

దానితో ముగ్గురు సోదరులు మధ్య యుద్ధం ముదిరిపోయింది. ఆ ఇంటిమీద కాకి ఈ యింటి మీద వాలడం లేదు.


‘అయ్యో.. రామలక్షమణులు లాగా వుండే అన్నదమ్ములు యిలా అయిపోయారేమిటి, మళ్ళీ వీళ్ళు కలిసిపోతే ఎంత బాగుండును’ అని వాళ్ళ భార్యలు అనుకున్నారు.


“రాజా! ఆ సోదరులు ముగ్గురు మళ్ళీ కలిసిపోయారా? ఎలా కలిసారు? చెప్పు. జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల, చెప్పితే నా తల పగిలిపోతాయి, నాకు వృద్ధాప్యం వచ్చింది. యిహ కృష్ణా రామా అనుకోవాలిసిన సమయం వచ్చింది అన్నాడు భేతాళుడు.


“ఏముంది, వీళ్ళ కథలు బాగున్నా, ఒకరి మీద ఒకరికి పడక, పేరు సంపాదించాలని ఆకాశరామన్న ఉత్తరాలు రాసుకుంటున్నారని, తెలివైన ఆ పత్రిక యజమాని, వీళ్ళ ముగ్గురు కథలు వచ్చినవి వచ్చినట్టు సెలెక్ట్ చేసేవాడు. దానితో ఆ సోదరులు ‘నీ కథ పడిందిరా’ అని అభినందనలు తెలియచేసుకోవడం మొదలుపెట్టారు. పనిలో పని గా ఆ పత్రిక యాజమాన్యం రచయితలకు సన్మానం చేయాలి అనుకుని కొంతమంది రచయితలకు, ఈ ముగ్గురు సోదరులకు కూడా సన్మానం చేసి జ్ఞాపికలు యిచ్చారు. అవి తీసుకుని ముగ్గురు సోదరులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పక్కనే వున్న ఉడిపి హోటల్ లో టిఫిన్ తిని యింటికి చేరుకున్నారు” అన్నాడు విక్రమార్కుడు.


అంతే.. విక్రమార్కుడి భుజం మీద నున్న శవం నుంచి పెద్ద శబ్దం వచ్చింది.

పాపం భేతాళుడి తల పగిలి చనిపోయాడు అనుకుని, ఆ శవం కి దహన కార్యాక్రమాలు చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.


సుఖాంతం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.












55 views0 comments

Comments


bottom of page