top of page

కొంగు బంగారం నాన్న

Updated: Jan 14

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #కొంగుబంగారంనాన్న, #KonguBangaramNanna


Kongu Bangaram Nanna - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 24/12/2024

కొంగు బంగారం నాన్నతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


నాన్న అన్న పిలుపులో

వెన్న ముద్దలున్నవి

వారి గొప్ప మనసులో

వెన్నెల వెలుగులున్నవి


త్యాగమయమే హృదయము

తూర్పు దిక్కున  ఉదయము

తండ్రి మనసు  పరికింప

అందాలొలుకు కుసుమము


కుటుంబాన నాన్న గారు

వెలుగులీనే దీపము

ప్రాకారము వంటి వారు

ప్రేమకు ప్రతిరూపము


నాన్న లేక కుటుంబము

శిథిలావస్థ భవనము

చూడ కకావికలము

కాదోయి సురక్షితము


క్రొవ్వొత్తిలా త్యాగము

నాన్న ఉంటే భాగ్యము

ఇల్లు అగును స్వర్గమే!!

బలిష్టమైన దుర్గమే!!



-గద్వాల సోమన్న



Comments


bottom of page