top of page

కొత్తగా.. కొత్త కొత్తగా

Updated: Jan 25

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #కొత్తగాకొత్తకొత్తగా, #KotthagaKotthaKotthaga, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems,


Kotthaga Kottha Kotthaga - New Telugu Poem Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 16/01/2025

కొత్తగా.. కొత్త కొత్తగా - తెలుగు కవిత

రచన: భళ్లమూడి నాగరాజు


కుసుమంబద్దిన 

చీర ధరించిన 

తెలుగు తల్లిలా 


తెల్లవారు ఝామున 

మంచు తెరలా 

తొలకరి జల్లులకు 

మొలకెత్తిన 

పచ్చని  పైరులా 


కొత్త చెరకు

గానుగు బెల్లం లా 

కొత్త బియ్యం

పాయసం లా 


గంగి గోవు పాలు 

పొంగు లా 

అప్పుడే వికసించిన 

తొలి పువ్వులా 


గల గల పారే 

ఏటి నురగ లా 

తొలకరి జల్లు 

మట్టి వాసన లా 


తళ  తళ 

లాడుతూ

కొత్త హొయలు తో 

నా చేతికి వచ్చింది 

నూతన దైనందిని. 


..భళ్లమూడి నాగరాజు

రాయగడ.






2件のコメント


కొత్త కొత్త కొత్తగా .. బి నాగరాజు

.. నిజంగా కొత్త గా ఉన్నది.

పి. వి. పద్మావతి మధు నివ్రితి

いいね!
返信先

ధన్యవాదములు 🙏

いいね!
bottom of page