top of page
Original.png

మా ఇంటికి రండి 

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #మాఇంటికిరండి, #MaIntikiRandi

ree

'Ma Intiki Randi' - New Telugu Story Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 01/10/2024

'మా ఇంటికి రండి' తెలుగు కథ

రచన: భళ్లమూడి నాగరాజు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పోస్ట్.. అన్న మాట వినగానే రామయ్య గారి చెవిలో వీణలు మ్రోగినట్లు.. ఏదో శుభ వార్త విన్నట్లు ఆనందం తో.. గబగబా వీధిలోకి వెళ్ళేరు.. సంతోషంతో పోస్ట్ కార్డు పట్టుకొని గదిలోకి వస్తున్న.. అతన్ని, చూసి సీతమ్మగారు 

“ఎవరండీ.. ఈ రోజుల్లో కూడా ఉత్తరం రాశారు?” అంది.

 

పోస్ట్ కార్డు సీతమ్మ గారి ముందు పడేసి, మంచం ఎక్కి నడం వాల్చేరు. 


ఆత్రంగా కార్డు తీసి, బోసి నోరు పెద్దగా తెరచి “ఏమిటండీ.. ఇది! ‘మా ఇంటికి రండి’ అని మాత్రమే రాసి ఉంది, తీరా చూస్తే మీ దస్తూరే కనిపిస్తోంది”, అని భర్త వైపు తిరిగి అమాయకంగా ప్రశ్నించారు ఆవిడ. 


చిద్విలాసంతో “నేనే రాసేనోయ్.. దస్తూరి కనిపెట్టేసేవే “ అని అన్నారు నాటక పక్కీ లో.. 


“ఎందుకిలా.. రాసేరు.. ఎవర్ని ‘మా ఇంటికి రండి’ అని పిలిచినట్లు, ఎవర్ని పిలిచేరో వారి అడ్రస్ రాస్తే కదా వాళ్ళింటికి వెళుతుంది.. మన ఇంటి అడ్రస్ రాసేరు.. ఏమిటో అంతా తికమక గా ఉంది, నాకేమి అర్ధం కాలేదు..”

 

“పిచ్చిదాన, మరో వారం రోజుల్లో ఏ పండగ ఉంది”. 


“దసరా ”


“పని వాళ్ళు ఏమడుగుతారు?”.

 

“దసరా మామూళ్లు”

 

“గతంలో మనకు ఎవరో ఒకరు ఉత్తరాలు, శుభలేఖలు పంపేవారు.. క్రమేపి అవి తగ్గిపోయాయి. ఆ తరువాత రోజుల్లో కనీసం ల్యాండ్ లైన్ టెలీఫోన్ బిల్లు అయినా పోస్ట్ లో వచ్చేది.. పోస్ట్ మాన్ తెచ్చి ఇచ్చేవాడు. దసరా ముందు సార్.. అని చేతులు నులుపు కుంటూ నిలబడితే పదో, పాతికో ఇస్తే సరదాగా వెళ్లిపోయేవాడు. ఇప్పుడా ఉత్తరాలు లేవు. పాపం వారికి ఎవరిస్తారే దసరా మామూళ్ళు. మనల్ని నమ్ముకున్న వారికి ఏడాదికి ఒకసారి అయినా మామ్మూలు ఇస్తే మన ఆస్తులుమైనా తరిగి పోతాయా. అందుకే.. ఇలా..” అంటూ మురిసిపోయారు.. 


సీతమ్మ గారు లోలోనే సంతోష పడుతూ, భర్తని మనసులోనే అభినందించారు.

💐💐💐


భళ్లమూడి నాగరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page