top of page
Original.png

మద్యం మత్తులో సత్తయ్య

మద్యం మత్తులో సత్తయ్య, తెలుగు కథ, మద్య వ్యసనం, తాగుడు దుష్పరిణామాలు, కుటుంబ కథ, సామాజిక కథ, గ్రామీణ జీవితం, తెలుగు సాహిత్యం, తెలుగు కథలు, మన తెలుగు కథలు, alcohol addiction story Telugu, moral story Telugu, family values, village story

మద్యం మనిషి వివేకాన్ని ఎలా హరిస్తుందో, ఒక కుటుంబాన్ని ఎలా అవమానాల పాలుచేస్తుందో ఈ కథ హృదయాన్ని కదిలించే విధంగా చూపిస్తుంది.
మద్యం మనిషి వివేకాన్ని ఎలా హరిస్తుందో, ఒక కుటుంబాన్ని ఎలా అవమానాల పాలుచేస్తుందో ఈ కథ హృదయాన్ని కదిలించే విధంగా చూపిస్తుంది.

Madyam Mathulo Satthaiah - Telugu Comedy Story | Anisa Tabassum Sk

మద్యం మత్తులో సత్తయ్య - తెలుగు హాస్య కథ | అనిసా తబస్సుమ్ SK

Published in manatelugukathalu.com on 02/07/2026


మద్యం మనిషి వివేకాన్ని ఎలా హరిస్తుందో, ఒక కుటుంబాన్ని ఎలా అవమానాల పాలుచేస్తుందో ఈ కథ హృదయాన్ని కదిలించే విధంగా చూపిస్తుంది. మద్యం కోసం అబద్ధాలు చెప్పడం, ఇంటి వస్తువులు అమ్మేయడం, తన కుటుంబాన్ని నవ్వులపాలు చేయడం వంటి సంఘటనల ద్వారా వ్యసనం ఎంత ప్రమాదకరమో రచయిత్రి హృద్యంగా వివరించారు. ప్రతి కుటుంబం చదవాల్సిన, ప్రతి యువకుడు ఆలోచించాల్సిన సామాజిక సందేశాత్మక కథ ఇది.


గోధూళివేళ టీకొట్టు ముందు బెంచి మీద కూర్చొని.. ఊర్లో పోస్కోలు కబుర్లు చెప్పుకుంటూ, సిప్పు మీద సిప్పు లాగుతున్న కోటయ్య మీద ఒక శాల్తీ అమాంతం అతని మీద పడడంతో ఆ టీ కాస్త అతని మీదే ఒలికి పోయింది. 


"ఓరిని దినం చెయ్య... దున్నపోతులా ఏమిట్రా ఆ పడటం, ఏం కొంపలు మునిగాయి" అని అంటూ చిర్రు బుర్రులాడుతూ సత్తయ్య కేసి చూస్తూ అన్నాడు.


సత్తయ్య ఏడుపు మొఖంతో, "బాబాయ్... బాబాయ్.... అమ్మకి ఆరోగ్యం బాలేదు బాబాయ్, కళ్ళు తిరిగి పడింది. ఓ వంద ఇవ్వు, నల్ల డాక్టర్ (RMP) ని పిలుచుకొస్తా" అని రాని ఏడుపును ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ చెప్పుకొచ్చాడు సత్తయ్య. 


అంతా విన్న కోటయ్య ఏమి మాట్లాడకుండా, జేబులోంచి వంద తీసి ఇస్తూ 'ఇంద వంద, బేగి పో పో' అన్నాడు సత్తయ్య భుజం తడుముతూ.


సత్తయ్య పరుగు లంఘించుకొని వెళ్ళాక... మరో టీ పుచ్చుకొని ఆపిన కబుర్లు మళ్ళీ చెప్పుకుంటుంటే, ఈసారి కోటయ్యకు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. పొలం పనులకని వెళ్లిన సత్తయ్య తల్లి, ఒక భుజం పై తువ్వాలుతో... ఒక చేతిలో కొడవలి, క్యారేజీతో దర్శనమిచ్చింది.


"జానకమ్మోయ్....... ఆగాగు..." అంటూ టీ గ్లాసు బల్ల మీద పెట్టి ఉత్సుకతతో ఆమె దగ్గరకు వెళ్ళాడు. 


"మీవోడు నువ్వు కళ్ళు తిరిగి పడ్డావని చెప్పి వంద పట్టుకెళ్ళాడు జానకమ్మ" అన్నాడు. 


"ఆ తాగుబోతోడిని నమ్మి నువ్వెలా ఇచ్చావ్....!" అంటూ చివాట్లు పెట్టి తన తాగుబోతు కొడుకైన సత్తయ్యను తిట్టుకుంటూ ఇంటి దారి పట్టింది.


ఒక రోజు జానకమ్మ, అల్లుడు ఇంటికి వచ్చాడని కోడి తెప్పించింది. అసలే తాగడానికి డబ్బులు లేక ప్రాణం మందు కోసం తహతహలాడుతున్న వేళ అటు ఇటు తిరుగుతూ మెలికెలు తిరుగుతున్న సత్తయ్యకి, "దా.... వచ్చి నన్ను అమ్ముకొని తాగు" అన్నట్లు నిగనిగలాడుతున్న కోడి కనిపించింది. 


అదే తడవుగా కోడిని ఒక సట్టిలో (కూర వండుకునే పాత్ర) కుక్కి ఎత్తుకొని వెళ్లి ఊర్లో ఎవరికో ఇరవై (20) రూపాయలకు సట్టితో సహా అమ్మేశాడు. 


వచ్చిన ఆ డబ్బుతో తాగి అక్కడే పడిపోయాడు. విషయం తెలిసిన జానకమ్మ లబోదిబోమంది.

సత్తయ్య అలాంటి ఇలాంటి మామూలు తాగుబోతు కాదు, పచ్చి తాగుబోతు..... పిచ్చిపిచ్చిగా తాగే తాగుబోతు. మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో సత్తయ్య ఒంట్లో రక్తం కన్నా మద్యం అలా ప్రవహిస్తుంది, అప్పుడే ఎంతోకొంత మనిషిలా ప్రవర్తిస్తాడు.


తాగడం, తల్లిదండ్రులతో చివాట్లు తినడం, తాగి చేసే పనులకు అందరి ముందు తాను, తనతోపాటు భార్యను, తల్లిదండ్రులను నవ్వులపాలు చేయడం... ఈ తంతు అందరికీ అలవాటు అయిపోయింది.


సత్తయ్య ఇంటి పక్కనే సూరయ్య కుటుంబం ఉంటుంది. సూరయ్యకి మొక్కల పెంపకం అంటే మహా ఇష్టం, మొక్కలను కూడా కన్నా బిడ్డల్లా చూసుకుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం పట్నం నుంచి చిన్న కాగితపువ్వుల మొక్కను తీసుకొచ్చి దానికి మంచి పోషణ చేసి పెద్ద చెట్టు చేశాడు. బయట వసారాకు, ఇంటి ఎంట్రెన్స్‌కు ఆ చెట్టు ఒక ప్రత్యేక అందాన్నిచ్చేది.


రాత్రి అందరూ భోజనాలు చేసి, మగవాళ్ళంతా ఇంటి బయట అరుగుల మీద చేరి బీడీ, చుట్ట వెలిగించుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే ఫుల్లుగా తాగి డాబా మీద పడుకున్న సత్తయ్య అక్కడ్నుంచి గొంతు చించుకుంటూ వీళ్ళతో మాటలు కలుపుతున్నాడు.


ఇంతలో "ధాబాక్....." అంటూ పెద్ద శబ్దం వచ్చింది. ఆ వచ్చిన శబ్దం వైపు తలతిప్పి చూసిన సూరయ్య గుండె కలుక్కుమంది. డాబాకి అంచులు లేకపోవడంతో అసలే తాగిన మత్తులో ఉన్న సత్తయ్య ఎలా పడ్డాడో కానీ దొర్లుకుంటూ వచ్చి సూరయ్య పెంచుకున్న కాగితంపూల చెట్టు మీద పడ్డాడు. 


ఆ పడడంతోనే చెట్టు కొమ్మలు విరిగి, ఆ చెట్టు కింద ఉన్న చిన్న గాబుపై పడ్డాడు. దాంతో గాబు కాస్త రెండు ముక్కలైంది.


కాసేపు అందరూ చూసిన సన్నివేశాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సెకెన్లు పట్టింది. ఇంతలో శబ్దం విని బయటకు వచ్చి చూసిన సూరయ్య కూతురు... వచ్చిన కోపానికి "అరేయ్.... సచ్చినోడా!! బంగారంలాంటి గాబుని పగలగొట్టావు కదరా!! తాగుబోతు సచ్చినోడా".... అంటూ తిట్లు అందుకుంది. 


అందరూ కలిసి తలో మాట అనేసరికి మెల్లగా లేచి.... ఊడిపోతున్న లుంగీని సరిగ్గా కట్టుకుంటూ, తల దించుకొని మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఊర్లో సత్తయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి సత్తయ్య చేసిన ఇంకో ఘనకార్యం గురించి చెప్తాను.


కథ సమాప్తం

-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Shaik Anu
Shaik Anu
2 days ago
Rated 5 out of 5 stars.

Like
bottom of page