top of page

మనసే కీలకము

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ManaseKilakamu, #మనసేకీలకము


'Manase Kilakamu' - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 18/10/2024

'మనసే కీలకముతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మనసెంతో ప్రధానము

అత్యంత వేగవంతము

భ్రమరము వోలె తిరుగును

అదుపు చేస్తే విజయము


మనసుతో నిరంతరము

చేయాలోయి! సమరము

లేకపోతే జీవితము

అగును అతలాకుతలము


మనసుపై నియంత్రణ

జీవితాలకు రక్షణ

బాల్యంలో బాలలకు

నేర్పాలోయ్! క్రమశిక్షణ


మనసులనే జయిస్తే

వారు కదా విజేతలు

విశ్లేషణ చేయంగా

లోకాన బలాఢ్యులు


-గద్వాల సోమన్న



Comments


bottom of page