top of page

మంచి  పుస్తకమే  మంచి స్నేహితుడు

పుస్తక  దినోత్సవం (23/04/2024) సందర్భంగా


'Manchi Pusthakame Manchi Snehithudu' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 23/04/2024

'మంచి  పుస్తకమే  మంచి స్నేహితుడు' తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


మంచి  పుస్తకమే  మంచి స్నేహితుడు. 

జీవితమే  ఒక  పాఠశాల.  

అనుభవాలే  పుస్తకాలు.

నేను  నిత్య  విద్యార్థిని.

నిరంతర   అన్వేషిణి.

చదువుకోవాలి -  చదువు  కొనగూడదు.

అంతులేని  విజ్ఞానం  - అమూల్యమైన  సంపద.

పుస్తకమే  ఒక  పెన్నిధి - అదియే  నా నిధి.

తీరదు  నా దాహం -  చదువుతుంటే   ఆనందం.

లభిస్తుంది శాంతి -  కలుగుతుంది  సంత్రృప్తి.

అవ్వాలి  మంచి రచయితగ -కావాలి  వాగ్దేవి  అనుగ్రహం.

ఇవ్వాలి  మీ అందరి  దీవెన  - అదియే  నా కమితానందం. 

ఎన్ని   పుస్తకాలు  చదివినా  ఇంకా  ఇంకా  చదవాలనిపిస్తోంది.  

సమస్త  విజ్ణానానికి   జీవితమంతా  సరిపోదు.

....... నీరజ హరి ప్రభల.

44 views0 comments
bottom of page