top of page
Original.png

మంచు తాకిన ప్రేమ - ముందుమాట

Updated: Dec 16, 2024


#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ree

త్వరలో ప్రారంభం కాబోతున్న ధారావాహిక పరిచయం


Manchu Thakina Prema - New Telugu Web Series Introduction - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi

మంచు తాకిన ప్రేమ - తెలుగు ధారావాహిక - ముందుమాట

రచన : చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  


అనుభవాలు పేర్చిన అక్షరాలు 

అనుభూతులు పంచుకున్న భావాలు

సరిగ్గా ఏడాది క్రితం మనసులో ఆలోచనల తుఫాను అలజడిని రేపింది. 

ఆ అలజడికి మనసు సహజత్వాన్ని కోల్పోయి స్పందన లేని రాయిలా మారిపోయింది. 

ఆ క్షణం ఎక్కడినుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ అక్షరం అనే చినుకు ఆ రాయిని తాకింది. 

కఠినత్వాన్ని కరిగించి, సహజత్వాన్ని మేల్కొల్పి, మరల మనసు స్పందించేలా చేసింది

సాహిత్యపు తోటలో స్వేచ్ఛగా సీతాకోకచిలుక వలె తిరుగుతూ, అక్షర కుసుమాలను తాకుతూ, పదాల కొమ్మలతో ఆడుతూ, సాహిత్యపు నీడలో సేదతీరుతూ అలసిన మనసు విశ్రాంతిని తీసుకుంది సాహిత్యపు సుగందాన్ని మనసు నిండా నింపుకున్న అనుభవంతో..

నా కలం మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ నా మనసు పలికిన అక్షరాలను రాయడం మొదలు పెట్టింది.

నాడు బుడిబుడి అడుగులు వేసిన నా కలం నేడు ఒక మాదిరి స్థాయిలో రాయగలగడానికి కారణం నా అనుభవాలే. 

ఆ అనుభవాలకు తార్కాణం ఈ మంచు తాకిన ప్రేమ అనే నవల. 

రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య చిగురించిన ప్రేమ ఏ మలుపు తిరుగుతుందో, 

ఒకరు చేసిన త్యాగం మరొకరి జీవితంలో వారు కోరుకున్న లక్ష్యం వైపుగా వెళ్లడానికి ఏ విధంగా సహాయపడుతుంది. 

వీరి ప్రేమ సఫలం అవుతుందా విఫలమైన ఒక తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందా అన్న ప్రశ్నలకు సమాధానమే మంచు తాకిన ప్రేమ... 


ree

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page