మనోబలం
- Palla Deepika

- Jan 26
- 2 min read
#Manobalam, #మనోబలం, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Manobalam - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 26/01/2025
మనోబలం - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాయవరం అనే ఊరిలో దియా వాళ్ళ కుటుంబం ఉంది. దియాకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. దియాకి చిన్నప్పటినుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండేది. అది గమనించిన వాళ్ళ నాన్న ఒక డ్రాయింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు.
దియా ప్రతిరోజు డ్రాయింగ్ కి వాళ్ళ నాన్నతో వెళ్తూ వస్తూ ఉండేది. అప్పుడప్పుడు దియాని డ్రాయింగ్ స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వాళ్ళ తమ్ముడు ఆర్య కూడా వాళ్ళ నాన్నతో పాటు వెళ్లేవాడు. అక్కడ డ్రాయింగ్ తో పాటు కరాటే కూడా నేర్పిస్తున్నారు అని తెలిసిన ఆర్య నేను కరాటే కి వెళ్తాను అని వాళ్ళ నాన్నతో చెప్పి అందులో జాయిన్ అయ్యాడు. అలా దియా డ్రాయింగ్ కి, ఆర్య కరాటేకి వెళ్తూ వస్తూ ఉండేవారు.
ఒక నెల తరువాత ఎందుకనో దియా వాళ్ల నాన్న డ్రాయింగ్ వద్దు అని దియాని కరాటేలో జాయిన్ చేశాడు. కరాటేలో జాయిన్ అయ్యాక అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కి కాళ్ళు నొస్తున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి.
‘నేను వెళ్ళను’ అని ప్రతిరోజూ ఇంటికి వచ్చాక చెప్పేది. దానికి వాళ్ళ నాన్న ‘పర్వాలేదు. మెల్లగా అన్నీ నేర్చుకుంటావు, అమ్మాయిలు అంటే స్ట్రాంగ్ గానే ఉండాలి’ అని చెప్పేవాడు.
చేసేది ఏమీ లేక దియా ఇష్టం లేకుండానే కరాటేకి వెళ్ళేది. అక్కడ ప్రతి ఆదివారం ఫైట్స్ పెట్టేవారు. అప్పుడు దియాకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే ఫైట్స్ లో సరిగా డిఫెండ్ చేసుకోకుండా దెబ్బలు తగిలించుకుంటే అలా అయినా వాళ్ళ నాన్న కరాటే మాన్పిస్తాడు అనుకొని దెబ్బలు తగిలించుకునేది. అయినా లాభం లేకుండాపోయింది. వాళ్ళ నాన్న కరాటే మాన్పించలేదు.
అది అలా ఉండగా, ఒక రోజు దియా వాళ్ళ అమ్మ షాప్ కి వెళ్లి కోడిగుడ్లు తీసుకునిరా అని దియాని షాప్ కి పంపించింది. దియా గుడ్లు తీసుకొని షాప్ నుండి తిరిగి వస్తూ ఉండగా ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపించడం చూసింది. ఆ అమ్మాయి అరుస్తూ ఉన్నా వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ చెయ్యి పట్టుకోవడం చూసి దియా అక్కడికి వెళ్లి వాళ్ళని తిట్టింది. అయినా వాళ్ళు వెళ్ళక పోయేసరికి కోపం వచ్చి వాళ్ళని కొట్టడం మొదలు పెట్టింది.
వాళ్ళని బాగా కొట్టి ఇక అమ్మాయిలని ఏడిపించకుండా బుద్ధి చెప్పింది. అక్కడినుంచి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉంది. అక్కడ ఉన్న అమ్మాయి ఎందుకని వారిని ఎదిరించలేక పోయింది, కొట్టలేకపోయింది, కానీ తాను మాత్రం వాళ్ళని ఎలా కొట్టింది అని. అప్పుడు తనకి అర్థమైంది ఏంటంటే కరాటే నేర్చుకోవడం దీనికి కారణం. ఆత్మరక్షణ అమ్మాయిలకి చాలా ముఖ్యము అని.
ఆ తర్వాత రోజు ఆదివారం. ఈసారి ఫైట్స్ లో దెబ్బలు తినడం మానేసి డిఫెండ్ చేసుకొని, అటాక్ చేయడం నేర్చుకుంది. ఆ రోజు నుంచి కరాటేకి ఇష్టంగా వెళ్లడం మొదలుపెట్టింది.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.




Comments