top of page

మాటల యుద్ధము

Updated: Nov 1, 2024

#GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మాటలయుద్ధము, #MatalaYuddham, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


'Matala Yuddham' - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 14/10/2024

'మాటల యుద్ధము' తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మాటలతో యుద్ధము

తెచ్చిపెట్టు ప్రమాదము

వద్దు వద్దు నేస్తము

ఆగు ఆగు కొంచెము


రేపుతుంది కలహము

గుండెలో కలవరము

మానుకుంటే మేలు

మాటలతో యుద్ధము


చెడుగొట్టును స్నేహము

ఆయాసం అనిశము

యుద్ధాలే తెచ్చెను

రాజ్యాలే కూలెను


మాటలతో యుద్ధము

కాదు కాదు క్షేమము

పెంచుతుంది దూరము

మనశ్శాంతి మాయము


-గద్వాల సోమన్న



1 則留言


gopala krishna
gopala krishna
2024年10月14日

బాగుంది మాటల యుద్ధం

按讚
bottom of page