top of page

మాతృభూమి గొప్పది

Updated: Dec 26, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మాతృభూమిగొప్పది, #MathrubhumiGoppadi

ree

Mathrubhumi Goppadi - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 13/12/2024

మాతృభూమి గొప్పదితెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మాతృభూమి గొప్పతనము

మనసారగ కొనియాడుము

కన్నతల్లి కన్న మిన్న

ఉన్నతంగా భావించుము


ఏదేశము వెళ్లినా

ఎక్కడైనా తిరిగినా

ఎన్నడూ మరువరాదు

మాతృభూమి వీడరాదు


అమ్మ గర్భాన  ఉండేది,

నవ మాసాలే మోసేది

మాతృభూమి మోస్తుంది,

కలకాలం దాస్తుంది


జన్మభూమి రుణ భారము

తీర్చలేరు ఏమాత్రము

మనషి మనుగడకు మూలము

తెలిసి మసలుకో అనిశము


సహనానికి మారుపేరు

మన క్షేమము కోరు కోరు

మాతృభూమి ఔన్నత్యము

వర్ణింపగ ఎవరు లేరు!


మట్టి తల్లి ఎదలోన

కనుమూసే కడ దాకా!

గుర్తించుకో గుండెలోన

మాతృభూమిని అందాకా!



-గద్వాల సోమన్న



Comments


bottom of page