మాతృమూర్తి
- Gadwala Somanna
- Dec 14, 2024
- 1 min read
Updated: Jan 14
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మాతృమూర్తి, #Mathrumurthi

Mathrumurthi - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 14/12/2024
మాతృమూర్తి - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
మొదటి గురువు మాతృమూర్తి
జగతిలోన గొప్ప స్పూర్తి
మరుపురాని సేవలతో
ఆర్జించును ఆమె కీర్తి
కుటుంబాన వెలుగు జ్యోతి
బిడ్డలకు చెప్పును నీతి
సృష్టికామె ఆధారము
సహకరించును ఈ రీతి
అమ్మ మాట నవనీతము
మధురమైన సంగీతము
దివిలోని పారిజాతము
భువిలోన ఆమె హృదయము
చమురు లేని ప్రమిద సమము
నీరు లేని జలాశయము
అమ్మ గనుక లేకుంటే
అంతా అతలాకుతలము
భగవంతుని బహుమానము
మాతృమూర్తి అపురూపము
క్రొవ్వొత్తి వోలె త్యాగము
అక్షరాల నిజము! నిజము!!
కుటుంబాన్ని దిద్దుతుంది
మమకారం పంచుతుంది
గుండెల్లో పెట్టుకుని
సమానంగా చూస్తుంది
సదన కోవెలలో దేవత
నిర్వర్తించును బాధ్యత
ఆరాధింప అమెకుంది
వంద శాతము అర్హత
మాతృమూర్తి లేని చోటు
ఎవరూ ఊహించలేరు
ఆమె లేక పెద్ద లోటు
ఆ స్థానము పూడ్చలేరు
-గద్వాల సోమన్న
Comments