నా నేస్తం పుస్తకం
- Gadwala Somanna
- Jan 19
- 1 min read
Updated: Jan 25
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NaNesthamPusthakam, #నానేస్తంపుస్తకం

Na Nestham Pusthakam - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 19/01/2025
నా నేస్తం పుస్తకం - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
నా నేస్తము పుస్తకము
వెలిగించును మస్తకము
త్రుంచుతుంది అజ్ఞానము
పంచుతుంది విజ్ఞానము
ప్రయాణంలో తోడుగా
వస్తుంది మిత్రునిగా
సద్విషయాలు బోధించి
దిద్దుతుంది గురువుగా
ఒళ్ళంతా అక్షరాలు
వెలుగులీను కాగడాలు
పుస్తకము నా నేస్తము
అందించు స్నేహ హస్తము
అద్దంలా పుస్తకము
లోపాలను చూపించును
సృష్టికర్త బ్రహ్మ వోలె
తలరాతలు సరిదిద్దును
చదివితే పుస్తకాలు
బాగుపడును జీవితాలు
పలకరించును ప్రేమతో
పులకరించును హృదయాలు
పుస్తకాల పుట్టినిల్లు
భువిలో గ్రంథాలయాలు
ప్రతిదినమూ పఠిస్తే
మదిలో సంతోషాలు
పుస్తకం హస్త భూషణము
పరికింపగ అలనాడు
ప్రపంచాన్ని చరవాణి
ఏలుతుంది ఈనాడు
పుస్తక భాండాగారము
దర్శించాలోయ్! నిత్యము
మనశ్శాంతి నింపుతుంది
పెంచుతుంది వికాసము
పుస్తకం హస్త భూషణము
పరికింపగ అలనాడు
ప్రపంచాన్ని చరవాణి
ఏలుతుంది ఈనాడు
పుస్తక పారాయణము
శ్రేష్టమైన అలవాటు
నేర్పుతుంది క్రమశిక్షణ
ఇచ్చును బ్రతుకుకు రక్షణ
-గద్వాల సోమన్న
Comments