top of page

నగర జీవితం

Updated: Mar 4

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #నగరజీవితం, #NagaraJeevitham, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Nagara Jeevitham - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 22/02/2025

నగర జీవితంతెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


నగరం అర్ధరాత్రి ఒళ్ళువిరుచుకుని వగలు ఒలకబోస్తూ రారమ్మని పిలుస్తుంది 

దాని హొయలు తళుకు బెళుకులు చూసి వలలో పడ్డామంటే అయిపోతావు బేవార్సు

మత్తుమందుల స్వైర్య విహారం హద్దూపద్దూలులేని నైట్ పబ్బుల వ్యామోహం

ఆకర్షణల మాయాజాలంలో సమిధలు మాడిపోయే UVA జీవితాలు

భక్తి వ్యాపారం చదువు వ్యాపారం ప్రేమవ్యాపారం ఆసుపత్రుల వ్యాపారం

వారాంతపు సెలవుల విశృంఖలత్వం ఆడా-మగా తేడాలేని రాసక్రీడలపర్వము

బర్త్డే పార్టీలు వాలంటైన్ముచ్చటలు బాయి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ డేటింగులు గిఫ్టులు

డబ్బు విస్కీల్లో ఏరులై పారుతుంది ఎవరు ఎంత ఖర్చు చేస్తే అంతకాలం స్నేహాలు

అమ్మా నాన్నలకు తెలియని ఆధునిక స్వేచ్ఛా ప్రపంచంలో విహంగాలు

పెళ్లివద్దు భర్తకు లొంగివుండాలి స్వేచ్ఛకు సంకెళ్లు పడతాయి

బంధాలలో బందీలు అవడము నచ్చదు 

చదువుకోసం ఉపాధికోసం వస్తారు హాస్టల్లో అబ్బాయి అమ్మాయి కలిసి వుంటారు

చదువు అటక ఎక్కుతుంది చిల్లర సంపాదనతో రోజు గడిచిపోతుంది అడిగేది ఎవరు

గ్రామాలలో తల్లి తండ్రులు అయిదరాబాదులో జాబు.. మా వోడికి.. అనుకుంటారు

వాడు ఏమి వెలగ బెడుతున్నాడో తెలియదు పాపం తెలిసినా ఏమి అనలేని ఏకైక బిడ్డ అతడు

అమ్మాయి తక్కువ తినదు మేకప్పులు అబ్బాయిలతో సినిమాలు విహారాలు అడ్డమైన తిళ్ళు 

డబ్బు ఎలా సంపాదించాలి అనే భయంలేదు ఎలాగైనా సంపాదించవచ్చు ఇది నగరం

మాల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్టులు చదువు పదోక్లాసు చాలు రోజుకు ఒకచోట మారవచ్చు

ఔరా నగరజీవితం మారిపొయిన్ది యువతకు స్వర్గం ధామం ఐనది నాగరికత నగ్నంగా నవ్వింది

సాంప్రదాయం సిగ్గుతో ముడుచుకుపోతూ కనుమరుగై పోయింది!


********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





Comments


bottom of page