top of page

నీటి బొట్టు ఒడిసి పట్టు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KendraBinduvuHrudayam, #NeetiBottuOdisiPattu, #నీటిబొట్టుఒడిసిపట్టు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 32

Neeti Bottu Odisi Pattu - Somanna Gari Kavithalu Part 32 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 12/03/2025

నీటి బొట్టు ఒడిసి పట్టు - సోమన్న గారి కవితలు పార్ట్ 32 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


నీటి బొట్టు ఒడిసి పట్టు


ప్రాణాధారమే నీరు

ఎవ్వరూ కాదనలేరు

వృధా చేస్తే కన్నీరు

ఆదా చేస్తే పన్నీరు


బొట్టు బొట్టు ఒడిసి పట్టు

జీవకోటికి అవసరము

వద్దు వద్దు నిర్లక్ష్యము

ఉదాసీనత ప్రమాదము


నీరు గనుక వృధా చేస్తే

భవిష్యత్తు తరాలకు

పొంచియుండు పెనుముప్పు

ముందుచూపు ఉన్న ఒప్పు


నీరు లేక పెను ఇక్కట్లు

చేయబోకు పొరపాట్లు

జాగ్రత్తగా వాడితే

తీరును నీటి సమస్యలు

ree














అక్షరము అవసరము

----------------------------------------

జీవితాన అక్షరము

ఎంతైనా అవసరము

లేకుంటే భవిష్యత్తు

అవుతుందోయ్! నిర్వీర్యము


అందుకే నేర్వాలోయ్!

అందాల అక్షరాలు

అందరికీ నేర్పితే

వర్ధిల్లును జీవితాలు


విలువైనది అక్షరము

బలమైనది అక్షరము

తలరాతలు మార్చేది

బ్రతుకు బాగు చేసేది


అక్షరమే ఆయుధము

అభివృద్ధికాధారము

తొలగించును అజ్ఞానము

పెంపుజేయు విజ్ఞానము


కాంతులీను అక్షరము

నింగిలో నక్షత్రము

చీకట్లు తరిమికొట్టి

వెలిగించును జీవితము

ree















అమ్మ అమృత బోధ

----------------------------------------

సత్యాన్ని నమ్ముకో!

ముత్యంలా చూసుకో!

ఎప్పుడైనా గెలిచేది

సత్యమని తెలుసుకో!


బద్దకం వదులుకో!

అబద్ధం మానుకో!

చురుకుదనం మంచిది

కొండంత పెంచుకో!


అసూయను త్రుంచుకో!

అభివృద్ధిని కోరుకో

నిరంతర సాధనతో

లక్ష్యాన్ని చేరుకో!


దైవాన్ని వేడుకో!

దీవెనలు అందుకో!

జీవుతాన్ని దిద్దుకొని

సార్థకం చేసుకో!


ధైర్యాన్ని నింపుకో!

గర్వాన్ని చంపుకో!

వినయాన్ని కల్గియుండి

విజయాన్ని పొందుకో!

ree












మాస్టారు ప్రబోధ గీతికలు

----------------------------------------

సూర్యోదయమైతే

చీకట్లు మాయమగును

ఆత్మవిశ్వాసముంటే

అపజయాలు దూరమగును


పున్నమి అరుదెంచితే

భువిని వెన్నెల జల్లులు

అవకాశమందుకుంటే

అద్భుతాలు వేనవేలు


కోపాన్ని అదుపు చేస్తే

లాభాలు కోకొల్లలు

ద్వేషాన్ని నియంత్రిస్తే

వికసించును ప్రేమపూలు


సద్గుణాలు పెరిగితే

అవలక్షణాలు తరిగితే

జీవితాల్లో వెన్నెల

కుటుంబాల్లో కళకళ

ree












తాతయ్య హితవు

----------------------------------------

వెంటనే ఎవ్వరినీ

చేసుకోకు అపార్థము

తొందరపాటుతనంతో

జరుగుతుంది అనర్ధము


క్షణికావేశంలోనూ

తీసుకోకు నిర్ణయము

అట్టి స్థితి తెచ్చిపెట్టు

అతిపెద్ద ప్రమాదము


వ్యసనాలే ముదిరితే

నాశనం జీవితాలు

ఆదిలోన త్రుంచితే

బాగుపడును కుటుంబాలు


సంక్లిష్ట పరిస్థితులను

చేసుకోవాలి అర్థము

యోచిస్తే దొరుకుతుంది

సమస్యకు పరిష్కారము


-గద్వాల సోమన్న


Comments


bottom of page