నేటి భూతాలు
- Vedurumudi Ramarao
- Mar 19, 2022
- 6 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Neti Bhuthalu' New Telugu Story Written By Vedurumudi Ramarao
రచన: వెదురుమూడి రామారావు
పంచ భూతాలకు కొత్త అర్థం చెప్పడంతో బాటు పరిష్కారం కూడా సూచించారు ప్రముఖ రచయిత వెదురుమూడి రామారావు గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం
సాయంత్రం ఏడు గంటలు అవుతోంది . వాతావరణం చల్లగా వుంది. రావు గారు వరండా లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు. ఇది మంచి సమయం ఆయనతో మాట్లాడ్డానికి.
అతన్ని చూడగానే " రా గోపి " అంటూ చిరునవ్వుతూ ఆహ్వానించారు. ఆ నవ్వే ఆయన లో ప్రత్యేకత. ఎప్పుడు అంత సంతోషంగ ఎలా ఉండ గలుగుతున్నారో !! . ఆయన ఒక స్థిత ప్రజ్ఞుడు. ఆయనతో పది నిముషాలు కూర్చుంటే ఏదో ఒక సందేశం, విజ్ఞానం కలుగుతాయి.
వారి సతీమణి రాధమ్మ గారు మూర్తీభవించిన లక్ష్మి దేవి, పార్వతి దేవి కలబోసిన దేవతలా వుంటారు.తెల్లటి శరీర ఛాయతో, పసుపు రాసిన మొహం మీద కాసింత కుంకుమ బొట్టుతో, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా అందరిని ఆప్యాయంగా పలకరించుతూ వుంటారు. ఆ ఊరి లో అందరికి ఆవిడ ఒక మార్గదర్శిని. రావుగారి ఇంటికి దగ్గరగా గోదావరి పాయ ప్రవహిస్తూ ఉంటుంది . పచ్చని చెట్ల మధ్య ఉన్న ఇల్లు, ముంగిట గోశాల , అలికిన ప్రాంగణం, చూసిన వారందరికీ ఒక భక్తి భావం ఏర్పరుస్తుంది. ఇద్దరికీ నమస్కరించి రావు గారితో తన సందేహాన్ని వెలిబుచ్చాడు గోపి.
"మీరు ఎప్పుడూ అంత సంతోషంగా ఎలా ఉండ గలుగుతున్నారు?” అని ప్రశ్నించాడు గోపి.
"పరిసరాలు, పరిస్థితులు అన్నీ మన అందరికీ సమానంగానే వున్నాయి కదా . మేం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఎలా ? నా కెందుకో ఈ మధ్య నా మీదే, చాలా చికాకుగా, ఏదో భయంగా, కోపంగా ఉంటోంది అండి. ఏం చెయ్యాలి" ? అంటూ మొహం వేళ్ళాడేసుకొన్నాడు గోపి.
రావు గారు చిన్నగా నవ్వి ' నా ప్రత్యేకత ఏం లేదు గోపి. మనం కొంచం ఆలోచించుకొని అలవాటు చేసుకొంటే ఏదయినా సాధ్యమవుతుంది. సృష్టి లో మధురమైనది ఆనందం, సంతోషం. దీనినే ‘సంతృప్తి’ అని కూడా అందాం. ఒక్క మాట చెపుతాను విను. ఎవరైనా సంతోషంగా ఉండడానికి గాని , సంతృప్తిని పెంచుకోడానికిగాని కష్టపడాలేమో గాని , ప్రయత్నిస్తే ‘అసంతృప్తిని’ తగ్గించుకోడానికి మాత్రం వీలవుతుంది” అన్నారు.
" ఎలా ?” అడిగాడు గోపి.
"సంతృప్తిని వున్న పరిధి లో ఉంచుకొని కలుగుతున్న అసంతృప్తిని, వాటి కారణాలని, తగ్గించుకోడానికి మార్గాలని వెతుక్కోవచ్చు. వాటిని ఆచరించ గలిగితే ఆటోమేటిక్ గా మన సంతోషం, సంతృప్తి పెరిగి నట్టే. మనిషికి సంతోషం- సంతృప్తి, ధనం, కుటుంబం, విలాసాల వల్ల తప్పకుండ ఏర్పడుతుంది . కానీ వీటికి ఒక హద్దు ఉంటుంది. అవి కాక మనం ఆచరించవలసినవి, మన చేతులలో వున్నవి కొన్ని వున్నాయి. వాటిని విశ్లేషించుకొని, ఏ విధంగా మలచుకోవచ్చు అని ఆలోచిస్తే ఎక్కువ శాతం సంతోషాన్ని వశం చేసుకోవచ్చు. వాటి గురించి ఆలోచిద్దాము” చేతిలో వున్న పేపర్ ని పక్కన పెట్టారు రావు గారు.
ఇదేదో వినడానికి బాగున్నది. గోపి మొహం ఇంకా ప్రశ్నార్థకంగానే వుంది. మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న వెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. రావు గారు తన వాక్ ధాటిని కొనసాగిస్తున్నారు.
“అసలు ఈ సంతోషం,సంతృప్తి ని సంపాదించడానికి మనకు వచ్చే అడ్డంకులు ఏమిటి అని ఆలోచించాలి కదా ! ఆ అడ్డంకుల్ని మనం విశ్లేషించగలిగితే , వాటిని తగ్గించుకోడానికి గాని నిరోధించడానికి గాని ప్రయత్నం చెయ్యచ్చు. ఆ రకం గా ఒక్కొక్క అడ్డంకిని మనం నియంత్రించుకో గలిగితే, కనీసం నిర్వహించుకోడానికి ప్రయత్నిస్తే దానంతట అదే ‘ సంతృప్తి ‘ కి దారి తీస్తుంది. ఇదేదో లెక్చర్ అనుకోకుండా భావార్ధం మనసుకి పట్టించుకో. వద్దు అనుకొంటే చెప్పు. మనం ఈ అంశం ఇక్కేడే ఆపేద్దాము” అంటూ కొంచం ఆగారు రావు గారు.
“నీకు మీ రఘు బాబాయ్ గుర్తు వున్నాడా ..” సడన్ గా టాపిక్ మారిపోయింది. అతనంటే అందరికీ హడల్ కదా.! చాలా కోపం గల మనిషి. అనవసరంగా అందరిమీద కోపం తెచ్చుకొని తన ఆరోగ్యం పాడుచేసుకోవడమే కాకుండా అందరికి చెడ్డ ఐయ్యాడు . కానీ ఇపుడు ఎంత మంచిగా వున్నాడో చూసావు కదా . ఏం చేసాడు ? తనంతట తాను ఆచరించవలసిన విధానాల గురించి తెలుసుకొని ఆచరించి, మంచి మనిషిగా మారాడు. తాను సంతోషంగా ఆరోగ్యంగా వున్నాడు. ఇలాగ ప్రతి మనషి తనను తాను నిర్వహించు కోడానికి పనికి వచ్చే సూత్రాలు కొన్ని నేను చెబుతాను.
ఇవేం నా కల్పితం కాదు, కొత్తవి కాదు. నేను మాత్రం వీటికి నా ముద్దు పేరు " పంచ భూతాలు" అని పెట్టుకున్నాను. ఈ పంచ భూతాలని మనం నిర్వ హించు కుంటే చాలు. పంచ భూతాలు తెలుసుగదా”? ఆయన ప్రశ్న .
‘అవునండి అవి అగ్ని, వాయు, భూ, జల, ఆకాశ అని అంటారు కదా’ అని అన్నాడు గోపి.
“అలాగే నేను తమాషాగా చెప్పబోతున్న వేరే పంచ భూతాలు కూడా వ్యక్తి జీవితము లో ముఖ్య పాత్ర వహిస్తాయి. వాటిని కూడా మనం ప్రయత్న పూర్వకంగా నియంత్రించు కోవడం అలవాటు చేసుకొంటే జీవితం సుఖమయ మవుతుంది.
అసలయిన పంచ భూతాలు ఒక వ్యక్తి యొక్క అంతర్గత శక్తి ని ఇనుమడింప చేసి సరైన మార్గంలో నడిపిస్తాయి. అవి అతనికి, సమాజానికి ప్రయోజన కారకముగా ఉంటాయి. అవి ప్రతికూల అంశాలకు దారితీస్తున్నప్పుడు ఆటంకాలను సృష్టిస్తాయి. ప్రతికూల శక్తులకు బానిస కాకుండా వాటిని ఎలా నియంత్రించుకోవాలో ఆ వ్యక్తి ప్రయత్నించు కోవాలి . ఆవే
వాయు - ప్రాణ శక్తి – ( ధ్యానం, ప్రాణాయామం ద్వారా మనం ఈ శక్తి ని పెంచుకోవచ్చు)
ఆకాశం - ప్రకృతి - అవగాహనా సామర్ధ్యం –( ప్రశాంతత -సమతుల్య స్వభావం. ప్రకృతి తో సన్నిహితంగా ఉండి )
భూమి - సహన శీలత - దాన గుణం- (ఇతరులకు సేవ చేయడం , ప్రకృతికి సహాయం చేయడం గురించి ఆలోచించడం)
జల - జీవ రాశులకు ఆధారం - ముఖ్యమైన శక్తి. (శరీరానికి సరిపడా స్వచ్ఛమైన నీటిని నిర్వహించడం . ఏ సమయంలోనైనా శరీరం మనస్సును శుభ్రంగా ఉంచుకోండి)
ఒక వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖమయంగా గడపాలి అంటే ఈ అయిదు భూతాలని సమతుల్యంగా నియంత్రించుకో గలగాలి.
అలాగే నే తమాషాగా చెప్ప బోతున్న వేరే ''పంచ భూతాలూ'' కూడా వ్యక్తి జీవితము లో ముఖ్య పాత్ర వహిస్తాయి. వాటిని కూడా మనం ప్రయత్న పూర్వకంగా నియంత్రించు కోవడం అలవాటు చేసుకొంటే జీవితం సుఖమయ మవుతుంది.
"ఈ భూతాలు నిజంగా భూతాలూ కాదు. ఇంకా మనం తరచూ వినే పంచ తత్వాలు అనేవి ఆధ్యాత్మిక పంచ తత్వాలు భూతాలూ - భూ,జల, వాయు, ఆకాశం, అగ్ని కూడా కాదు. నేను చెప్పబోయేవి మనకు ప్రత్యేకంగా హాని చేసే కొన్నిమానవ ప్రవృత్తులు. మనకు నిజంగా హాని చేస్తున్నవి, మన అందరి ప్రవర్తన, నడవడిక, దైనందిక జీవనం మీద ప్రభావితం చేస్తున్నవి. ఈ పంచ ప్రవృత్తులే. ..పూర్తి వివరాల లోకి వెళ్లకుండా ఈ ఐదు అంశాల కార్యాచరణలను క్లూపంగా పరిశీలంచవచ్చు. ఒక వ్యక్తి జీవితం లో ఇవి పోషించే పాత్రలను చూద్దాం.
వీటిని నేను "నేటి భూతాలు" అంటాను.. ఇది కొంచం హాట్ టాపిక్ ఐనప్పటికీ ఓపిక తో విను, గోపి” అన్నారు. "వింటావా బోరు కొడుతోందా ?” అంటూ గట్టిగా నవ్వారు రావు గారు . .
అవి..
కోపం - నిరాశ - భయం - విచారం - విసుగుదల
చాలా తమాషా గా అనిపించింది . అవును వీటిగురించి చాలా తరుచు గా వింటూనే, అంటూనే అనుభవిస్తూనే, ఉంటాం కదా .ఇలా ప్రత్యేకంగా మనకి మనం అన్వయించుకో గలిగితే ఇంత ఉపయోగం వుంటుందా ? అని ఆలోచన్లో పడ్డాడు గోపి. ఈ ఆలోచన బాగుంది .
"అందరికి తెలిసిందేకదా . వీటితో ఏ విధం గా వ్యవరించాలి ? మీరే చెప్పండి” అని నిట్టూర్చాడు గోపి.
వీటిని గురించి మనం ‘ఫన్నీ’ గా చెప్పుకుందాం. వీటికి మందు మాకులు ఏమీ లేవు గాని ప్రయత్నించాల్సిన, ఆచరించాల్సిన విధానాలు కొన్ని చూడచ్చు. ముఖ్యం గా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఇవన్నీ ఒక్కొక్కటి గా రావు. అన్ని కలిసి రావచ్చు, కొన్ని కొన్ని కలసి రావచ్చు. అవి ఏ సమయానికి ఆ వ్యక్తి ని ఆవరించవచ్చు అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఏ భూతం ప్రభావం ఆ వ్యక్తి మీద ఉందొ దాన్ని, దాని అనుయాయినీ గుర్తించి మనం తదనుగుణంగా సవరణ చేసుకోగలిగితే దానినుంచి బయట పడచ్చు.
నేను చదివిన పుస్తకాలలో వీటినిగురించి ఒక అమెరికన్ ప్రొఫెసర్ తమాషాగా రాసారు. ఆ ఆధారంగా నేను కొన్ని ఉపాయాలు గురించ్చి తమాషా గా చెబుతాను. తేలికైన విధం గా చిన్నపిల్లల ఆటల్లాగా, తేలిక పాటిగా, కొన్ని విధానాలు చెప్పుకొందాం” నవ్వుతూ అన్నారు రావు గారు.
"అంత తీవ్రం గా ఆలోచించకు. మన వీలుని బట్టి అన్నిటిని ఒక్క సారిగానో లేదా ఒక్కొక్కదాన్ని ఒకొక్క సారిగా నో సాధించడానికి ప్రయత్నిద్దాము".
వాతావరణం కొంచం వేడిగా మంచిగా అనిపించింది.
రాధమ్మ గారు వంటింట్లోంచి నవ్వుతూ రెండు కప్పుల కాఫీ పట్టుకొని వచ్చారు.
"పాపం వదిలేయండి అతన్ని. మీ బోరింగ్ ఉపన్యాసం తో అతనికి తల నొప్పి వచ్చి ఉంటుంది. ముందు కాఫీ తాగనివ్వండి" అంటూ ఒక కప్పు గోపికి, ఒక కప్పు ఆయనకీ ఇచ్చారు. సరి ఐయిన జంట వాళ్లిద్దరూ .
రావు గారు నవ్వుతూ "నేను ఏం కట్టి పడేయలేదు గోపి ని . మళ్ళా ఎప్పుడైనా కూర్చున్దామా గోపి?"అన్నారు.
“లేదండి. ఈ అంశం చాలా ఆసక్తికరంగా వుంది. వారిని చెప్పనివ్వండి” . అని వేడుకొన్నాడు గోపి.
రావు గారు లేచి పచార్లు చేస్తూ చెప్తున్నారు.
“ఈ ఒక్కొక్క భూతం గురించి పూర్తిగా మాట్లాడాలి అంటే చాలా టైం పడుతుంది. మనం ప్రస్తుతానికి క్లుప్తంగా ఆనుకొని , ఆలోచించుకొని తరువాత ఆచరణ కోసం మనంతట మనం విశదీకరించుకోవాలి .
ముందు గా కోపం గురించి మాట్లాడుదాం. - అందరికి తెలుసు కోపం మంచిది కాదని. దాని వల్ల శారీరికంగా, మానసికం గా, సామాజికంగా వచ్చే నష్టాలు కూడా తెలుసు. ‘తన కోపమే తన శత్రువు’, అనే నానుడి కూడా చిన్నప్పటినించి వింటూనే, అంటూనే వున్నాం. అయితే దీనిని నిర్వహించుకోడానికి తమాషాగా ఈ క్రింది చిన్న చిట్కాలు ప్రయత్నించవచ్చు . మనసు , ఆలోచన. దీనిని అధిగమించడానికి ఎం చెయ్యచ్చు? కొన్ని చిన్ని చిట్కాలు చూద్దాము.
నీలో నువ్వే ఆ విషయం గూర్చి మార్చి మార్చి మాట్లాడుకోవడం / తలుపులు వేసుకొని రూమ్ లోకి వెళ్లి గట్టిగ అరచుకోడం / శక్తి వంతమైన శారీరిక వ్యాయామం చేయడం / చురుకైన నడక కి వెళ్లడం /పెంపుడు జంతువుల తో ఆడుకోడం / దిండు తో యుద్ధం చెయ్యడం, వీలయితే ప్రాణాయామం చెయ్యడం / ఇంకా మంచిది ధ్యానం చెయ్యడం. క్షమించేయడం . ఇలాంటివి. ప్రయత్నించ వచ్చు కదా.
తరువాత నిరాశ- ఇది ఆవరించిన సమయం లో, ఒక చోట కూర్చొని మీరు ఇదివరలో సాధించిన మంచి విజయాల్ని గుర్తు తెచ్చుకోవడం / మంచి పాజిటివ్ సినిమా చూడడం/ ఏదయినా ఒక మంచి పని చెయ్యడం/ అవసరం వున్న వాళ్లకి సాయం చెయ్యడం/ మంచి పుస్తకాలు చదవటం/ ఒక కాగితం తీసుకొని చేయవలసిన పనులు రాయటం / నమ్మకం ఉంటే గుడికి వెళ్ళటం / మంచి వక్తల ఉపన్యాసాలని వినడం/ ఇలా ..
ఇంక భయం:- ఈ భూతానికి కారణం ఉండదు. చిన్న పెద్ద వ్యత్యాసం ఉండదు . లాజిక్ తో ఆ అనుభవం గురించి ఆలోచించ గలిగితే చాలా మంచిది / కావలసిన వాళ్లతో ఆ విషయం చర్చిం చడం / మంచి పుస్తకాలు చదవడం/ భగవన్నామ సంకీర్తనం/ ఇటువంటి పరిస్థితులని ఎదుర్కొన్న వారిని సంప్రదించడం/ డైరీ గా రాసుకోవడం/ మంచి స్నేహితులతో మాట్లాడడం / అదే సమస్య మీద దృష్టి కేంద్రీకరించి మనస్సు నించి తరిమి వేయడానికి ప్రయత్నించడం . ఇలా…
ముఖ్యమైనది మానసిక విచారం:- చాలా మంది అనవసరం గా, ఎక్కువగా, తాను బాధల లో ఉన్నాను ఆనుకొని బాధ పడుతూ వుంటారు. ఇది పెద్ద భూతం. ముందు చెప్పుకున్నట్టు గా దాని మూలం గురించి లోతుగా ఆలోచించేస్తే దానంతట అదే దూరం ఐయిపోతుంది / సమాజం లో చాలా మంది ఇంకా దయనీయ మైన స్థితిలో వున్నారు అని తెలుసుకోవాలి/ జరిగిన అవస్థలు మన చేతిలో లేవు అని తెలుసుకోవాలి/ మంచి సంగీతాన్ని వినడం / మంచి ట్యూన్స్ కి డాన్స్ చెయ్యడం / ఇష్టమైన సినిమాలు చూడడం / చాలా వ్యాయామం చెయ్యడం/ మంచి స్నేహితులతో గడపడం/ ప్రాణాయామం చెయ్యడం/ గుడి కి వెళ్లడం / భక్తి మార్గం లో చరించడం. ఇలా..
ఈ కాలం లో ప్రతి వారు అనుకొంటున్నది ,విసుగుదల: 'బోర్ డం' అంటే ఈజీ గా అర్ధమవుతుంది . జీవితమే 'బోర్' అంటుంటారు కొందరు. అది ఒక ఊత పదం . దీనినుంచి బయట పడడం చాలా సులభం. చురుకైన యువ వ్యక్తులను గమనించడం / కొత్త కొత్త చదువులలో పాల్గొనడం / స్వత్చంద సేవలో పాలు పంచు కోవడం/ పిల్లల తో ఆడుకోవడం / కొత్త విషయాల మీద ఆసక్తి చూపించడం/ సంగతం, వాద్యాలు నేర్చుకోవడం, కాకపోతే వినడం/ ఎదో ఒక పని లో పాల్గోవటం / ముఖ్యం గా ఎ పని చేయకుండా బద్ధకం గా కూర్చోక పోవడం. ఇలా.. ఈ పంచ భూతాల తత్వాలన్నీ అవగాహన చేసుకొని వాటిని ఈ "నేటి భూతాల ను" అదుపులో తెచ్చుకోడానికి అన్వయించుకొంటే మానవుడు సుఖమయమైన జీవితాన్ని సాధించ గలడు.
గోపి కొంచం ఇబ్బంది గా ఉన్నట్టు కనిపించాడు . “ నా భారీ ఉపన్యాసం ఐ పోయింది కదా ! వీటిలో అన్నీ కాక పోయినా కొన్నేనా, అలవరచు కోడానికి ప్రయత్నిస్తే మనం అసంతృప్తి ని తగ్గించుకోవచ్చు. చాలావరకు సంతోషం గా ఉండచ్చు. నేను కొంచం, కొంచం గా ప్రయత్నిస్తున్నాను . ఆలోచించుకో, అలవరచుకో’ అని చిన్నగా నవ్వారు . వీలయితే ఈ విషయాలు తెలిసిన వాళ్లతో పంచుకో."
గట్టిగ గాలి పీల్చుకొన్నారు రావు గారు. గోపి కూడా కొంచం ఈజీ గ కూర్చున్నాడు. లేచి వెళ్ళడానికి రెడీ అయినట్టుగా సూచించాడు.
లోపల నించి రాధమ్మ గారు “ఎలాగా ఇంత సేపు వున్నావు. ఏకంగా భోజనం చేసి వెళ్ళు. మంచి చారు పెట్టాను “ అని ఆజ్ఞ జారీ చేశారు . మెదడుకి మంచి ఆహరం దొరికింది కదా !!
ఆలా ఇంకా ఆలోచిస్తూ మంచి డిన్నర్ కోసం వేచి చూస్తున్నాడు. గోపి .
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
コメント