top of page
Original.png

నిజాల నిప్పు కణికలు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NijalaNippuKanikalu, #నిజాలనిప్పుకణికలు

ree

Nijala Nippu Kanikalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 16/01/2025

నిజాల నిప్పు కణికలుతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కాకూడదు! మదిలోన

కన్నవారే బరువు

అవసాన దశలోన

ఆదరిస్తే పరువు


విజ్ఞానం పంచే

గురువే కల్పతరువు

మంచిని బోధించే

భగవంతుడే గురువు


జీవితాలు సరిచేసి

చూపును బ్రతుకు తెరువు

విజ్ఞాన గని గురువు

మెదడుకు వేయు ఎరువు


విలువైన పుస్తకాలు

విజ్ఞానానికి నెలవు

అనుదినము పఠిస్తే

మేలులెన్నో కలవు


కష్టపడక పోతే

విజయాలే దొరకవు

అపజయాల పరంపర

జీవితాన తప్పవు


పగటి కలలు కంటే

ఆశలు నెరవేరవు

బద్ధకం వశమైతే

మనోవాంఛలు తీరవు


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page