నూతిలో కప్ప
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #NuthiloKappa, #నూతిలోకప్ప, #తెలుగుజాతీయాలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

'Nuthilo Kappa' - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 21/10/2024
'నూతిలో కప్ప' తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
పూర్వం హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా కప్పలు హాయిగా జీవించేవి. ఉభయచరాలు కావడం వల్ల సాయంత్రం అయ్యేసరికి నీటిలో నుంచి బయటకి వచ్చి చుట్టూ ఉన్న చెట్లను, నీలాకాశాన్ని చూసి మురిసిపోయేవి. వాటిలో అజిరము అనే కప్ప ఒకటి. ఆ కప్పలన్నీ ఒడ్డున ఉన్న చెట్లమీద నివసించే పక్షులతో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేసేవి. ఆ సరస్సుకు దగ్గరలో ఉన్న నేల నూతిలో మండూకం అనే బావురు కప్ప తన కుటుంబం తో కలసి హాయిగా జీవిస్తూ ఉండేది.
అజిరం ఒకరోజు నూతి దగ్గరికి వెళ్లి మండూకాన్ని పలకరించింది. “ఈ నూతిలో నీళ్ళు వేసవిలో కూడా చల్లగా ఉంటాయి. విశాలమైన ప్రదేశం. కావలసినంత ఆహారం. ప్రాణభయం ఉండదు. మా దగ్గరికి వస్తావా!” అని అజిరాన్ని అడిగింది మండూకం.
“మిత్రమా! నీ మాటలు వింటూ ఉంటే నవ్వొస్తోంది. ఈ నూతిలో నుంచి నువ్వు బయటకి వస్తేనే కొత్త లోకాన్ని చూడగలవు. కొండలు, కోనలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని చూడగలవు. ప్రకృతి అందాన్ని ఆస్వాదించగలవు. నా మాట విని బయటకు రా!” అంది అజిరం.
“ఇంకో ప్రపంచమా? నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. నాకు ఈ నుయ్యే ప్రపంచం. దీనిని మించినది లేదు. ” అని వితండ వాదన చేసింది మండూకం.
చేసేదేమీ లేక వెనుదిరిగింది అజిరం. మిత్రులకు ఈ విషయం చెప్పింది. మర్నాడు చిలుక వెళ్ళి “ ఓ మండూకమా! మిత్రుడు అజిరం చెప్పింది అక్షర సత్యం. నేను రోజూ ఎన్నో రకాల పళ్ళు తింటాను. పచ్చని చెట్ల మధ్య విహరిస్తాను. నువ్వు బయటికి వస్తే ప్రకృతి అందాలు చూడొచ్చు” అంది.
తరువాత పావురం వెళ్ళి “నేను ఆహారం కోసం కొండలు గుట్టలు దాటి వెళ్తాను, గుళ్ళు గోపురాలు చూస్తాను, పెద్దపెద్ద భవంతుల పైకెగిరి వస్తాను. నాతో వస్తే అన్నీ చూపిస్తాను. ” అంది పావురం.
ఎవరు ఎన్ని చెప్పినా “ఈ నుయ్యిని మించిన గొప్పలోకం, అద్భుత ప్రపంచం లేదని” తెగేసి చెప్పేది మండూకం. చేసేదేమీ లేక చెప్పడం మానుకున్నాయి కప్పలు, పక్షులు. అప్పటి నుంచి నూతిలో కప్పలు అనే జాతీయం వాడుకలోకి వచ్చింది.
మండూకం లాంటి మనుషులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. వారు ఎవ్వరితోనూ కలవరు. తాము ఉన్న ప్రదేశం దాటి బయటకు వెళ్ళరు. వారు ఉన్న చోటునే గొప్పగా భావిస్తారు. అందువల్ల వీరికి లోకం పోకడ తెలియదు. సమాజంలో జరిగే మార్పులు, చేర్పులు తెలియవు. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలు, వింతలు, విడ్డూరాలు, అద్భుతమైన కట్టడాలను చూడక ఆ అనుభూతిని పొందలేరు. ఇలాంటి వారిని నూతిలో కప్పలు అంటారు. ఇది ఒక జాతీయం.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷





Comments