ఓ విశ్వ ఋషి.. వివేకానంద
- Bhallamudi Nagaraju
- Jan 12
- 1 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #ఓవిశ్వఋషివివేకానంద, #OViswaRushiVivekananda, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

(స్వామి వివేకానంద జయంతి సందర్బంగా )
O Viswa Rushi Vivekananda - New Telugu Poem Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 12/01/2025
ఓ విశ్వ ఋషి.. వివేకానంద - తెలుగు కవిత
రచన: భళ్లమూడి నాగరాజు
పసి ప్రాయమందే
తల్లి ఒడినే బడిగా చేసుకొని
వేద సారము గ్రహించినావు
శ్రీ రామకృష్ణుని శిష్యుడవై
ఖ్యాతి గాంచినావు
గురువు పేరున
మఠము
మిషన్ నెలకొల్పి
గురుభక్తి
చాటుకున్నావు
చదువులోన
ముందు వరుస లో
నిలచి నావు
చికాగో వేదిక పై
నీ గళం వినిపించి
భళా అనిపించినావు
నీ మార్గము
మాకు అనుసరణీయం
నీ బోధనలు
యువత కు ఆచరణీయం
ఓ విశ్వ ఋషి
నీకు ఇవే
మా అక్షర నీరాజనాలు
..భళ్లమూడి నాగరాజు
రాయగడ.
Bình luận